వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రైతులకు ఉచితంగా 8.20 లక్షల హైబ్రిడ్ సీడ్ మినీ కిట్లు పంపిణీ


దేశంలో 15 రాష్ట్రాల్లో 343 జిల్లాలలో పంపిణీ

ఉత్పత్తి, ఉత్పాదకత తో రైతుల ఆదాయం పెరిగేలా చూడడానికి ప్రభుత్వం కృషి ... శ్రీ తోమార్

మధ్యప్రదేశ్ లోని మోరెనా మరియు షియోపూర్‌లో రెండు కోట్ల విలువ చేసే ఆవ విత్తనాల మినీ కిట్ పంపిణీ ప్రారంభం

Posted On: 11 OCT 2021 8:07PM by PIB Hyderabad

దేశంలో  15 రాష్ట్రాలలో గుర్తించిన  343 జిల్లాలలో రైతులకు ఉచితంగా 8.20 లక్షల హైబ్రిడ్ సీడ్ మినీ కిట్లు పంపిణీ చేయడానికి కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ ప్రత్యేక పథకానికి  రూపకల్పన చేసింది. విత్తన మార్పిడికి దోహద పడే ఈ పథకం వల్ల పంట దిగుబడి పెరిగి ఉత్పత్తితో పాటు రైతుల ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ పథకాన్ని కేంద్ర వ్యవసాయ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమార్ మధ్యప్రదేశ్ లోని మోరెనా మరియు షియోపూర్‌ జిల్లాలలో  రెండు కోట్ల విలువ చేసే ఆముదం విత్తనాల  మినీ కిట్ లను రైతులకు అందించి ప్రారంభించారు. 

జాతీయ ఆహార భద్రతా చట్టం కింద నూనె గింజలు, ఆయిల్ పామ్ పథకం కింద  వ్యవసాయ శాఖ ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. దేశంలో ఆవాలు సాగవుతున్న ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో అధ్యయనం నిర్వహించిన తరువాత ఈ పథకాన్ని రూపొందించామని శ్రీ తోమార్ తెలిపారు. ఈ పథకం కింద రైతులకు ఈ ఏడాది ఉచితంగా ఆవ విత్తనాలను అందిస్తుందని మంత్రి తెలిపారు. హెక్టర్ కు 20 క్వింటాళ్ల వరకు దిగుబడి ఇచ్చే 8,20,600 విత్తనాలతో మినీ కిట్లను 15 రాష్ట్రాలలో ఎంపిక చేసిన 343 జిలాల్లో పంపిణీ చేయడానికి మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిందని ఆయన చెప్పారు. 

ఈ కార్యక్రమం మధ్యప్రదేశ్బీహార్ఛత్తీస్‌గఢ్గుజరాత్హర్యానాజమ్మూ & కాశ్మీర్జార్ఖండ్ఒడిశాపంజాబ్రాజస్థాన్ఉత్తరప్రదేశ్ఉత్తరాఖండ్అస్సాంఅరుణాచల్ ప్రదేశ్ మరియు త్రిపుర వంటి అన్ని ప్రధాన ఉత్పత్తి రాష్ట్రాల యొక్క వివిధ జిల్లాలను కవర్ చేస్తుంది.  రూ.  ఈ కార్యక్రమం కోసం 1066.78 లక్షలు కేటాయించారు.

ఈ కార్యక్రమం మధ్యప్రదేశ్బీహార్ఛత్తీస్‌గఢ్గుజరాత్హర్యానాజమ్మూ & కాశ్మీర్జార్ఖండ్ఒడిశాపంజాబ్రాజస్థాన్ఉత్తరప్రదేశ్ఉత్తరాఖండ్అస్సాంఅరుణాచల్ ప్రదేశ్ మరియు త్రిపుర వంటి అన్ని ప్రధాన ఉత్పత్తి రాష్ట్రాల్లో అమలు జరుగుతుంది .  ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం 1066.78 లక్షల రూపాయలను కేటాయించింది. 

కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా మధ్యప్రదేశ్ లోని మోరెనా, షియోపూర్‌, హర్యానాలోని హిసార్, ఉత్తరప్రదేశ్ లోని ఎటా మరియు వారణాసి జిల్లాల్లో ఈ ఏడాది అమలు చేస్తారు. అయిదు రాష్ట్రాలలోని ఏడు జిలాల్లో పంపిణీ చేయడానికి 1615 క్వింటాళ్ల తో 1,20,000 మినీ కిట్లను సిద్ధం చేస్తున్నారు. ప్రతి జిల్లాకు 15 నుంచి 20 వేల వరకు మినీ కిట్లను పంపిణీ చేయడం జరుగుతుంది. ఎక్కువ దిగుబడి ఇచ్చే మూడు రకాల విత్తనాలను అందిస్తారు. జేకే -6502, ఛాంపియన్, డాన్ రకాల విత్తనాలను దీనికోసం ఎంపిక చేశారు. ఎక్కువ దిగుబడిని ఇచ్చే విత్తనాల వినియోగాన్ని ఎక్కువ చేసి ఉత్పత్తిని పెంచాలన్న లక్ష్యంతో పథకానికి రూపకల్పన చేశారు. పైలట్ ప్రాజెక్టు అమలు జరుగుతున్న తీరును దీనివల్ల కలుగుతున్న ప్రయోజనాలను గుర్తించి ఎక్కువ మంది రైతులు వీటిని ఉపయోగించడానికి ముందుకు వస్తారని మంత్రి పేర్కొన్నారు. 

ఆత్మ నిర్భర్ కృషి ని అమలు చేసి ఆత్మ నిర్భర్ భారత్ సాధనకు వ్యవసాయ శాఖ సహకరిస్తుందని వ్యవసాయ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ అగర్వాల్ తెలిపారు. లక్ష్య సాధన కోసం వ్యవసాయ శాఖ తొలిసారిగా ఉచిత విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నదని ఆయన అన్నారు. శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి శుభా ఠాకూర్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. 

***


(Release ID: 1763158) Visitor Counter : 247


Read this release in: Hindi , English , Urdu