శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
అస్తవ్యస్తమైన అయస్కాంత క్షేత్రంతో సూర్యునిపై ఉన్న ప్రాంతాలలోని సౌర మంటలు & సీఎంఈలకు సంబంధించి లభించిన క్లూ సౌర వాతావరణ అంచనాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
Posted On:
18 OCT 2021 3:48PM by PIB Hyderabad
పరిశోధనల కోసం ఖగోళ శాస్త్రవేత్తలు సూర్యునిపై అస్తవ్యస్త అయస్కాంత క్షేత్రాలు లేదా చురుకైన ప్రాంతాలను అన్వేషిస్తారు. కొన్నిసార్లు ఇవి కరోనల్ మాస్ ఎజెక్షన్ (సీఎంఈ) తో పాటుగా సౌర మంటలను ప్రదర్శిస్తాయి. సూర్యుని ఉపరితలంపై అయస్కాంత క్షేత్రం నిర్మాణం మారడం లేదా సీఎంఈ పొగ వస్తుందో లేదో తాజాగా శాస్త్రవేత్తలు నిర్ధారించగలిగారు. దీనివల్ల సౌర వాతావరణం అంచనాలను మెరుగుపరచవచ్చు. ఇది భూమిపై విద్యుత్ , కమ్యూనికేషన్ వ్యవస్థలను, అంతరిక్షంలోని ఉపగ్రహ వ్యవస్థలను ప్రభావితం చేస్తుంది.
సూర్యుడి ఉపరితలం దగ్గర ఒక సంక్లిష్ట అయస్కాంత క్షేత్రం ఉంటుంది. అది దాని వేడి ప్లాస్మాకు అనుసంధానమై ఉంటుంది. ప్లాస్మా ఈ క్షేత్రంలో తిరుగుతున్నప్పుడు దాని ఆకృతిని ఎప్పటికప్పుడు మారుస్తుంది. ఈ అయస్కాంత క్షేత్రం సూర్యుని ఉపరితలంపై కొన్ని ప్రాంతాల నుండి (యాక్టివ్ రీజియన్స్ అని పిలుస్తారు) లూప్‌లలో విస్ఫోటనం చెందుతుంది. వక్రీకృతమవుతుంది. దాని జ్యామితిని తిరిగి మార్చవచ్చు. ఈ ప్రక్రియలో విపరీతమైన శక్తిని విడుదల చేస్తుంది. ఇది అప్పటి వరకు అయస్కాంత శక్తిగా నిల్వ అవుతుంది. ఈ ప్రక్రియలో వెలువడే కాంతిని (అనేక వేవ్‌బ్యాండ్‌లలో) సోలార్ ఫ్లేర్ అంటారు. సీఎంఈ భారీ మొత్తంలో వేడి గ్యాస్, దాని అయస్కాంత క్షేత్రంతో, అధిక వేగంతో సౌర కరోనాలోకి విడుదల చేస్తుంది. కొన్ని క్రియాశీల ప్రాంతాలు మంటలను ఉత్పత్తి చేస్తాయి. మరికొన్ని కొన్ని సీఎంఈలను ఉత్పత్తి చేస్తాయి. కొన్ని రెండింటినీ తయారు చేస్తాయి. ఈ ప్రాంతంలోని అయస్కాంత క్షేత్రంలో ఏదో రహస్యం ఉందని మునుపటి అధ్యయనాలు సూచించినప్పటికీ దానిని ఇప్పటి వరకు ఎవరూ ఛేదించలేకపోయారు.
