ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మ‌హారాష్ట్ర‌లోని కొంద‌రు మ‌ధ్య‌వ‌ర్తులు, వ్యాపారుల కార్యాల‌యాలు, నివాసాల‌లో సోదాలు నిర్వ‌హించిన ఆదాయ‌ప‌న్ను విభాగం

నాడు పోస్టు చేయడమైనది: 07 OCT 2021 7:36PM by PIB Hyderabad

మ‌హారాష్ట్ర‌లో కొంద‌రు మ‌ధ్య‌వ‌ర్తులు, వ్యాపారుల‌కుసంబంధించిన ఒక పెద్ద  సిండికేట్ కార్య‌క‌లాపాల‌పై ఆదాయ‌ప‌న్ను శాఖ 23.09.21 నుంచి సోదాలు నిర్వ‌హిస్తొంది. ఇందులో కొంద‌రు ప్ర‌భుత్వ ప‌ద‌వులు నిర్వ‌హిస్తున్నారు. గ‌త 6 నెల‌లుగా ఆదాయ‌ప‌న్నుశాఖ ఇందుకు సంబంధించిన నిఘాస‌మాచారం అందుకుంటూ వ‌స్తున్న‌ది. ఈ సోదాల‌కు సంబంధించి  25 నివాసాలు,15 కార్యాల‌య ప్రాంగ‌ణాల‌లో త‌నిఖీలు చేప‌ట్టారు. 4 కార్యాల‌యాల‌నుకూడా త‌నిఖీ చేశారు. ఇద్ద‌రు  మ‌ధ్య‌వ‌ర్తులు ముంబాయి లోని ఒబెరాయి హోట‌ల్‌ను శాశ్వ‌తంగా అద్దెకు తీసుకుని త‌మ క్ల‌యింట్ల‌ను క‌లుసుకునేందుకు  దీనిని ఉప‌యోగిస్తూ వ‌చ్చారు. వీరి కార్య‌క‌లాపాల‌ను కూడా తనిఖీ చేస్తున్న‌రు. ఈ సిండికేట్ లోని మ‌ధ్య‌వ‌ర్తులు, వ్యాపారులు, ప్ర‌భుత్వ ప‌దవుల‌లో ఉన్న కొంద‌రు 10 సంవ‌త్స‌రాల క్రితం నాటి రికార్డుల‌లో ఒక దానిలో  వివిధ కోడ్ పేర్ల‌తో త‌మ రికార్డుల‌లో లావాదేవీల‌ను రాసుకోవ‌డం గ‌మ‌నించ‌చారు. ఈ సోదాల‌లో గుర్తించిన మొత్తం లావాదేవీల రూ  1050 కోట్ల రూపాయ‌లు..

 ఈ మ‌ధ్య‌వ‌ర్తులు భూమి కేటాయింపు ద‌గ్గ‌ర నుంచి ప్ర‌భుత్వం నుంచి అన్ని ర‌కాల క్లియ‌రెన్సులు తీసుకువ‌చ్చే వ‌ర‌కు వివిధ ర‌కాల సేవ‌ల‌ను వారికి అందిస్తూ వ‌స్తున్నారు. వీరి మ‌ధ్య లావాదేవీల‌కుసంబంధించిన  స‌మాచారాన్ని ఛేధించ‌డం తొ పాటు కీల‌క డిజిట‌ల్ సాక్ష్యాల‌ను  ఆదాయ‌ప‌న్ను  విభాగం  సేక‌రించ‌గ‌లిగింది.  ప‌లు ర‌హ‌స్య‌ప్ర‌దేశాల‌లో వీరు దాచిన రికార్డుల‌ను స్వాధీనం చేసుకుంది. ఈ కార్య‌క‌లాపాల‌కు  పాల్ప‌డుతున్న  మ‌ధ్య‌వ‌ర్తులు న‌గ‌దు బ‌దిలీకి అంగ‌డియాస్ ను  కూడా వాడుకున్నారు. ఈ సోదాల‌లో ఒక అంగ‌డియానుంచి 150 ల‌క్ష‌లు స్వాధీనం చేసుకోవ‌డం జ‌రిగింది


