నౌకారవాణా మంత్రిత్వ శాఖ

ప్రధాన ఓడరేవుల చరిత్రలో మొట్టమొదటిసారిగా, ఎల్.పి.జి. షిప్-టు-షిప్ ఆపరేషన్ చేపట్టిన - శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్టు

Posted On: 17 OCT 2021 4:45PM by PIB Hyderabad

రివర్ ఛానల్‌ లోకి సరకును పరిమితం చేయడంతో, కలకత్తా లోని శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఓడరేవు (గతంలో కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్) యొక్క హల్దియా డాక్ కాంప్లెక్స్ (హెచ్.డి.సి) లేదా కోల్‌కతా డాక్ సిస్టమ్ (కే.డి.ఎస్) లో సరకును లోడ్ చేయడానికి ముందు పొరుగున ఉన్న ఓడరేవులలో సరకును దింపు కోవలసిన అవసరం ఉంది.   రెండు పోర్టు లలో సరకు దింపుకోవలసి రావడంతో, ఓడల్లో సరుకు ఎక్కువ కాలం ఉండడంతో పాటు, రవాణాకు అదనపు సమయం పడుతోంది.  అంతర్గతంగా వచ్చే అడ్డంకులను తొలగించడానికి, సాగర్, శాండ్‌హెడ్స్ మరియు ఎక్స్ పాయింట్ సమీపంలోనే ఉన్న పెద్ద నౌకల దగ్గరకు కేప్ సైజ్ లేదా బేబీ కేప్ చిన్న నౌకలను తీసుకురావడంతో పాటు,  నీటిలో తేలియాడే క్రేన్లు లేదా నౌకలమీద ఉండే క్రేన్‌ ల వినియోగం ద్వారా పూర్తిగా నిండిన డ్రై బల్క్ నౌకల నిర్వహణకు వీలుగా, దిగుమతి దారులకు అవకాశాలను కల్పించేందుకు, ఎస్.ఎం.పి., కోల్‌కతా, ప్రయత్నించింది. పెద్ద ఓడల నుండి చిన్న ఓడల్లోకి సరకును మార్చే పాయింట్ల వద్ద, గత కొన్నేళ్ళుగా  పెద్ద సంఖ్యలో డ్రై బల్క్ నౌకలను వినియోగించడం జరిగింది. 

వ్యూహాత్మకంగా అనుకూలమైన ప్రదేశం కావడంతో, ఎల్.పి.జి., దిగుమతి చేసుకున్న పి.ఓ.ఎల్. ఉత్పత్తులతో పాటు, ఇతర ద్రవ సరుకుల వాణిజ్యం ద్వారా హెచ్.డి.సి. లో రవాణాకు డిమాండ్‌ పెరుగుతోంది. 

హెచ్.డి.సి. వద్ద క్రమంగా పెరిగిన ఎల్.పి.జి. దిగుమతుల పరిమాణం వివరాలు ఈ విధంగా ఉన్నాయి: 

హెచ్.డి.సి. వద్ద ఎల్.పి.జి. దిగుమతుల పరిమాణం మెట్రిక్ టన్నుల్లో :

2016-17 ఆర్థిక సంవత్సరంలో  : 20,22,520

2017-18 ఆర్థిక సంవత్సరంలో  : 24,90,374

2018-19 ఆర్థిక సంవత్సరంలో :  34,61,547

2019-20 ఆర్థిక సంవత్సరంలో :  40,16,894

2020-21 ఆర్థిక సంవత్సరంలో :  48,48,193

బి.పి.సి.ఎల్., ఐ.ఓ.సి.ఎల్., హెచ్.పి.సి.ఎల్. వంటి చమురు తయారీ కంపెనీల సీనియర్ యాజమాన్యాలతో పాటు, ఎల్.పి.జి., ఇతర ద్రవ ఇంధన ఉత్పత్తులకు చెందిన ప్రముఖ ప్రైవేట్ దిగుమతిదారుల తో అనేక చర్చలు జరిపి,  ఎస్.పి.ఎం., కోల్‌కతాలోని డీప్ డ్రాఫ్ట్ యాంకరేజ్ పాయింట్ల వద్ద ఎల్.పి.జి. / ద్రవ ఇంధనం రవాణా కు సంబంధించి ఓడ-నుండి-ఓడ లోకి మార్చే (ఎస్.టి.ఎస్)  సౌకర్యాన్ని పొడిగించడం ద్వారా పొందగల అంతర్గత ప్రయోజనాల గురించి తెలియజేయడం జరిగింది.  ఒకే పోర్ట్ లో రవాణా కార్యకలాపాలు చేపట్టడంవల్ల హల్దియాలో డ్రాఫ్ట్ పరిమితిని అధిగమించడమే కాకుండా మిగిలిపోయిన సరుకును సత్వరమే రవాణా చేయడంతో పాటు ఎక్కువ సరుకును సమీకరించడంలో సహాయపడుతుంది, తద్వారా యూనిట్ ఖర్చులను తగ్గించవచ్చు.

