మంత్రిమండలి
ఐదు సంవత్సరాల కాలంలో 4,445 కోట్ల రూపాయల వ్యయంతో, 7 మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్ మరియు అపెరల్ (పి.ఎం. మిత్ర पीएम मित्र) పార్క్‌ల ఏర్పాటుకు ఆమోదం తెలిపిన - కేంద్ర ప్రభుత్వం ఆమోదం
ఫార్మ్ నుండి -ఫైబర్ నుండి -ఫ్యాక్టరీ నుండి - ఫ్యాషన్ నుండి - ఫారిన్ వరకు 5-ఎఫ్.లు అనే గౌరవనీయులైన ప్రధానమంత్రి ఆలోచన తో ప్రేరణ పొందిన కార్యక్రమం - పి.ఎం. మిత్ర ( पीएम मित्र)
అత్యాధునిక సాంకేతికతను ఆకర్షించి, ఈ రంగంలో ఎఫ్.డి.ఐ. లతో పాటు, స్థానిక పెట్టుబడులను పెంపొందించనున్న - ప్రపంచ స్థాయి పారిశ్రామిక మౌలిక సదుపాయాలు
ఒకే ప్రదేశంలో నూలు వడకడం, నేయడం, తయారుచేయడం / అద్దకం, ముద్రించడం నుండి వస్త్రాల తయారీ వరకు వస్త్రాలకు విలువను పెంపొందించే ఒక సమగ్ర వ్యవస్థను సృష్టించే అవకాశాన్ని అందించనున్న - పి.ఎం. మిత్రా (पीएम मित्र)
వస్త్రాలకు విలువను పెంపొందించే సమగ్ర వ్యవస్థ, ఒకే ప్రదేశంలో ఏర్పాటు చేయడం ద్వారా పరిశ్రమకు తగ్గనున్న - రవాణా ఖర్చులు
ప్రతి పార్కు ద్వారా ప్రత్యక్షంగా సుమారు ఒక లక్ష మందికి, పరోక్షంగా రెండు లక్షల మందికి లభించనున్న - ఉపాధి అవకాశాలు
తమిళనాడు, పంజాబ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, అస్సాం, కర్ణాటక, మధ్యప్రదేశ్, తెలంగాణ తో సహా ఆసక్తి వ్యక్తం చేసిన - అనేక రాష్ట్రాలు
వివిధ ప్రమాణాల ఆధారంగా ఛాలెంజ్ పద్ధతి ద్వారా ఎంపిక చేయనున్న - పి.ఎం.
Posted On:
06 OCT 2021 3:35PM by PIB Hyderabad
ఆత్మ నిర్భర్-భారత్-నిర్మాణంతో పాటు, భారతదేశాన్ని అంతర్జాతీయ వస్త్ర రంగంలో గట్టిగా నిలబెట్టాలనే, గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా, 2021-22 కోసం కేంద్ర బడ్జెట్ లో ప్రకటించిన విధంగా 7 పి.ఎం. మిత్రా ( पीएम मित्र) పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
పి.ఎం. మిత్ర ( पीएम मित्र) పథకం గౌరవనీయులైన ప్రధానమంత్రి యొక్క 5.ఎఫ్. ఆశయాలతో ప్రేరణ పొందింది. ఫార్మ్ నుండి -ఫైబర్ నుండి -ఫ్యాక్టరీ నుండి - ఫ్యాషన్ నుండి - ఫారిన్ వరకు ఈ 5-ఎఫ్. అనే సూత్రం ఆవరించి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలో వస్త్ర రంగం మరింత వృద్ధి చెందడానికి, ఈ సమగ్ర విధానం, ఎంతగానో ఉపయోగపడుతుంది. మనలాంటి పూర్తి వస్త్ర పర్యావరణ వ్యవస్థ మరి ఏ ఇతర పోటీ దేశానికి లేదు. మొత్తం ఐదు ఎఫ్.లలో భారతదేశం దృఢంగా ఉంది.
