వ్యవసాయ మంత్రిత్వ శాఖ

"అగ్రి-స్టార్టప్‌లలో మహిళలు: సప్లై చైన్ మేనేజ్‌మెంట్‌తో విలువను సృష్టించడం" పై వెబ్‌నార్


"ప్రగతిశీల మహిళా రైతులు మరియు అగ్రిప్రెనియర్ల విజయ కథలు" అనే అంశంపై ఈ-బుక్ ఆవిష్కరణ

ఎఫ్‌పిఓలు మహిళా రైతులకు విప్లవాత్మక రీతిలో ప్రయోజనం చేకూరుస్తాయి: శ్రీ కైలాష్ చౌదరి

ఆహార భద్రత మరియు స్థానిక వ్యవసాయ జీవవైవిధ్యాన్ని కాపాడడంలో మహిళలు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తారని శ్రీ కైలాష్ చౌదరి అన్నారు

ప్రభుత్వం వివిధ పథకాలు/కార్యక్రమాల కింద మహిళలకు నిధులను కేటాయించడం ద్వారా 'వ్యవసాయంలో లింగ సమానత్వం' ఎజెండాను ముందుకు తెస్తుంది.

Posted On: 22 OCT 2021 5:56PM by PIB Hyderabad

మహిళా కిసాన్ దివాస్ 2021 వేడుకల సందర్భంగా "అగ్రి-స్టార్టప్‌లలో మహిళలు: సప్లై చైన్ మేనేజ్‌మెంట్‌తో విలువను సృష్టించడం" అనే అంశంపై ఈరోజు వ్యవసాయ & రైతు సంక్షేమ శాఖ వెబ్‌నార్ నిర్వహించింది. కేంద్ర వ్యవసాయ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ మార్గదర్శకత్వంలో మరియు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ కైలాష్ చౌదరి సమక్షంలో వెబ్‌నార్ నిర్వహించబడింది. వెబ్‌నార్ సందర్భంగా శ్రీ చౌదరి 75 సంవత్సరాల 'ఆజాది కా అమృత్ మహోత్సవం' జ్ఞాపకార్థం 75 మంది ప్రగతిశీల మహిళా రైతులు మరియు మహిళా పారిశ్రామికవేత్తల విజయ కథలను వర్ణించే ఈ-పుస్తకాన్ని కూడా విడుదల చేశారు.

శ్రీ కైలాష్ చౌదరి వెబ్‌నార్‌ను ప్రారంభిస్తూ " వ్యవసాయాభివృద్ధిలో మహిళల సహకారం అనేక రెట్లు పెరిగిందని పేర్కొన్నారు. ఆహార భద్రతను నిర్ధారించడంలో మరియు స్థానిక వ్యవసాయ జీవవైవిధ్యాన్ని పరిరక్షించడంలో మహిళలు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు. వ్యవసాయ అభివృద్ధికి ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడానికి భారతదేశం కట్టుబడి ఉంది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మహిళల పాత్ర వ్యవసాయానికి మాత్రమే పరిమితం కాదని, రక్షణ, అంతరిక్షం, పరిపాలన, క్రీడలు మొదలైన అన్ని రంగాలలో వారి సహకారం స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. మహిళలు తమ కలలను నెరవేర్చుకుంటున్నారని మరియు ఇది గర్వించదగ్గ సందర్భమని ఆయన అన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంస్థల ఏర్పాటు మహిళా రైతులకు విప్లవాత్మకంగా ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు.

అగ్రిబిజినెస్‌లో మహిళా వ్యవస్థాపకతను ప్రారంభించడంపై అగ్రి స్టార్టప్‌ వెబినార్  దృష్టి పెట్టింది; అలాగే భారతదేశంలో అగ్రి-స్టార్టప్‌లకు మద్దతు ఇచ్చే వ్యూహం మరియు పథకాలు; వాణిజ్యీకరణ కోసం స్టార్టప్‌లకు టెక్నాలజీ బదిలీ; అగ్రి-స్టార్టప్స్ అగ్రిప్రెన్యూర్స్ ఎదుర్కొంటున్న విలువ గొలుసు నిర్వహణ మరియు సవాళ్ల దృష్టి పెట్టింది.  వ్యవసాయ రంగంలో ఆర్ధికం 80% మహిళలతో పనిచేస్తుంది; వీరిలో 33% వ్యవసాయ కార్మిక శక్తి కాగా 48% స్వయం ఉపాధి రైతులు ఉన్నారు.

వ్యవసాయంలో ఉత్పాదకతను పెంచడంతో పాటు వ్యవసాయ  ఉత్పత్తికి ముందు, పంటకోత తర్వాత ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్ ఇలా అన్ని స్థాయిల ఉత్పత్తిలో మహిళలు ప్రధానంగా ఉంటున్నారు. అందువల్ల లింగ నిర్ధిష్ట జోక్యాలను అవలంబించడం అత్యవసరం. ప్రభుత్వం వివిధ పథకాలు/కార్యక్రమాలు మరియు అభివృద్ధి కార్యక్రమాల ద్వారా మహిళలకు నిధులను కేటాయించడంతో 'వ్యవసాయంలో లింగ ప్రధాన స్రవంతి'ని ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తోంది; వివిధ కార్యక్రమాల లబ్ధిదారుల-ఆధారిత భాగాల ప్రయోజనాలను పొందడంలో మహిళలకు సహాయపడటానికి 'మహిళా అనుకూల కార్యక్రమాలు' ప్రవేశపెట్టడం జరుగుతోంది. మహిళా స్వయం సహాయక బృందాలు (ఎస్‌హెచ్‌జిలు), మహిళా సమాఖ్యలు మరియు మహిళా రైతు ఉత్పత్తి సంస్థల ఏర్పాటుపై దృష్టి కేంద్రీకరించబడింది; సామర్థ్యం పెంపు జోక్యం; వాటిని మైక్రోక్రెడిట్‌కు లింక్ చేయడం; సమాచారానికి వారి ప్రాప్యతను మెరుగుపరచడం మరియు వివిధ స్థాయిలలో నిర్ణయాలు తీసుకునే సంస్థలలో వారి ప్రాతినిధ్యాన్ని నిర్ధారించడం వంటి కార్యక్రమాలు చేపట్టాం.

ఈ కార్యక్రమంలో ఉన్నత మరియు మధ్యస్థాయి ఎక్స్‌టెన్షన్ కార్యకర్తలు, మహిళా రైతులు మరియు వ్యవసాయ-పారిశ్రామికవేత్తలు మరియు రిసోర్స్ పర్సన్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల నుండి విజయవంతమైన మహిళా పారిశ్రామికవేత్తలు తమ అభిప్రాయాలను మరియు అనుభవాలను వివరించారు.


 

*****



(Release ID: 1765881) Visitor Counter : 157


Read this release in: Urdu , Hindi , English