మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

స‌బ్ కా ప్ర‌యాస్ః స‌మిష్ఠి భాగ‌స్వామ్యంపై వెబినార్ నిర్వ‌హించిన విద్యామంత్రిత్వ శాఖ‌


స‌బ్ కా ప్ర‌యాస్ స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్ళాల‌ని పిలుపిచ్చిన ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌

నూత‌న భార‌తానికి పునాది స్తంభంగా జాతీయ విద్యా విధానం,2020 ఉంటుంది - పీయూష్ గోయెల్

Posted On: 07 OCT 2021 7:33PM by PIB Hyderabad

యూనివ‌ర్సిటీ గ్రాంట్స్ క‌మిష‌న్ తో క‌లిసి విద్యా మంత్రిత్వ శాఖ స‌బ్ కా ప్ర‌యాస్ః నేటి సమిష్ఠి భాగ‌స్వామ్యం అన్న అంశంపై వెబినార్‌ను నిర్వ‌హించింది. భార‌త ప్ర‌భుత్వం సుప‌రిపాల‌న‌పై 17 సెప్టెంబ‌ర్ 2021 నుంచి 7 అక్టోబ‌ర్ 2021 వ‌ర‌కు నిర్వ‌హిస్తున్న వెబినార్ల ప‌రింప‌ర‌లో ఈ వెబినార్ ఒక భాగం. ఈ వెబినార్‌లో కేంద్ర విద్య‌, స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌, కేంద్ర వాణిజ్యం&ప‌రిశ్ర‌మ‌లు, వినియోగ‌దారుల వ్య‌వ‌వ‌హారాలు& ఆహారం& ప్ర‌జాపంపిణీ & జౌళి ప‌రిశ్ర‌మ‌ల మంత్రి పీయూష్ గోయెల్‌, ఉన్న‌త విద్యా శాఖ కార్య‌ద‌ర్శి సంజ‌య్ మూర్తి, యుజిసి చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ డి.పి. సింగ్‌, మంత్రిత్వ శాఖ‌, యుజిసికి చెందిన సీనియ‌ర్ అధికారులు పాల్గొన్నారు. 
ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ, సుప‌రిపాల‌న ప్రాముఖ్య‌త‌ను, అవ‌స‌రాన్ని ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ నొక్కి చెప్పారు. కోవిడ్ మ‌హ‌మ్మారి కాలంలో ప్ర‌పంచానికి  స‌హాయం చేసిన ప్రముఖ ర‌దేశాల‌లో భార‌త్ ఒక‌టి అని చెప్పారు. దేశాన్ని అద్భుత‌మైన భ‌విష్య‌త్తు దిశ‌గా భ‌విష్య‌త్ త‌రాలు న‌డిపించ‌డానికి రానున్న 25 సంవ‌త్స‌రాలు కీల‌కంగా ఉంటాయ‌ని ఆయ‌న అన్నారు. 
స్వ‌యం స‌మృద్ధ‌మైన భార‌త్ గా దేశాన్ని మ‌లిచడంలో ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య ప్రాముఖ్య‌త‌ను మంత్రి ఉద్ఘాటించారు. మోడీ ప్ర‌భుత్వ ప‌రిపాల‌నా న‌మూనాలో జ‌న్ భాగీదారి అన్న కీల‌క‌మైన స్తంభ‌మ‌ని ఆయ‌న అన్నారు. 
స‌బ్ కా ప్ర‌యాస్ అంటూ ప్ర‌ధాన‌మంత్రి ఇచ్చిన పిలుపును ప్ర‌స్తావిస్తూ, స‌బ్‌కా ప్ర‌యాస్ స్ఫూర్తిని మ‌రింత‌గా ముందుకు తీసుకువెడుతూ, ఐక్యంగా ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ నిర్మాణానికి ప‌ని చేయాల‌ని ప్ర‌ధాన్ పిలుపిచ్చారు. 
భార‌త‌దేశ వ్యాప్తంగా కొత్త‌గా మంజూరు చేసిన టెక్స్‌టైల్ పార్క్‌ల‌లో కౌశ‌ల్ వికాస్ కేంద్రాలను ఏర్పాటు చేయ‌డంపై కేంద్ర వాణిజ్యం&ప‌రిశ్ర‌మ‌లు, వినియోగ‌దారుల వ్య‌వ‌హారాలు & ఆహారం & ప్ర‌జా పంపిణీ, జౌళి  ప‌రిశ్ర‌మ‌ల మంత్రి పీయూష్ గోయెల్ దృష్టి కేంద్రీక‌రించారు. దీని కార‌ణంగా, స‌రైన ధ‌ర‌కు అత్యున్న‌త నాణ్య‌త క‌లిగిన ఉత్ప‌త్తుల‌ను అంద‌చేయ‌గ‌ల‌ర‌న్నారు. నైపుణ్యం క‌లిగిన మాన‌వ వ‌న‌రుల కోసం భార‌త్ ను న‌మ్మ‌దగిన భాగ‌స్వామిగా ప్ర‌పంచం చూస్తోంద‌ని, అపార‌మైన విద్యావ‌కాశాల‌తో విదేశీ సంస్థ‌లు, విద్యార్ధులు తాము ఇష్ట‌ప‌డే అధ్య‌య‌న గ‌మ్య‌స్థానంగా భార‌త దేశానికి వ‌చ్చేలా ఉండాల‌ని అన్నారు. 
