సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

ఎంఎస్ఎంఇ రంగ అభివృద్ధికి సమిష్టి కృషి జరగాలి:శ్రీ నారాయణ్ రాణే మాసమే పిలుపు


నియంత్రణ అధికారాలను సాధించిన ఎన్ వి సిఎఫ్ఎల్ : ఒప్పందంపై సంతకాలు

Posted On: 12 OCT 2021 2:20PM by PIB Hyderabad

దేశంలో సూక్ష్మచిన్నమధ్యతరహా సంస్థల (ఎంఎస్ఎంఇ ) రంగ అభివృద్ధికి సమిష్టి కృషి అవసరమని కేంద్ర ఎంఎస్ఎంఇ శాఖ మంత్రి శ్రీ నారాయణ్ రాణే అన్నారు. ఎంఎస్ఎంఇ రంగంలో ఉత్పత్తి పెరిగేలా చూడడానికి చర్యలు తీసుకోవాలని శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.ఎంఎస్ఎంఇ పనితీరు మెరుగు పడేలా చూడడానికి మంత్రిత్వ శాఖకు చెందిన అన్ని విభాగాలు సమిష్టిగా పనిచేయాలని ఆయన సూచించారు. ఎంఎస్ఎంఇ రంగం అభివృద్ధి సాధించేలా నిధులను ఖర్చు చేయాలని మంత్రి అన్నారు. ఎంఎస్ఎంఇ రంగం అభివృద్ధి చెందితే ఎగుమతులుదేశ జీడీపీ పెరుగుతాయని మంత్రి పేర్కొన్నారు. 

తమ మధ్య కుదిరిన ఒప్పందంపై ఢిల్లీలో ఈ రోజు ఎన్ఎస్ఐసి  ఎన్ విసిఎఫ్ఎల్ ఎస్విఎల్ సంతకాలు చేశాయి. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో  ఎంఎస్ఎంఇ శాఖ సహాయ మంత్రి శ్రీ భాను ప్రతాప్ సింగ్, మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ బీబీ స్వైన్, ఎన్‌ఎస్‌ఐసి సిఎండి శ్రీమతి అల్కా అరోరా, ఎస్ వి ఎల్  ఎండీ శ్రీ కే. సురేష్ పాల్గొన్నారు. 

ఆత్మ నిర్భర్ భారత్ సాధన కోసం ఎంఎస్ఎంఇ ల అభివృద్ధికి చర్యలు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎంఎస్ఎంఇ లు ఎదుర్కొంటున్న నిధుల సమస్యను పరిష్కరించడానికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఎంఎస్ఎంఇ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తూ రంగంలో మినీ నవరత్న సంస్థగా గుర్తింపు పొందిన జాతీయ చిన్న పరిశ్రమల కార్పొరేషన్ లిమిటెడ్ కి అనుబంధంగా పనిచేసే విధంగా   వెంచర్ క్యాపిటల్ ఫండ్ లిమిటెడ్ ను నెలకొల్పడం జరిగింది. 10,006 కోట్ల రూపాయలతో వెంచర్ క్యాపిటల్ ఫండ్ లిమిటెడ్ లో సెల్ఫ్-రిలయెంట్ ఇండియా ఫండ్ ను ఏర్పాటు చేశారు. ఎంఎస్ఎంఇ ల అభివృద్ధికి అవసరమైన మూలధనాన్ని వాటాలురుణాల రూపంలో ఈ నిధి నుంచి నిధులను కేటాయించడం జరుగుతుంది. ఏఐఎఫ్ నిబంధనల ప్రకారం వీటిని విడుదల చేస్తారు. ఈ నిధులను ఎన్‌ఎస్‌ఐసి ద్వారా  ఎంఎస్ఎంఇ మంత్రిత్వ శాఖ అందిస్తుంది.

 పెట్టుబడుల నిర్వహణ బాధ్యతను ఎస్ బి ఐ వెంచర్స్ లిమిటెడ్ కు అప్పగించడం జరిగింది. ఖైతాన్ అండ్ కంపెనీ న్యాయపరమైన అంశాలను పర్యవేక్షిస్తుంది.  ఎస్ ఆర్ ఐ ఫండ్ ను రెండవ తరగతి ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధుల కింద పరిగణించాలని కోరుతూ ఎన్ వి సిఎఫ్ఎల్ దాఖలు చేసిన ప్రతిపాదనకు భారత సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్‌ 2021 సెప్టెంబర్ ఒకటవ తేదీన ఆమోదం తెలిపింది. 

పెట్టుబడులకు సంబంధించి  ఎంఎస్ఎంఇ లు ఎదుర్కొంటున్న సమస్యలను  ఎస్ ఆర్ ఐ ఫండ్ పరిష్కరిస్తుంది. కార్పొరేటీకరణను ప్రోత్సహిస్తూ అంర్జాతీయ స్థాయికి ఎంఎస్ఎంఇ లు ఎదిగేలా చూడడానికి అవసరమైన చర్యలను అమలు చేయడం జరుగుతుంది. ప్రభుత్వ పర్యవేక్షణ వల్ల అనవసర రంగాలలో కాకుండా అభివృద్ధికి దోహదపడే రంగాల్లో ఎంఎస్ఎంఇ లు పెట్టుబడులు పెట్టడానికి అవకాశం కలుగుతుంది.  

***



(Release ID: 1763396) Visitor Counter : 163


Read this release in: English , Urdu , Hindi , Marathi