మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రతి పేదవారి కళ్లలో ఆనందాన్ని చూడ‌డం.. వారి జీవితంలో శ్రేయస్సును అందించడ‌మే "మోదీ మిషన్": కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి శ్రీ ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ


- గ‌డిచిన ఏడు సంవత్సరాలలో ప్రభుత్వం మంచి పాలన, సమ్మిళిత అభివృద్ధిపై దృష్టిసారించింది

- పేద మరియు బలహీన వర్గాల వారిని "బుజ్జగించకుండా,, సాధికారత" పై దృష్టి పెట్టింది: శ్రీ నఖ్వీ.

Posted On: 17 OCT 2021 3:53PM by PIB Hyderabad

దేశంలోని ప్రతి పేదవాడి కళ్లలో ఆనందాన్ని, వారి జీవితంలో శ్రేయస్సును అందించడమే "మోదీ మిషన్" అని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి శ్రీ ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. ఈ రోజు ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లోని మహాత్మాగాంధీ స్టేడియంలో దివ్యాంగ్‌జ‌న్‌లు మరియు వ‌యోవృద్ధుల‌కు వివిధ వైద్య సహాయ పరికరాలను ఉచితంగా పంపిణీ చేసే కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు.  ఈ కార్యక్రమంలో కేంద్ర సామాజిక న్యాయం,సాధికారత శాఖ సహాయ మంత్రి శ్రీ ఎ నారాయణస్వామి కూడా పాల్గొన్నారు. ఏడీఐపీ, కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ రాష్ట్ర్రీయ వ‌యోశ్రీ యోజ‌నా  కింద‌
ఏఎల్ఐఎంసీఓ, కాన్పూర్  ట్రైకిళ్లు, వీల్‌చైర్లు, క్రచ్, వాకర్లు, ప్రొస్థెటిక్ మరియు ఆర్థోటిక్ పరికరాల‌ను, రాంపూర్‌లోని వివిధ ప్రాంతాల నుండి వ‌చ్చిన 2000 మంది దివ్యాంగులకు మరియు సీనియర్ సిటిజన్‌లకు వినికిడి పరికరాలను ఉచితంగా అందించారు.  శ్రీ నఖ్వీ గత 7 సంవత్సరాలలో ప్రభుత్వం సుపరిపాలన, సమగ్ర అభివృద్ధి మరియు పేద మరియు బలహీన వర్గాల వారి "బుజ్జగింపు లేకుండా సాధికారత" పై దృష్టి పెట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్త‌ర ప్ర‌దేశ్‌ మంత్రి శ్రీ బలదేవ్ అలుక్కా, యుపీ శాసన మండలి సభ్యులు డాక్టర్ జైపాల్ సింగ్ వ్యాస్థ్‌, శ్రీ సూర్య ప్రకాష్ పాల్, ఛైర్మన్ ప్యాక్‌ఫెడ్, బీజేపీ రాంపూర్ అధ్యక్షుడు శ్రీ అభయ్ గుప్తా మరియు సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు. రాంపూర్ లోని నుమైష్ మైదానంలో నిర్వహిస్తున్న "హునార్ హాత్‌'' ప్ర‌ద‌ర్శ‌న‌ను కూడా  కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి శ్రీ ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ సందర్శించారు. హస్త కళల కోసం కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఎగుమతి ప్రోత్సాహక మండలి కళాకారులు,  హస్తకళాకారులు తయారు చేసిన ఉత్పత్తులకు ఆకర్షణీయమైన ప్యాకేజింగ్‌/ మరియు మార్కెట్లను అందించడానికి కలిసి పనిచేస్తున్నాయని ఆయన అన్నారు. చేతివృత్తిదారులు మరియు హస్తకళాకారులకు సులభంగా రుణాలు మరియు ఇతర ఆర్థిక సహాయం అందించడానికి కెనరా బ్యాంక్ "హునార్ హాత్" లో ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసింది. "హునార్ హాత్‌" జీఈఎం (గవర్నమెంట్ ఇ మార్కెట్ ప్లేస్) లో కూడా అందుబాటులో ఉందని.. ఇది దేశీయ కళాకారులు మరియు హస్తకళాకారుల స్వదేశీ ఉత్పత్తులకు పెద్ద ఎత్తున జాతీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లను అందిస్తుంద‌ని మంత్రి న‌ఖ్వీ వివ‌రించారు. 30కి పైగా రాష్ట్రాలు,  కేంద్రపాలిత ప్రాంతాల నుండి వ‌చ్చిన 700 మంది చేతివృత్తుల‌వారు మరియు హస్తకళాకారులు రాంపూర్‌లో ఏర్పాటు చేసిన‌ "హునార్ హాత్" వద్ద తమ స్వదేశీ ఉత్పత్తులను అందుబ‌టాలోకి తెచ్చారు.
                                                                                         

*****


(Release ID: 1764581) Visitor Counter : 201


Read this release in: English , Urdu , Hindi , Tamil