సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్
azadi ka amrit mahotsav

అక్టోబర్ 2న ఖాదీ అమ్మకాల‌కు గొప్ప తోడ్పాటును అందించిన గుజరాత్

గ‌త ఏడాది రికార్డును బద్దల కొడుతూ భారీగా ఖాదీ అమ్మ‌కాలు

Posted On: 14 OCT 2021 12:46PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి న‌రేంద్ర మోడీ పిలుపు మేరకు మ‌హాత్మా గాంధీ జ‌న్మ‌దిన‌మైన అక్టోబ‌రు 2వ తేదీన  మహాత్ముడి స్వ‌స్థ‌ల‌మైన గుజరాత్‌లో భారీగా ఖాదీ ఉత్పత్తుల విక్రయం న‌మోదయింది. ఈ సంవత్సరం అక్టోబర్ 2న మొత్తం గుజ‌రాత్‌లో ఉన్న 311 ఖాదీ ఇండియా అవుట్‌లెట్‌లలో రూ. 3.25 కోట్ల మేర ఖాదీ ఉత్పత్తుల అమ్మ‌కాలు న‌మోద‌య్యాయి.  2020 అక్టోబర్ 2న రాష్ట్రంలో ఖాదీ స్థూల విక్రయాలు రూ.2.92 కోట్లుగా నిలిచాయి. దీంతో  పోలిస్తే ఈ సంవత్సరం గుజరాత్‌లో ఖాదీ అమ్మకాలు రూ. 33.12 లక్షల ( 11.32%) మేర‌ పెరిగింది. కొన్ని నెలల క్రితం  గుజరాత్‌ను తీవ్రంగా ప్రభావితం చేసిన కోవిడ్ -19 మ‌హ‌మ్మారి రెండవ ద‌శ వ్యాప్తి తర్వాత నెల‌కొన్న ప‌రిస్థితుల‌లోనూ ఈ సంవత్సరం అక్టోబ‌రు 2వ తేదీన అమ్మకాల సంఖ్య గణనీయంగా పెర‌గ‌డం విశేషం.  ఖాదీ విక్రయాలకు ప్రత్యేక ప్రోత్సాహాన్ని అందించడానికి, కేవీఐసీ "అజాదీ కా అమృత్ మహోత్సవ్" లో భాగంగా అహ్మదాబాద్, వడోదర, సూరత్ మరియు రాజ్‌కోట్ రైల్వే స్టేషన్లలో ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ అవుట్‌లెట్‌లను ఏర్పాటు చేసింది, ఈ కేంద్రాల‌లో ఖాదీ అమ్మకాలు రూ .5.14 లక్షలుగా నమోదైంది. దీనికి తోడు కేవీఐసీ అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్‌ఫ్రంట్, ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ మరియు జీఎస్‌టీ హెడ్‌క్వార్టర్స్‌లో ప్రత్యేక ఖాదీ ఎగ్జిబిషన్‌లను నిర్వహించింది. ఇక్కడ వరుసగా రూ .3.94 లక్షలు, రూ .6.42 లక్షలు మరియు రూ. 2.25 లక్షల విలువైన ఖాదీ ఉత్పత్తులు విక్రయించబడ్డాయి. ఖాదీ ఉత్ప‌త్తుల‌ను  కొనుగోలు చేసి  ప్రోత్సహించాలని ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోడీ తరచుగా విజ్ఞప్తి చేయడం మరియు గుజరాత్‌లో ఎక్కువ మంది ప్ర‌జ‌లు ఖ‌దీని  ప్రోత్స‌హించ‌డం కూడా ఈ ఏడాది భారీగా అమ్మ‌కాలు పెరిగేందుకు కార‌ణ‌మ‌ని కేవీఐసీ  ఛైర్మన్ శ్రీ వినై కుమార్ సక్సేనా అన్నారు.  సవాళ్లు ఎదుర‌వుతున్న‌ప్పటికీ అత్యున్నత నాణ్యత ప్రమాణాలను కొనసాగిస్తూ, పెద్ద వినియోగదారుల సంఖ్యను పెంచ‌డానికి గాను కేవీఐసీ నిరంతరం కొత్త ఉత్పత్తులను జోడిస్తోందని ఆయన వివ‌రించారు.(Release ID: 1763928) Visitor Counter : 80