ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ముగిసిన 4వ ఇండియా - అమెరికా 2021 ఆరోగ్య చర్చలు
ఇండియా- అమెరికా 4వ ఆరోగ్య చర్చల ముగింపు సమావేశంలో ప్రసంగించిన కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ మన్‌సుఖ్ మాండవీయ
ఆరోగ్యం, బయోమెడికల్ విజ్ఞాన రంగంలో సహకారానికి ఇండియా, అమెరికాల మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందం.
ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ రిసెర్చ్ ( ఐసిఇఆర్) విషయంలో సహకారానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్‌మెడికల్ రిసెర్చ్ (ఐసిఎంఆర్), ఎన్ ఐ ఎ ఐ డి ( ఎన్ ఐ హెచ్)ల మధ్య కూడా కుదిరిన అవగాహనా ఒప్పందం.
ఇరు దేశాల మధ్య నిర్మాణాత్మక, సానుకూల సహకారం ఇరు దేశాల మధ్యే కాక మొత్తం ప్రపంచ శాంతి, సామరస్యం, ప్రగతికి దోహదం కాగలదన్న శ్రీ మన్‌సుఖ్ మాండవీయ
Posted On:
28 SEP 2021 4:48PM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ మన్‌సుఖ్ మాండవీయ ఈ రోజు 4వ ఇండియా అమెరికా ఆరోగ్య చర్చల ముగింపు సమావేశంలో ప్రసంగించారు. ఇండియా ఈ సమావేశానికి ఆథిత్యం ఇచ్చింది.
రెండు రోజుల పాటు ఆరోగ్య రంగానికి చెందిన పలు అంశాలపై ఉభయ దేశాల సహకారానికి సంబంధించి చర్చించేందుకు ఈ సమావేశం వీలు కల్పించింది. మహమ్మారులకు సంబంధించిన పరిశోధన, నిఘా, వాక్సిన్ అభివృద్ధి, అందరికీ ఆరోగ్యం, జంతువుల ద్వారా సంక్రమించే వ్యాధులు, కీటకాల ద్వారా సంక్రమించే వ్యాధులు, ఆరోగ్య వ్యవస్థలు, ఆరోగ్య విధానాలు తదితర అంశాలపై ఈ రెండు రోజుల సమావేశంలో విస్తృతంగా చర్చించడం జరిగింది.
ముగింపు సమావేశం సందర్భంగా ఈరోజు రెండు అవగాహనా ఒప్పందాలు కుదిరాయి. ఇందులో ఒకటి ఇండియా ఆరోగ్య కుటుంబ మంత్రిత్వశాఖకు, అమెరికా డిపార్టమెంట్ ఆఫ్ హెల్త్, హ్యూమన్ సర్వీసెస్ ల మధ్య ఆరోగ్య, బయో మెడికల్ సైన్స్ ల కు సంబంధించిన ఎం.ఒ.యు కాగా, మరొకటి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చి (ఐసిఎంఆర్), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అలర్జి, ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్ (ఎన్.ఐ.ఎ.ఐ.డి ) సంస్థ మధ్య ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ రిసెర్చి (ఐసిఇఆర్) కు సంబంధించి సహకార ఒప్పందం.
4వ ఇండియా- అమెరికా ఆరోగ్య చర్చల రెండు రోజుల సమావేశం ముగింపు సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ మన్‌సుఖ్ మాండవీయ ఒక ప్రత్యేక ప్రసంగం చేశారు
వారు చేసిన ప్రసంగం ఇలా ఉంది.
ఇండియా, అమెరికాల మధ్య జరుగుతున్న నాలుగవ ఆరోగ్య సదస్సు ముగింపు సమావేశంలో నేను పాల్గొంటూ మీ మధ్య ఉండడం నాకు ఎంతో సంతోషంగా ఉంది.
