రక్షణ మంత్రిత్వ శాఖ
ఫిలిప్పీన్స్‌కు చెందిన వాణిజ్య నౌక చీఫ్ ఆఫీసర్‌ను అత్యవసర వైద్య సేవలకు గాను తరలింపు ప్రక్రియ చేపట్టిన భారత నౌకాదళం, తీరగస్తీ దళం
Posted On:
29 SEP 2021 11:10AM by PIB Hyderabad
నడి సముద్రంలో కోవిడ్ లక్షణాలతో భాదపడుతున్న ఫిలిప్పీన్స్‌కు చెందిన ఒక వాణిజ్య నౌకా సిబ్బందిని భారత నౌకాదళం మరియు తీరగస్తీ దళం మేటి సమన్వయం కనబరుస్తూ వేగంగా అత్యవసర వైద్య సేవల కోసం తరలించింది. మంగళవారం (28.09.2021) సాయంత్రం దాదాపు 4 గంటల ప్రాంతంలో ఫిలిప్ఫీన్స్‌కు చెందిన ఒక వాణిజ్య నౌకలో సిబ్బందికి కోవిడ్-19 పాజిటివ్ సోకినట్టు అనుమానం ఉందంటూ.. ఒక సదరన్ నావెల్ కమాండ్‌కు (ఎస్.ఎన్.సి) తీరగస్తీ దళం ప్రధాన కార్యాలయం నుంచి సమాచారం అందింది. ఫిలిప్పీన్స్ నౌకకు చెందిన చీఫ్ ఆఫీసర్ మైఖేల్ జాన్ అబైగర్ యొక్క వైద్య పరిస్థితి క్షీణిస్తోందని.. ఆక్సిజన్ స్థాయిలు తీవ్రంగా పడిపోతున్నాయని మరియు తక్షణం అత్యవసర వైద్య తరలింపు అవసరమని మర్చంట్ వెసెల్ (ఎంవీ) లోకల్ ఏజెంట్ భారత్ అధికారులకు తెలియజేశారు. దీంతో జిబ్రాల్టర్ నుండి మచోంగ్‌కి వెళ్తున్న ఎండీ ఆన్‌బోర్డ్ నుండి మెడికల్ ఎవాక్యువేషన్ (మెడీఎవాక్) చేపట్టడానికి అధికారులు చర్యలు ప్రారంభించారు. ఐఎన్ఎస్ గరుడ నుండి అత్యాధునిక తేలికపాటి హెలికాప్టర్ (ఏఎల్‌హెచ్) వెనువెంటనే భయలుదేరి వెళ్లింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులలో మేటి నైపుణ్యతను ప్రదర్శించిన హెలికాప్టర్ పైలట్లు విజయవంతంగా మిషన్ పూర్తి చేశారు. రోగిని సురక్షితంగా నౌక నుంచి తరలించారు. తొలత హెలికాప్టర్ ద్వారా రోగిని ఐఎన్ఎస్ గరుడ నౌకకు తీసుకువచ్చారు. ఆ తరువాత కోవిడ్- 19 ప్రోటోకాల్‌లకు లోబడి తదుపరి వైద్య సహాయం కోసం నావికా దళం ఆసుపత్రి ఐఎన్‌హెచ్ఎస్ఎస్ సంజీవినికి మైఖేల్ జాన్ అబైగర్‌ను తరలించారు.
******
(Release ID: 1759371)
Visitor Counter : 171