జాతీయ విద్యా విధానం, 2020పై ఆయ‌న త‌న అభిప్రాయాల‌ను పంచుకున్నారు. స్థానిక స్వ‌ప‌రిపాల‌నా సంస్థ‌లు, ఉన్న‌త విద్యా సంస్థ‌లు, విద్యార్ధులు, భార‌త పౌరుల నుంచి ల‌క్ష‌లాది సూచ‌న‌ల‌ను సేక‌రించ‌డం అన్న‌ది స‌బ్ కా ప్ర‌యాస్ కీల‌క ఉదాహ‌ర‌ణ అని ఆయ‌న అన్నారు. గ్రామీణ భార‌తంలో ప్ర‌తి వ్య‌క్తినీ విద్య‌, నైపుణ్యాల‌తో సాధికారం చేయ‌డం ద్వారా నూత‌న విద్యా విధానం 2020 మ‌హాత్మా గాంధీ స్వ‌ప్న‌మైన గ్రామ స్వ‌రాజ్‌ను సాకారం చేసేందుకు తోడ్ప‌డుతుంద‌న్నారు. 
ఉన్న‌త విద్య శాఖ కార్య‌ద‌ర్శి సంజ‌య్ మూర్తి మాట్లాడుతూ, జాతీయ విద్యా ప‌థ‌కం 2020 ప్రాముఖ్య‌త‌ను నొక్కి చెప్ప‌డ‌మే కాక‌, ప్ర‌భుత్వ శాఖ‌లు, ఎన్‌జిఒలు, పౌర స‌మాజాలు, ప్రైవేటుసంస్థ‌లు, ముఖ్యంగా సామాన్య మాన‌వుడి స‌మిష్ఠి భాగ‌స్వామ్యంపై దృష్టి పెట్టి సుపరిపాల‌న‌ను అందించేందుకు మ‌ద్ద‌తునిస్తుంద‌న్నారు. 
గౌర‌వ‌నీయ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఇచ్చిన నినాద‌మైన స‌బ్‌కా సాథ్, స‌బ్ కా వికాస్‌, స‌బ్‌కా విశ్వాస్‌, స‌బ్ కా ప్ర‌యాస్ తోడ్పాటుతో భార‌త విద్యా వ్య‌వ‌స్థ గుణాత్మ‌క‌త‌ను మెరుగుప‌ర‌చ‌డం గురించి యుజిసి చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ డి.పి. సింగ్ మాట్లాడారు. కార్య‌ద‌ర్శి ప్రొఫెస‌ర్ ర‌జినీష్ జైన్ స్వాగ‌తోప‌న్యాసం చేశారు. 
సుప‌రిపాల‌న‌ను ముందుకు తీసుకువెళ్ళే విష‌యంపై చ‌ర్చించేందుకు విద్య సంస్థ‌లు, మంత్రిత్వ శాఖ‌లు, విద్యావేత్త‌లు వేదిక‌ను పంచుకునేందుకు స‌బ్‌కా ప్ర‌యాస్ః స‌మిష్ఠి భాగ‌స్వామ్యం వెబినార్ తోడ్ప‌డింది. 
సాంకేతిక సెష‌న్‌కు పంజాబ్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ వైస్ ఛాన్స‌ల‌ర్, యుజి మాజీ స‌భ్యుడు ప్రొఫెస‌ర్ ఆర్‌పి తివారీ అధ్య‌క్ష‌త వ‌హించారు. ఐజిఎన్ఒయు వైస్ చాన్స్‌ల‌ర్ ప్రొఫెస‌ర్. ఐఐఎఫ్‌టి ప్రొఫెస‌ర్ రాకేష్ మోహ‌న్‌, ఢిల్లీ విశ్వ‌విద్యాల‌యం ప్రొఫెస‌ర్ ప్ర‌కాష్ సింగ్ సాంకేతిక సెష‌న్‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. 
స‌మిష్ఠి కృషి, భాగ‌స్వామ్యం పాత్ర‌పై దృష్టి పెట్టి సుప‌రిపాల‌న‌ను సాధించేందుకు అవ‌స‌ర‌మైన అంశాల‌పై దృష్టి పెట్టి వెబినార్ చ‌ర్చ‌ను నిర్వ‌హించింది. జాతీయ విద్యా విధానం, 2020 ల‌క్ష్యాల‌ను సాకారం చేసేందుకు స‌మిష్ఠి భాగ‌స్వామ్యాన్ని ప్రోత్స‌హించి, సాధికారం చేయ‌డంపై చ‌ర్చ‌లు దృష్టి పెట్టాయి. ప్ర‌జ‌ల‌ను సాధికారం చేసేందుకు స‌మిష్ఠి భాగ‌స్వామ్యం ప్రాముఖ్య‌త‌పై, విద్యా వ్య‌వ‌స్థ‌ను మెరుగుప‌ర‌చ‌డం, దారిద్ర్యాన్ని నిర్మూలించ‌డం, ఆర్థిక వృద్ధిని ప్రోత్స‌హించడం, అంతిమంగా ఎవ‌రినీ వెనుక‌బ‌డనివ్వ‌క‌పోవ‌డంపై వెబినార్ దృష్టి పెట్ట‌డం విశేషం. విద్యారంగంలో సుప‌రిపాల‌న‌ను అందించాల‌న్న ల‌క్ష్యాల‌ను నెర‌వేర్చ‌డంలో వెబినార్‌లో చ‌ర్చ‌లు, పంచుకున్న భావ‌న‌లు తోడ్ప‌డ‌తాయి.  

 


 

*****


 



(Release ID: 1761996) Visitor Counter : 113


Read this release in: English , Urdu , Hindi