ఆదాయ‌ప‌న్ను శాఖ స్వాధీనం చేసుకున్న‌ప‌త్రాల‌లో , ఆయా న‌గ‌దు లావ‌వాదేవీలు, పంపిణీ చేసిన మొత్తాలు, అందుకున్న‌, ఇంకా రావ‌ల‌సిన‌న మొత్తాలు ఒక్కొక్క‌టి రూ 200 కోట్ల‌కు పైగా గ‌ల వాటికి సంబంధించిన రికార్డులు ఉన్నాయి.కొన్ని మంత్రిత్వ‌శాఖ‌ల‌లో కీల‌క ప‌ద‌వులు పొందేందుకు బ్యూరోక్రాట్లు న‌గ‌దు చెల్లించిన‌ట్టు కూడా గుర్తించారు. అలాగ  కొంద‌రు కాంట్రాక్ట‌ర్లు త‌మ బిల్లులు పాస్ కావ‌డానికి చెల్లించిన మొత్తాలుగా గ‌మ‌నించారు. మ‌ధ్య‌వ‌ర్తులు వ‌సూలు  చేసిన మొత్తంలో ఎక్కువ భాగం కోడ్ పేర్ల‌తో నిర్దేశించుకున్న వివిధ వ్య‌క్తుల‌కు చెల్లించిన‌దిగా గుర్తించారు.
దీనికి తోడు ఒక వ్యాపారి, మ‌ధ్య‌వ‌ర్తి పెద్ద ఎత్తున లెక్క‌ల‌లో చూప‌ని ఆదాయాన్ని స‌మ‌కూర్చుకున్నట్టు  గుర్తించారు. వీరు రైతుల నుంచి  భూములు కొనుగోలు  చేసి వాటినే ప్ర‌భుత్వ అండ‌ర్‌టేకింగ్‌ల‌కు,పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థ‌ల‌కు బద‌లాయించిన‌ట్టు  గుర్తించారు. చాలామంది సీనియ‌ర్ బ్యూరోక్రాట్లు వారి బంధువులు  ఇత‌ర ప్ర‌ముఖ వ్య‌క్తులు ఇలాంటి కార్య‌క‌లాపాల‌లో పెద్ద ఎత్తున‌పెట్టుబ‌డి పెట్టిన‌ట్టు  గుర్తించారు.
ఈ సోదాల సంద‌ర్భంగా ఒక కార్యాల‌య ప్రాంగ‌ణంలో రోజూవారీ న‌గ‌దు  లావాదేవీలు ,న‌గ‌దు డిపాజిట్ 27 కోట్లు, న‌గ‌దు చెల్లింపు 40 కోట్ల కు సంబంధించి న వివరాలను క‌నుగొన్నారు. దీనికితోడువివిధ వ్య‌క్తుల‌కు చెల్లించిన 23 కోట్ల రూపాయాల మేర‌కు లావాదేవీలు వారి దృష్టికివ‌చ్చాయి. ఈ మ‌ధ్య‌వ‌ర్తులు వ్యాపారుల‌, పారిశ్రామిక వేత్త‌ల‌నుంచి వివిధ ప్ర‌భుత్వ అండ‌ర్ టేకింగ్‌ల‌కు సంబంధించిన ప‌థ‌కాల కింద భూములు పొంద‌డానిఇక‌, టెండ‌ర్‌పొడిగింపులు, మైనింగ్ కాంట్రాక్టులు త‌దిత‌ర వాటికి వ‌సూలు  చేసిన‌విగా తేలింది. దీనికి తోడు వారి వాట్స‌ప్ సంభాష‌ణ‌ల ప్ర‌కారం 16 కోట్ల రూపాయ‌లు అందుకున్న దానికి సంబంధించిన వివ‌రాలు, 12 కోట్ల చెల్లింపున‌కు సంబంధించిన స‌మాచారాన్ని గుర్తించారు.

. ఆదాయ‌ప‌న్నుశాఖ సోదాలు నిర్వ‌హించిన ప‌లువురి విష‌యంలో వారికి స్వంత రియ‌ల్ ఎస్టేట్‌, నిర్మాణ వ్యాపారాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన  సాక్ష్యాధారాలు, న‌గ‌దు అందుకున్న‌, చేసిన చెల్లింపుల‌కు సంబంధించిన స‌మాచారం ఉంది.

ఈ సోదాల‌లో  మొబైల్  ఫోన్‌లు, పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్‌, ఐ క్లౌడ్‌, ఈ మెయిల్స్ నుంచి పెద్ద ఎత్తున‌స‌మాచారాన్ని సేక‌రించి ప‌రిశీలించి  దానిని విశ్లేషించ‌డం జ‌రిగింది.


ఇప్ప‌టివ‌ర‌కూ 4.6 కోట్ల రూపాయ‌ల‌కు పైగా విలువ‌గ‌ల న‌గ‌దు, 3.42 కోట్ల రూపాయ‌ల‌కు పైగా ఆభ‌ర‌ణాల‌ను  స్వాధీనం  చేసుకున్నారు. సోదాల‌లో గుర్తించిన 4 లాక‌ర్ల‌ను స్తంభింప చేసేందుకు ఆదేశాలు జారీ అయ్యాయి.
ఇందుకు  సంబంధించి ద‌ర్యాప్తు  కొన‌సాగుతోంది..

***


(రిలీజ్ ఐడి: 1762442) సందర్శకుల సూచీ సంఖ్య : : 139
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , हिन्दी , Marathi