జల శక్తి మంత్రిత్వ శాఖ
గాంధీ జయంతి రోజున యమునా ఘాట్‌లో పరిశుభ్రతా కార్యక్రమాన్ని నిర్వహించిన ఎన్.ఎం.సి.జి
Posted On:
02 OCT 2021 7:51PM by PIB Hyderabad
స్వచ్చతాహి సేవా ప్రచారం, గాంధీ జయంతి ఉత్సవాలలో భాగంగా నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ( ఎన్.ఎం.సి.జి) అక్టోబర్ 2 వ తేదీన నోయిడావైపుగల కాళిందీ కుంజ్ లోని యమునా ఘాట్‌లో పరిశుభ్రతా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఎన్.ఎం.సి.జి కి చెందిన స్టేక్ హోల్డర్లు, భాగస్వాములు, గంగా విచార్ మంచ్ , ట్రీ గ్రేజ్ ఫౌండేషన్, గంగా సమగ్ర, యమునా మిషన్, స్థానిక మునిసిపల్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్.ఎం.సి.జి బృందానికి ఎన్.ఎం.సి.జి డైరక్టర్ జనరల్ శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా నాయకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ఆయన స్వాగతం పలికారు. గంగానది పునరుజ్జీవనకు తమ చిత్తశుద్ధిని పునరుద్ఘాటిస్తూ వారి చేత గంగా ప్రతిజ్ఞను ఆయన చేయించారు. ఇడి ( ప్రాజెక్టులు) శ్రీ అశోక్ కుమార్ సింగ్ కూడా ఇందులో పాల్గొన్నారు.
శ్రమదాన్ బృందాలను రెండు భాగాలుగా విభజించడం జరిగింది. ఘాట్‌కు ఒకవైపును పశ్చిమ ఉత్తరప్రదేశ్ విభాగానికి చెందిన గంగా విచార్ మంచ్ వలంటీర్లు శుభ్రం చేశారు. శ్రీ భరత్ పాఠక్ నేషనల్ క న్వీనర్, శ్రీ సిపి చౌహాన్ లు కూడా ఇందులో పాల్గొన్నారు. గంగా విచార్ మంచ్ అనేది ఒక వాలంటీర్ ప్లాట్‌ఫారం. ఇది ఎన్ ఎం సిజి కి చెందిన వివిధ స్టేహ్‌హోల్డర్ల మధ్య పరస్పరర సంభాషణలకు వీలు కల్పించే వాలంటీర్ ప్లాట్‌ఫారం. గంగా సమగ్రకు చెందిన నందితా పాఠక్ కూడా తమ బృందంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఘాట్ మరోవైపు ఎన్.ఎం.సిజి అధికారులు, యమునా మిషన్, ట్రీక్రేజ్ పౌండేషన్ ఇతరులు శుభ్రం చేశారు. ట్రీ క్రేజ్ ఫౌండేషన్ అనేది లాభాపేక్ష లేని చెట్టు, నదులు, పర్యావరణ పరిరక్షణకు పాటుపడే సంస్థ. ట్రీ క్రేజ్ ఫౌండేసణ్‌కు శ్రీమతి భావనా బడోలా నాయకత్వం వహించారు. నేషనల్ కేపిటల్ రీజియన్‌లో యమునా ఘాట్‌ల వద్ద వీరు క్రమంతప్పకుండా పరిశుభ్రతా కార్యక్రమాలు చేపడుతున్నారు. ట్రీ క్రేజ్ ఫౌండేషన్ , ఎన్.ఎం.సిజి నిర్వహించే గంగా క్వెస్ట్ ఆన్‌లైన్ ప్రత్యేక క్విజ్ నిర్వహణలో భాగస్వామి. ఈ క్విజ్ ద్వారా పిల్లలు, యువతను నమామి గంగే కార్యక్రమంలో భాగస్వాములను చేయడం దీని ఉద్దేశం.
ఎన్.ఎం.సి.జి డిజి ,శ్రీ రాజీ్ రంజన్ మిశ్రా, ఈ స్వచ్ఛతా కార్యక్రమానికి ముందుండి నాయకత్వం వహిస్తూ, గంగానది పునరుజ్జీవనం మాత్రమే కాక, దాని ఉపనదుల పవిత్రతను, స్వచ్ఛతను కాపాడి వాటిని కూడా పునరుజ్జీవించ చేయాలని అన్నారు. యమున, హిందాన్, రామ్ గంగా, కోసి వంటి వాటిని పరిశుభ్రంగా ఉంచేందుకు నమామి గంగే కార్యక్రమంలో భాగంగా పలు కార్యక్రమాలు మంజూరు అయినట్టు ఆయన తెలిపారు.
గాంధీ జయంతితో పాటు దేశం ఆజాదీకా అమృత్ మహోత్సవాన్ని జరుపుకుంటున్నదని ఆయన చెప్పారు. గంగా నది పరివాహక రాష్ట్రాలలో గంగా విచార్ మంచ్ వలంటీర్లు ఇలాంటి స్వచ్ఛతా కార్యక్రమాలను చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు.
***
(Release ID: 1760971)
Visitor Counter : 201