సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
కళాకారులను, సంప్రదాయ కళలను బలోపేతం చేయడానికి వారణాసిలో ఖాదీ కారిగార్ సమ్మేళన్ పేరుతో ఖాదీ ప్రదర్శన ప్రారంభమైంది.
Posted On:
17 OCT 2021 4:15PM by PIB Hyderabad
ఉత్తరప్రదేశ్ నగరం వారణాసిలో 20 భారతీయ రాష్ట్రాల హస్తకళా ఉత్పత్తులను ప్రదర్శించే అత్యాధునిక ఖాదీ ప్రదర్శనను కేంద్ర ఎంఎస్ఎంఈలశాఖ సహాయ మంత్రి భాను ప్రతాప్ సింగ్ వర్మ సోమవారం ప్రారంభించారు. కేవీఐసీ కూడా "ఖాదీ కారిగార్ సమ్మేళనం" (ఖాదీ కళాకారుల సమావేశం) నిర్వహించింది. ఇందులో 2000 మందికి పైగా ఖాదీ కళాకారులు, ముఖ్యంగా వారణాసి ప్రయాగ్రాజ్, జౌన్పూర్, మీర్జాపూర్, ఘాజీపూర్, సోన్‌భద్ర మొదలైన 12 జిల్లాలకు చెందిన మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉత్తర ప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్, పంజాబ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, లేహ్, -లడఖ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్ ఇతర రాష్ట్రాల నుండి ఖాదీ సంస్థలు మొత్తం 105 స్టాల్‌లను ఏర్పాటు చేశాయి. అనేక ఖాదీ సంస్థలు, పీఎంఈజీపీ యూనిట్లు, వివిధ రాష్ట్రాల నుండి అనేక ఎస్యూఆర్టీఐ క్లస్టర్‌లు కూడా తమ స్టాల్‌లను ఏర్పాటు చేశాయి.
జమ్మూ & కాశ్మీర్లోని పర్వతప్రాంతాల నుంచి సేకరించిన అత్యున్నత తేనె, అనేక రకాల కాశ్మీరీ, రాజస్థానీ ఉన్ని శాలువాలు, పశ్చిమ బెంగాల్ నుండి ముస్లిన్ వస్త్రాలు, పశ్చిమ బెంగాల్, బీహార్ నుండి పట్టు వస్త్రాలు, పంజాబ్ నుండి కోటి శాలువాలు, తోలు వంటి అనేక అద్భుతమైన ఖాదీ ఉత్పత్తులను ప్రదర్శనలో చూడవచ్చు. కాన్పూర్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ నుండి తెచ్చిన టెర్రకోట కుండలను కూడా అమ్ముతున్నారు. విస్తృతంగా ప్రశంసలు పొందిన మీర్జాపూర్, ప్రయాగరాజ్ చేతి ముడి తివాచీలు ప్రదర్శనలో అతిపెద్ద ఆకర్షణలు. కోవిడ్ -19 లాక్‌డౌన్ తర్వాత కేవీఐసీ వారణాసిలో నిర్వహిస్తున్న రెండో ప్రదర్శన ఇది.
ఖాదీ ఎగ్జిబిషన్ ఖాదీ కారిగార్ సమ్మేళన్ నిర్వహించడం ద్వారా కళాకారులను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్న కెవిఐసిని మంత్రి వర్మ ప్రశంసించారు. గత కొన్ని సంవత్సరాలుగా వారణాసి వివిధ ఖాదీ కార్యకలాపాల కేంద్రంగా అవతరించిందని ఆయన అన్నారు. స్పిన్నింగ్, నేయడం, తేనెటీగల పెంపకం, కుండల తయారీ వంటి దాదాపు అన్ని గ్రామీణ సాంప్రదాయ కళల విశిష్టత ఇక్కడ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇది చేతివృత్తుల వారికి స్వయం ఉపాధిని సృష్టిస్తున్నది. వారిని ఆత్మనిర్భర్గా మార్చింది. కళాకారులకు వారి ఉత్పత్తులను మార్కెట్ చేయడానికి, వారి ఆదాయాన్ని పెంపొందించడానికి కేవీఐసీ ఎగ్జిబిషన్ ఒక పెద్ద వేదికను కూడా అందిస్తుంది.
ఈ సందర్భంగా కేవీఐసీ ఛైర్మన్ సక్సేనా మాట్లాడుతూ వారణాసి రాష్ట్ర స్థాయి ఖాదీ ప్రదర్శన కళాకారుల "ఆత్మనిర్భర్ భారత్" నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. సంప్రదాయ కళలను బలోపేతం చేయడానికి స్థానిక కళాకారులను శక్తిమంతం చేయడానికి కేవీఐసీపెద్ద సంఖ్యలో ఖాదీ సంస్థలు, పీఎంఈజీపీ యూనిట్లు ఎస్ఎఫ్యూఆర్ఐ క్లస్టర్‌లను ఏర్పాటు చేసిందని వివరించారు. ఈ ఎగ్జిబిషన్ ‘వోకల్ ఫర్ లోకల్’ భావనకు అనుగుణంగా, ప్రోత్సాహకరంగా ఉంటుందని, ఖాదీ వాడకాన్ని ప్రోత్సహిస్తుందని ఆయన అన్నారు. ప్రత్యేకించి, వారణాసి ప్రధానమంత్రి పార్లమెంటరీ నియోజకవర్గం. ఖాదీని ప్రోత్సహించడానికి చేతివృత్తుల వారికి మద్దతుగా అనేక కార్యక్రమాలను కేవీఐసీ రూపొందించింది. వారణాసిలో ప్రస్తుతం 134 ఖాదీ సంస్థలు పనిచేస్తున్నాయి, ఇక్కడ మొత్తం శ్రామిక శక్తిలో దాదాపు 80 శాతం మహిళలు ఉన్నారు.
***
(Release ID: 1764680)
Visitor Counter : 196