శక్తిని నిల్వ చేసే అంతర్లీన అయస్కాంత ఆకృతీకరణ మాగ్నెటిక్ హెలిసిటీ అని పిలిచే పరామితి ద్వారా లెక్కిస్తారు. ఇది వక్రీకృత అయస్కాంత క్షేత్రాలను కలిగి ఉంటుంది. క్రియాశీల ప్రాంతం (ఏఆర్) కరోనా వంటి మలుపులు లేదా అయస్కాంత హెలిసిటీతో నిండి ఉంటుంది. హెలిసిటీ థ్రెషోల్డ్ స్థాయికి మించినప్పుడు, అదనపు హెలిసిటీని తొలగించడానికి సీఎంఈ ఒక్కటే మార్గం. ఏఆర్ పరిణామం సమయంలో సీఎంఈ విస్ఫోటనాన్ని అంచనా వేయడానికి కరోనల్ హెలిసిటీ బడ్జెట్ ప్రవేశ స్థాయిని కనుగొనడం ఇప్పటికీ కష్టమే.
బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్.. కేంద్ర ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ డిపార్ట్‌మెంట్కు చెందిన స్వయంప్రతిపత్తి సంస్థ. ఇందులో పనిచేసే డాక్టర్ వేమారెడ్డి సీఎంఈ లు లేకుండా యాక్టివ్ రీజియన్‌లో ఏఆర్ 12257 అనే హెలిసిటీ ఇంజెక్షన్ విలక్షణమైన పరిణామాన్ని మొదట గుర్తించారు. సూర్యుని అయస్కాంత , కరోనల్ చిత్రాల ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ ఖగోళ సంఘటనను అధ్యయనం చేశారు. అంతరిక్షంలో నాసా సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ ప్రతి 12 నిమిషాలకు ఒకసారి ఫొటోలు తీస్తుంది. ఏఆర్ మొదటి 2.5 రోజులలో సానుకూల హెలిసిటీని ఇంజెక్ట్ చేసినట్టు గుర్తించారు. హెలిసిటీ (లేదా ట్విస్ట్) సంకేత సమయంతో తిరిగిన క్రియాశీల ప్రాంతాలు కరోనల్ మాస్ ఎజెక్షన్‌ను ఉత్పత్తి చేయలేవని అధ్యయనం తేల్చింది. రాయల్ ఆస్ట్రోనామికల్ సొసైటీ జర్నల్‌లో ఈ ఫలితాలు ప్రచురితమయ్యాయి.
"విచిత్రం ఏంటంటే.. మేము డేటా నుండి తీసుకున్న అయస్కాంత నిర్మాణం క్రియాశీల ప్రాంతం ప్రధాన భాగంలో ఎలాంటి మలుపునూ చూపించలేదు" అని డాక్టర్ వేమారెడ్డి అన్నారు. ఐఐఏ బృందం ప్రకారం, హెలిసిటీ ఎలా ఇంజెక్ట్ చేయబడుతుందనే అధ్యయనాలు క్రియాశీల ప్రాంతం విస్ఫోటనాత్మక సంభావ్యతను అంచనా వేయడానికి కీలకం. ఈ ఫలితాలు నక్షత్రాలు , గ్రహాలలో అయస్కాంత క్షేత్ర ఉత్పత్తిపై కూడా వెలుగును ప్రసరిస్తాయని భావిస్తున్నారు.
ప్రచురణ లింక్: https://doi.org/10.1093/mnras/stab2401
మరిన్ని వివరాల కోసం, డాక్టర్ పి. వేమారెడ్డి (vemareddy@iiap.res.in) ని సంప్రదించవచ్చు.
ఫిగర్ 1 చిత్రం తీవ్రమైన అతినీలలోహిత వేవ్‌బ్యాండ్ 304 in లో సూర్యుని 12 తెలుపు-దీర్ఘచతురస్రం ద్వారా చుట్టుముట్టిన ఏఆర్ 12257 ని చూపుతుంది. మోడల్ అయస్కాంత నిర్మాణం (బి) , వేవ్‌బ్యాండ్ 171 Å (సి) లోని కరోనల్ ప్లాస్మా ట్రేసర్లు.
***
(Release ID: 1764892)
Visitor Counter : 163