ఆర్థిక మంత్రిత్వ శాఖ
అహ్మదాబాదులో సోదాలు నిర్వహించిన ఆదాయపు పన్ను శాఖ
Posted On:
02 OCT 2021 11:00AM by PIB Hyderabad
ఒక రియల్ ఎస్టేట్ డెవలపర్ గ్రూపు, దానికి సంబంధించిన బ్రోకర్లపై ఆదాయపు పన్ను శాఖ సెర్చ్ అండ్ సీజర్ (సోదాలు & స్వాధీనం) ఆపరేషన్ ను 28.09.2021న నిర్వహించింది. మొత్తం 22 ఆవాస, వాణిజ్య ఆవరణలపై ఈ ఆపరేషన్ జరిగింది.
రియల్ ఎస్టేట్ డెవలపర్ గ్రూపుకు సంబంధించి పెద్ద సంఖ్యలో నేరారోపణ చేసే పత్రాలు, విడి పత్రాలు, డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. పలు ఆర్ధిక సంవత్సరాలలో ఈ గ్రూపు జరిపిన లెక్కల్లోకి రాని లావాదేవీలకు సంబంధించి వివరణాత్మక రికార్డులను ఈ ఆధారాలు కలిగి ఉన్నాయి. ఇప్పటి వరకూ లెక్కల్లోకి రాని రూ. 200 కోట్లకుపైగా భూమి పై పెట్టిన పెట్టుబడులను చూపే పత్రాలు, అలాగే రూ. 100 కోట్లకు పై భూమి అమ్మకాలకు సంబంధించిన లెక్కల్లోకి రాని నగదు రసీదులను ఇప్పటివరకూ స్వాధీనం చేసుకున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా కొనుగోలు చేసి, బినామీ వ్యక్తుల పేర్లతో నమోదు చేసిన ఆస్తులకు సంబంధించిన అసలు పత్రాలను కూడా కనుగొన్నారు.
ఇక బ్రోకర్ విషయంలో, ఆ వ్యక్తి ద్వారా కొనుగోలు చేసి, అమ్మిన భూమికి సంబంధించి లావాదేవీలకు సంబంధించి నగదు రూపంలో చెల్లింపులు, చెక్కులకు సంబంధించి వివరాలను వెల్లడించే పత్రాలను కనుగొన్నారు. ఈ భూమి ఒప్పందాలలో రూ. 230 కోట్లకు పైగా నగదు లావాదేవీలు జరిగినట్టు చూపే పత్రాలను ఇప్పివరకు కనుగొని, స్వాధీనం చేసుకోవడం జరిగింది.
రియల్ ఎస్టేట్ గ్రూపుకు సంబంధించి రూ. 200 కోట్లకు పైగగా లెక్కల్లోకి రాని ఆదాయన్ని, బ్రోకర్ల వద్ద నమోదు చేసిన పార్టీలకు సంబంధించి రూ. 200 కోట్లకు పైగా లెక్కల్లోకి రాని ఆదాయాన్ని ఈ పత్రాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం మీద, ఈ సెర్చ్ అండ్ సీజర్ ఆపరేషన్ ఫలితంగా రూ. 500 కోట్లకు పైగా లెక్కల్లోకి రాని లావాదేవీలను కనుగొనడం జరిగింది.
ఈ సందర్భంగా 24 లాకర్లను కనుగొని, వాటిని స్తంభింపచేయడం జరిగింది. దాదాపు రూ. 1 కోటి రూపాయల నగదును, రూ. 98 లక్షలు విలువ చేసే ఆభరణాలను ఇప్పటి వరకూ స్వాధీనం చేసుకున్నారు.
సెర్చ్ అండ్ సీజర్ ఆపరేషన్లు ఇంకా కొనసాగుతున్నాయి, తదుపరి దర్యాప్తు పురోగతిలో ఉంది.
***
(Release ID: 1760483)
Visitor Counter : 208