సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా సైన్స్ మ్యూజియాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు
ఐక్యరాజ్యసమితిలో ప్రధాని మోదీ ఇటీవల చేసిన ప్రబోధాలకు అనుగుణంగా
సైన్స్ ఆధారిత, హేతుబద్ధమైన ప్రగతిశీల భావాలు అభివృద్ధికి ఆధారం కావాలి
సీఎస్ఐఆర్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియాలు (ఎన్సీఎస్ఎం) సీఎస్ఐఆర్ ప్రయోగశాలలలో సైన్స్ మ్యూజియాల ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. భారతదేశ ప్రజలలో శాస్త్రీయ స్వభావాన్ని పెంపొందించడానికి ఈ అవగాహన ఒప్పందం ఉపయోగపడుతుంది.
సైన్స్ సెంటర్లు దేశంలో సైన్స్ విద్యకు పెంపొందిస్తాయి. ప్రజలలో యువతలో శాస్త్రీయ స్వభావాన్ని పెంపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
Posted On:
29 SEP 2021 6:39PM by PIB Hyderabad
కేంద్ర సైన్స్ & టెక్నాలజీ; మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ (ఇండిపెండెంట్ ఛార్జ్) జి.కిషన్ రెడ్డి, ఎర్త్ సైన్సెస్; పీఎంఐ, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ స్పేస్ శాఖల సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు మాట్లాడుతూ శాస్త్రీయ దృక్పథాన్ని ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా సైన్స్ మ్యూజియాలను ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నదని ప్రకటించారు. ముఖ్యంగా పిల్లలు యువతరం మధ్య శాస్త్రీయ ఆలోచనా విధానం పెంచుతామని చెప్పారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం (ఎన్సీఎస్ఎం) మధ్య ఒక ఎంఓయుపై సంతకం చేసిన తర్వాత ఇద్దరు మంత్రులు మాట్లాడారు. సమాజంలోని అన్ని వర్గాలలోని సామాన్య ప్రజలలో శాస్త్రీయ ఉత్సుకత, అవగాహనను ప్రోత్సహించడానికి ఎంచుకున్న సీఎస్ఐఆర్ ప్రయోగశాలలలో సైన్స్ మ్యూజియాలను ఏర్పాటు చేయడం ఈ ఎంఓయు లక్ష్యం.
డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ 21 వ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కొనేందుకు శాస్త్రీయ ఆలోచనను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ఇటీవలి మహమ్మారి సైన్స్ శాస్త్రీయ ఆలోచన ప్రాముఖ్యతను నొక్కిచెప్పిందన్నారు. న్యూయార్క్లో 76 వ యునైటెడ్ నేషనల్ జనరల్ అసెంబ్లీలో ఇటీవల ప్రధాని చేసిన ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ, ప్రపంచం ఎదుర్కొంటున్న తిరోగమన ఆలోచన తీవ్రవాదం ముప్పును మోదీ ఎత్తి చూపారని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. విజ్ఞాన ఆధారిత, హేతుబద్ధమైన ప్రగతిశీల ఆలోచనను పెంచుకోవాలని పునరుద్ఘాటించారు. అభివృద్ధికి ఆధారమైన సైన్స్ ఆధారిత విధానాన్ని బలోపేతం చేయడానికి, భారతదేశం అనుభవం ఆధారిత అభ్యాసాన్ని ప్రోత్సహిస్తోందని ప్రకటించారు.
నేటి ఎంఒయు ఈ దిశగా ఒక ముందడుగు అని, సైన్స్ కమ్యూనికేషన్ వ్యాప్తి చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టిస్తుందని మంత్రి చెప్పారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జాతి ఆజాదీ కా అమృత మహోత్సవాన్ని జరుపుకుంటున్న సరైన సమయంలో ఇది జరగడం గర్వించదగ్గ విషయం అని ఆయన అన్నారు. 2020 లో సీఎస్ఐఆర్ సొసైటీ సమావేశంలో ప్రధాన మంత్రి కోరుకున్న విధంగా పాఠశాల విద్యార్థుల కోసం ఐఐటీ- బొంబాయి భాగస్వామ్యంతో వర్చువల్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయడంలో సీఎస్ఐఆర్ కొత్త చొరవ అత్యంత ప్రశంసనీయమైనదని అన్నారు. గత ఎనిమిది దశాబ్దాలుగా సీఎస్ఐఆర్ అభివృద్ధి చేసిన సాంకేతికతలను ప్రదర్శించడానికి ఎన్పీఎల్ లోపల ఒక మ్యూజియం ఏర్పాటు చేయడానికి సీఎస్ఐఆర్ ఎన్సీఎస్ఎం తీసుకున్న చర్యలను కూడా ఆయన స్వాగతించారు.
ఈ చొరవ కూడా నరేంద్ర మోడీ దృష్టికి అనుగుణంగా ఉందని, సైన్స్, టెక్నాలజీ తప్పనిసరిగా దేశంలోని అన్ని మూలలకు చేరేలా విస్తరించాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. మ్యూజియాలు స్థిరంగా ఉండకూడదని, చలనస్వభావంతో, ఆకర్షణీయంగా ఉండాలనిసూచించారు. ఆవిష్కరణలకు ఆలంబనగా ఎదగాలని వ్యాఖ్యానించారు. విద్యార్థులు, యువతలో ఉత్సుకత ఉత్సాహాన్ని మనం పెంచాలని సూచించారు. సీఎస్ఐఆర్ కేంద్రీయ విద్యాలయాలు నవోదయ విద్యాలయాలు నీతిఆయోగ్ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ స్కూళ్లతో జతకట్టినప్పటికీ, అవి తప్పనిసరిగా మారుమూల ప్రాంతాలు పాఠశాలలకు చేరుకోవాలని అన్నారు. సీఎస్ఐఆర్ వర్చువల్ ల్యాబ్‌లు ఎన్సీఎస్ఎం మొబైల్ సైన్స్ మ్యూజియాలు చాలా విలువైనవని మంత్రి అన్నారు.
అనంతరం మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, "ప్రపంచవ్యాప్తంగా, సైన్స్ సెంటర్లు దేశంలో సైన్స్ విద్యకు అనుబంధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఎదుగుతోంది. ముఖ్యంగా ప్రజలలో యువతలో శాస్త్రీయ స్వభావాన్ని పెంపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నదని రుజువయింది" అని అన్నారు. ఇది మన ప్రధాని దృష్టి అని కూడా ఆయన హైలైట్ చేశారు, విద్యార్థులు 21 వ శతాబ్దపు ఐదు సీలుగా పేర్కొన్న '21 వ శతాబ్దపు నైపుణ్యాలతో విద్యార్థులు ముందుకు సాగాలని చెప్పారు. అవి క్లిష్టమైన ఆలోచన, సృజనాత్మకత, సహకారం, ఉత్సుకత కమ్యూనికేషన్ అని వివరించారు.
ఈ ఎంఒయుపై సంతకం చేయడం వల్ల ఎన్‌సిఎస్ఎం సిఎస్ఐఆర్ దాని ప్రయోగశాలలు వారి లక్ష్యాలను మన ప్రధాన మంత్రి దృష్టికి అనుగుణంగా సాధిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడానికి తమ మంత్రిత్వ శాఖ నుండి అన్ని విధాలా సహాయం చేస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. భారతదేశంలో సైన్స్, టెక్నాలజీ ఇన్నోవేషన్ సంస్కృతిని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వంలోని ఇతర విభాగాల మధ్య సహకారం కూడా అవసరం అని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
(Release ID: 1760304)
Visitor Counter : 174