ఈ 7 భారీ సమగ్ర వస్త్ర రీజియన్ మరియు అపెరల్ పార్క్ (పి.ఎం. మిత్ర) (पीएम मित्र) లను సుముఖంగా ఉన్న వివిధ రాష్ట్రాలలోని గ్రీన్-ఫీల్డ్ / బ్రౌన్-ఫీల్డ్ స్థలాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందుకోసం, 1,000 ఎకరాలకు పైగా ఒకే చోట, ఎటువంటి అక్రమ ఆక్రమణలో లేని స్థలంతో పాటు ఇతర వస్త్ర సంబంధిత సౌకర్యాలు, తగిన పర్యావరణ వ్యవస్థలతో సిద్ధంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల నుండి ప్రతిపాదనలను ఆహ్వానిస్తున్నారు.
అన్ని గ్రీన్-ఫీల్డ్ పి.ఎం. మిత్ర ప్రాజెక్టులకు అభివృద్ధి మూలధన మద్దతు (డి.సి.ఎస్) కోసం గరిష్టంగా 500 కోట్ల రూపాయల మేర, అదేవిధంగా, బ్రౌన్-ఫీల్డ్ పి.ఎం. మిత్ర ( पीएम मित्र) ప్రాజెక్టులకు సాధారణ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం గరిష్టంగా 200 కోట్ల రూపాయల మేర (ప్రాజెక్టు ఖర్చు లో 30 శాతం వరకు) అందించడం జరుగుతుంది. పి.ఎం. మిత్ర (पीएम मित्र) పధకం కింద ముందుగా ప్రారంభించిన ప్రతి పి.ఎం. మిత్ర (पीएम मित्र) వస్త్రాల తయారీ పార్కుకు 300 కోట్ల రూపాయల పోటీ ప్రోత్సాహక మద్దతు (సి.ఐ.ఎస్) కూడా అందించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చే మద్దతు లో భాగంగా, ప్రపంచ స్థాయి పారిశ్రామిక వాడ అభివృద్ధి కోసం 1,000 ఎకరాల భూమిని అందించడం కూడా కలిసి ఉంటుంది.
గ్రీన్-ఫీల్డ్ పి.ఎం. మిత్రా (पीएम मित्र) పార్క్ కోసం, భారత ప్రభుత్వ అభివృద్ధి మూలధన మద్దతు ప్రాజెక్టు ఖర్చు లో 30 శాతం ఉంటుంది, బ్రౌన్-ఫీల్డ్ స్థలాల కోసం, 500 కోట్ల రూపాయల పరిమితి ఉంటుంది. అంచనా తర్వాత, మౌలిక సదుపాయాలు, ఇతర అనుబంధ సౌకర్యాల అభివృద్ధి కోసం మిగిలిన ప్రాజెక్టు వ్యయం లో 30 శాతం మేర అభివృద్ధి మూలధన మద్దతు ఉంటుంది. ఇది 200 కోట్ల రూపాయల పరిమితికి లోబడి ఉంటుంది. ఇది ప్రైవేటు రంగం భాగస్వామ్యం కోసం ప్రాజెక్టు ను ఆకర్షణీయంగా చేయడానికి అవసరమైన మిగులు నిధుల రూపంలో ఉంటుంది.
పి.ఎం. మిత్ర (पीएम मित्र) పార్కులు ఈ క్రింది వాటిని కలిగి ఉంటాయి:
1. ప్రధాన మౌలిక సదుపాయాలు:
ఇంక్యుబేషన్ సెంటర్ & ప్లగ్ & ప్లే సౌకర్యం; అభివృద్ధి చెందిన ఫ్యాక్టరీ స్థలాలు; రహదారులు; విద్యుత్ సరఫరా; నీటి సరఫరా; వ్యర్థ జలాల నిర్వహణ వ్యవస్థ; కామన్ ప్రాసెసింగ్ హౌస్ మరియు సి.ఈ.టి.పి. తో పాటు, డిజైన్ సెంటర్, టెస్టింగ్ సెంటర్ల వంటి ఇతర సంబంధిత సౌకర్యాలు.
2. అనుబంధ మౌలిక సదుపాయాలు:
కార్మికుల వసతి గృహాలు మరియు గృహ నిర్మాణం; వాహనాలు నిలుపుకునే స్థలం; సరుకుల గిడ్డగులతో పాటు, వైద్య, శిక్షణ, నైపుణ్యాభివృద్ధి సదుపాయాలు.
స్వచ్ఛమైన తయారీ కార్యకలాపాల కోసం 50 శాతం ప్రాంతాన్ని, మిగిలిన ప్రయోజనాల కోసం 20 శాతం ప్రాంతాన్ని, అదేవిధంగా వాణిజ్య అభివృద్ధి కోసం 10 శాతం ప్రాంతాలను పి.ఎం. మిత్ర (पीएम मित्र) ద్వారా అభివృద్ధి చేయడం జరుగుతుంది.
