ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 06 OCT 2021 9:16AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా, ఇప్పటివరకు 92.17 కోట్ల డోసులను అందించారు.

గత 24 గంటల్లో 18,833 కొత్త కేసులు నమోదయ్యాయి.

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1% కంటే తక్కువగా, 0.73% వద్ద ఉన్నాయి. 2020 మార్చి నుంచి ఇది కనిష్ట స్థాయి.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 2,46,687. ఇది 203 రోజుల కనిష్ట స్థాయి.

రికవరీ రేటు 97.94% కు చేరింది. 2020 మార్చి నుంచి ఇది గరిష్ట స్థాయి.

గత 24 గంటల్లో 24,770 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,31,75,656 కు పెరిగింది.

వారపు పాజిటివిటీ రేటు (1.68%) గత 103 రోజులుగా 3% కన్నా తక్కువగా ఉంది.

రోజువారీ పాజిటివిటీ రేటు (1.34%) గత 37 రోజులుగా 3% కన్నా తక్కువగా ఉంది.

ఇప్పటివరకు 57.68 కోట్ల కొవిడ్‌ పరీక్షలు చేశారు.

****



(Release ID: 1761407) Visitor Counter : 116