పూర్తిగా నిండిన నౌకలను నిర్వహించడానికి దాని పరిమితుల్లోని ఎల్‌.పి.జి. కి చెందిన ఎస్‌.టి.ఎస్. కార్యకలాపాలను అన్వేషించడానికి, హెచ్‌.డి.సి., ఎస్‌.ఎమ్‌.పి., కోల్‌కతా, మార్గదర్శక చొరవ తీసుకోవడంతో పాటు, అలాంటి కార్యకలాపాలను అనుమతించవలసిందిగా, కస్టమ్స్ అధికారులను అభ్యర్థించింది.  కస్టమ్స్‌ అధికారులతో ఇదే విషయమై సంప్రదించడం జరిగింది.  వారు దయతో, ఈ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని, 26.04.2021 నుండి ఈ ఎస్.టి.ఎస్. కార్యకలాపాలను అనుమతించి అవసరమైన ఆదేశాలను జారీ చేశారు.  అదేవిధంగా, చిన్న ఓడల ద్వారా పెద్ద ఓడలోకి సరకు ఎక్కించే సాధారణ కార్యకలాపాలను ప్రోత్సహించడానికి,  నౌక మరియు సరుకు సంబంధిత ఛార్జీల పరంగా ఎస్.ఎం.ఫై. కోల్‌కతా, గణనీయమైన తగ్గింపులను ప్రకటించింది. శాండ్‌హెడ్స్ వద్ద ఎస్.టి.ఎస్. కార్యకలాపాల కోసం పోర్ట్ ప్రత్యేకంగా టగ్ హైర్ ఛార్జీలలో కూడా అదనపు రాయితీ ప్రకటించింది. 

ఈ మార్గదర్శకమైన ఈ చొరవ ఫలితంగా,  భారతీయ తీరంలో ఎల్.పి.జి. మొట్టమొదటి ఎస్.టి.ఎస్. కార్యకలాపాలు బి.పి.సి.ఎల్.  ద్వారా 15 అక్టోబర్, 2021 తేదీన జరిగాయి.  బి.పి.సి.ఎల్. ఆఫ్‌-షోర్ ఎస్.టి.ఎస్. ప్రదేశంలో సర్వీస్ ప్రొవైడర్ గా నియమించబడ్డ ఫెండర్‌-కేర్-మెరైన్ అనే సంస్థ సేవలు అందిస్తోంది. 

ద్రవ ఇంధన రవాణా కు సంబంధించిన ఎస్.టి.ఎస్. కార్యకలాపాలలో పేరుపొందిన ఫెండర్‌-కేర్-మెరైన్-ఒమేగా సంస్థ, లాజిస్టిక్స్ సేవలను అందిస్తోంది.  ఎస్‌.టి.ఎస్. ప్రాంగణంలో నౌకను బెర్తింగ్ చేయడానికి ఉపయోగించే పడవలతో పాటు, లాగడానికి / నిలిపి ఉంచడానికి పెద్ద పరిణామంలో ఉండే యోకోహామా రక్షణ సామాగ్రిని ఎస్‌.ఎమ్‌.పి., కోల్‌కతా అందిస్తోంది.

44551 మెట్రిక్ టన్నుల రవాణా సరకుతో ఉన్న ప్రధాన నౌక ఎం.టి. యుషన్, శాండ్‌-హెడ్స్ వద్ద చిన్న నౌక ఎం.టి. హ్యాంప్‌- షైర్‌ తో ఎస్.టి.ఎస్. కార్యకలాపాలు నిర్వహించింది.   సరకు బదిలీ చేసే కార్యక్రమం 15.10.2021 తేదీ మధ్యాహ్నం 12.48 గంటలకు ప్రారంభమై, 16.10.2021 తేదీ ఉదయం 06.06 గంటలకు పూర్తయ్యింది.   ఆ విధంగా, దాదాపు 17 గంటల స్వల్ప వ్యవధిలో, 23,051 మెట్రిక్ టన్నుల సరుకును ప్రధాన నౌక నుండి చిన్న నౌకకు బదిలీ చేయడం జరిగింది. 

బి.పి.సి.ఎల్. కోసం ఈ ఎస్.టి.సి. కార్యకలాపాలు గతంలో మాలే వద్ద జరిగేవి.  కాగా, ఇప్పుడు, ఈ ఎస్.టి.సి. కార్యకలాపాలను హెచ్.డి.సి. వద్ద చేయడం వల్ల, బి.పి.సి.ఎల్. కి విలువైన విదేశీ మారకం ఆదా అయ్యింది.  హెచ్.డి.సి. వద్ద నిర్వహించిన ఈ ఎస్.టి.ఎస్. కార్యకలాపాలు, బి.పి.సి.ఎల్. కు చెందిన ఇతర ప్రదేశాల్లో, ఇవే, కార్యకలాపాలు నిర్వహించడానికి చిన్న నౌక తీసుకునే 7 నుండి 9 రోజుల సమయాన్ని తగ్గిస్తాయి.   ఫలితంగా, బి.పి.సి.ఎల్. సంస్థకు ప్రతి నౌక ప్రయాణం మీద దాదాపు 3,50,000 అమెరికా డాలర్ల మేర ఖర్చు ఆదా అవుతుంది. 

ఇప్పటికిప్పుడు ప్రారంభమైన ఈ ఎస్.టి.ఎస్. కార్యకలాపాలు దేశంలోని పురాతన నదీ తీరభారీ నౌకాశ్రయానికి కొత్త వ్యాపార సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు, విదేశీ మారకద్రవ్యాన్ని గణనీయంగా ఆదా చేసే విషయంలో వాణిజ్యం మరియు దేశం మొత్తానికి ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు. ఆ విధంగా, ఎస్‌.ఎమ్‌.పి., కోల్‌కతాలో చేపడుతున్న ఎస్‌.టి.ఎస్. కార్యకలాపాలు, భారతీయ తీరంలో దిగుమతి చేసుకున్న ఎల్‌.పి.జి. నిర్వహణలో మొత్తం ఆర్థిక వ్యవస్థను మార్చివేసే ప్రక్రియగా ఎదిగే అవకాశం ఉంది.

 

*****



(Release ID: 1764626) Visitor Counter : 164


Read this release in: English , Urdu , Hindi , Punjabi