పి.ఎం. మిత్ర (पीएम मित्र) యొక్క వ్యూహాత్మక ప్రాతినిధ్యం క్రింద వివరించబడింది:
ఈ భారీ సమగ్ర వస్త్ర ప్రాంతాలు మరియు అపెరల్ పార్కుల కీలక భాగాలు * 5 శాతం ప్రాంతాన్ని సూచిస్తుంది # ఆ ప్రయోజనం కోసం ఉపయోగించే 10 శాతం ప్రాంతాన్ని సూచిస్తుంది.
పి.ఎం. మిత్రా ( पीएम मित्र) పార్క్ ఒక ప్రత్యేక ప్రయోజన సంస్థ ద్వారా అభివృద్ధి చేయబడుతుంది, ఇది ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పి.పి.పి) పద్దతిలో రాష్ట్ర ప్రభుత్వం మరియు భారత ప్రభుత్వ యాజమాన్యం లో ఉంటుంది. మాస్టర్ డెవలపర్ పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేయడంతో పాటు, రాయితీ కాలంలో దాని నిర్వహణ బాధ్యతలను కూడా చేపడతారు. ఈ మాస్టర్ డెవలపర్ ఎంపిక రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రూపొందించిన విధానం ప్రమాణాల ఆధారంగా జరుగుతుంది.
రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ శాతం యాజమాన్యం ఉన్న ఎస్.వి.పి. కి అభివృద్ధి చెందిన పారిశ్రామిక స్థలాల నుండి లీజు అద్దె లో కొంత భాగాన్ని స్వీకరించడానికి అర్హత ఉంటుంది. అదేవిధంగా, పి.ఎం. మిత్ర (पीएम मित्र) పార్కును విస్తరించడం ద్వారా ఆ ప్రాంతంలో వస్త్ర పరిశ్రమ ను మరింత పెంపొందించడానికి, కార్మికుల కోసం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలతో పాటు, ఇతర సంక్షేమ ప్రయోజనాలను అందించడం ద్వారా కూడా దాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.
ఉత్పత్తి యూనిట్లు స్థాపించే విధంగా ప్రోత్సహించడానికి, ప్రతి పి.ఎం. మిత్రా (पीएम मित्र) పార్కుకు, భారత ప్రభుత్వం, 300 కోట్ల రూపాయల మేర నిధులను కూడా అందిస్తుంది. ఇది పోటీతత్వ ప్రోత్సాహక మద్దతు (సి.ఐ.ఎస్) గా వ్యవహరించే ఈ ఆర్ధిక సహాయాన్ని, పి.ఎం. మిత్ర (पीएम मित्र) పార్క్ లో కొత్తగా స్థాపించిన యూనిట్ టర్నోవర్ లో 3 శాతం వరకు అందజేస్తారు. స్థాపనలో ఉన్న కొత్త ప్రాజెక్టులకు ఇటువంటి మద్దతు చాలా కీలకం. ఖర్చులకు సరిపడా ఆదాయాన్ని సమకూర్చుకోలేని యూనిట్లకు, వాటి ఉత్పత్తిని పెంచడానికి, వాటి సాధ్యతను స్థాపించగలిగేంత వరకు ఈ మద్దతు చాలా అవసరం.
ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల తో కలిసి, ఆ పథకాల మార్గదర్శకాల ప్రకారం వారి అర్హత ప్రకారం ఈ పథకం కూడా అందుబాటులో ఉంటుంది. ఇది వస్త్ర పరిశ్రమ యొక్క పోటీతత్వాన్ని పెంపొందిస్తుంది, భారీ స్థాయిలో ఆర్థిక వ్యవస్థలను సాధించడంలో సహాయపడటం ద్వారా లక్షలాది మందికి భారీ ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుంది. భారీ స్థాయిలో ఆర్ధిక వ్యవస్థలను పెంపొందించడం ద్వారా, ఈ పథకం భారత కంపెనీలు అంతర్జాతీయ స్థాయిలో విజేతలుగా ఎదగడానికి సహాయపడుతుంది.
*****
(Release ID: 1761572)
Visitor Counter : 354
Read this release in:
Tamil
,
Kannada
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia