సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
ఖాదీ ప్రతిష్ఠాత్మక సిపి దుకాణంలో గాంధీ జయంతి సందర్భంగా రూ. 1.02 కో్ట్ల అమ్మకాల నమోదు
Posted On:
04 OCT 2021 4:01PM by PIB Hyderabad
ప్రధానమంత్రి విజ్ఞప్తి, ఖాదీ ప్రేమికుల స్ఫూర్తి కారణంగా ఢిల్లీలోని కనాట్‌ప్లేస్‌లోని ప్రతిష్ఠాత్మక ఖాదీ ఇండియా దుకాణంలో గాంధీ జయంతి సందర్భంగగా ఖాదీ అమ్మకాలు పుంజుకుని రూ. 01 కోటి దాటాయి. కోవిడ్-19 సెకెండ్ వేవ్ మహమ్మారి పరిస్థితుల నడుమ కూడా అక్టోబర్ 2వ తేదీన మొత్తం రూ.1,01,66,000 (1.02 కోట్లు) విలువైన ఖాదీ ఉత్సత్తుల అమ్మకాలు జరిగాయి. ముఖ్యంగా, అక్టోబర్ 2వ తేదీన ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కెవిఐసి) అన్ని ఖాదీ, గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తులన్నంటిపై లాంఛనంగా వార్షిక పండుగ ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. కనాట్ ప్లేస్ షోరూంలో అక్టోబర్ 2వ తేదీన రూ.01 కోటి మార్క్‌ను దాటడం 2018 నుంచి వరుసగా ఇది నాలుగవ సారి. గత ఏడాది అక్టోబర్ 2వ తేదీన జరిగిన స్థూల అమ్మకాలు రూ. 1.02 కోట్లు కాగా, అక్టోబర్ 2వ తేదీ 2019న మొత్తం అమ్మకాలు రూ.1.27 కోట్లుగా ఉన్నాయి. ఇది ఒకరోజులో జరిగిన అత్యధిక ఖాదీ అమ్మకాలు. ఇక, 2018లో అక్టోబర్ 2వ తేదీన మొత్తం అమ్మకాల విలువ రూ. 1.06గా ఉంది.
ఇంత భారీ అమ్మకాలు జరగడానికి కారణం ఖాదీ ఉత్పత్తులను కొనుగోలు చేయమంటూ తరచుగా ప్రధానమంత్రి చేసిన విజ్ఞప్తులు, ప్రజలలో ఖాదీకి నిరంతరం పెరుగుతున్న ఆమోదమేనని, కెవిఐసి చైర్మన్ వినయ్ కుమార్ సక్సేనా అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే పర్యావరణ అనుకూల ఉత్పత్తి అయిన ఖాదీ, అన్ని వర్గాల, వయసుల ప్రజలలో అత్యంతగా ఆదరణ పొందుతోంది. కోవిడ్ -19 కాలంలో, హెర్బల్ ఉత్పత్తులు, పర్యావరణ అనుకూల ఉత్పత్తులకు డిమాండ్ అనేక రెట్లు పెరిగింది. విస్త్రతమైన వినియోగదారుల బేస్ కోసం, సవాళ్ళ నడుమ కూడా అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ, కెవిఐసి నిరంతరం కొత్త ఉత్పత్తులను జత పరుస్తోందని, సక్సేనా చెప్పారు.
గత సంవత్సరంలాగానే, 2021లో కూడా ఖాదీ, గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తుల ఉత్పాదకత కూడా కోవిడ్-19 రెండవ వేవ్ కారణంగా విధించిన లాక్‌డౌన్లతో ప్రభావితమైంది. కాగా, ఖాదీ ఉత్పత్తులను కొనుగోలు చేయవలసిందిగా పలు సందర్భాలలో ప్రధానమంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల, సెప్టెంబర్ 26న ప్రసారమైన మన్ కీ బాత్ లో ప్రధానమంత్రి ఈ పండుగల సీజన్‌లో ఖాదీ ఉత్పత్తులను కొనుగోలు చేసి గతకాలపు ఖాదీ అమ్మకాలను రికార్డులను బద్దలు చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు.
***
(Release ID: 1760841)
Visitor Counter : 187