ఇండియాకు , అమెరికాతో వివిధ రంగాలలో సంబంధాలకు ఎంతో విలువ ఇస్తాం. గతంలో మేం ఇండియా అమెరికాల మధ్య సంబంధాలను నిరంతరం వృద్ధిచేసుకుంటూ సుదీర్ఘకాలంగా ముందుకుసాగుతూ వస్తున్నాం. అమెరికా ప్రాచీన ఆధునిక ప్రజాస్వామిక దేశం. ఇండియా ఆధునిక ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశం. ఇరు దేశాల మధ్య నిర్మాణాత్మక, సానుకూల సహకారం ఇరుదేశాల మధ్యే కాక మొత్తం ప్రపంచ శాంతి, సామరస్యం, ప్రగతికి దోహదపడుతుంది.
200 సంవత్సరంలో నాటి ప్రధానమంత్రి దివంగత శ్రీ అటల్ బిహారి వాజ్‌పేయిజీ ఇండియా, అమెరికాలు సహజ మిత్రులని అభివర్ణించిన విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అలాగే, ఇవాళ ఇండియా, అమెరికాల ఆరోగ్య సంభాషణలు ఇరుదేశాల మధ్య వైద్యం, ఆరోగ్యం, అందరికీ ఆరోగ్య విషయంలో సహాయం వంటి వాటి విషయంలో పరస్పర సహకారాన్ని ప్రోత్సహిస్తున్నది. అందరికీ ఆరోగ్యం అనేది నిజంగా ఎంతో ప్రశంసనీయమైనది.
ఇటీవల గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీజీ , అమెరికా పర్యటన సందర్భంగా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, ప్రాంతీయ , అంతర్జాతీయ అంశాలపై పరస్పర అభిప్రాయాల మార్పిడి, ప్రత్యేకించి శాస్త్ర , సాంకేతిక విజ్ఞాన రంగాలపై అభిప్రాయాలు కలబోసుకోవడం ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంలో కీలకమైన మైలురాళ్లుగా చెప్పుకోవచ్చు.
ఈ సమావేశం ప్రస్తుత ఆరోగ్య రంగంలో పరస్పర సహకారానికి కూడా ఎంతో ప్రయోజనకరం కాగలదు. ఇండియా అమెరికాలు ఇతర ఇండో-పసిఫిక్ దేశాలతో కూడా క్రియాశీలంగా సంబంధాలు కొనసాగిస్తున్నాయి.
కోవిడ్ స్పందన, వాక్సిన్ అభివృద్ధి, మెరుగైన విధానాలను ఇచ్చిపుచ్చుకోవడం, సప్లయ్ చెయిన్ మేనేజ్‌మెంట్, ఆర్ధిక వ్యవస్థల పునరుద్ధరణ వంటివి మైలు రాళ్లుగా చెప్పుకోవచ్చు.దీనికి తోడు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఇటీవల క్వాద్ నాయకుల శిఖరాగ్ర సమ్మేళనంలో సెప్టెంబర్ 24 న సమావేశమయ్యారు. నూతన రంగాలలో పరస్పర సహకారానికి, ప్రస్తుత భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం, ఇండో, పసిఫిక్ ప్రాంతంలో మొత్తంగా సానుకూల, నిర్మాణాత్మక సహకారం మరింత పెంపొందించడానికి ఇది ఉపయోగపడుతుంది.
పర్యావరణం, ఆక్యేపేషనల్ హెల్త్ రంగాలలో ఇరుదేశాల మధ్య సహకారం, గాయాల నిరోధం, నియంత్రణ, వాతావరణ మార్పులు, మానవాళి ఆరోగ్యం, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్, హెచ్.ఐ.వి, ఎయిడ్స్, యు.ఎస్.ఎఫ్.డి.ఎ తో చర్చలు ప్రిడిక్ట్ నమూనా ను అర్థం చేసుకోవడం, రిస్క్ ఆధారిత మేనేజ్‌మెంట్ ఉపకరణం, క్లినికల్ రిసెర్చ్ ఫెలోషిప్‌కు ఫండింగ్, ఇండియా, యుఎస్ఎలో మిడ్ కెరీర్ సైంటిస్ట్‌లకు నిధుల సమకూర్చడం, వంటివి ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడమే కాక, నైపుణ్యంగల ఆరోగ్య రంగ నిపుణులకు సంబంధించి బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయడానికి వీలు కల్పిస్తుంది.ఇండియా, అమెరికాలు అంతర్జాతీయ భాగస్వాములన్న విషయం మనందరికీ తెలిసిందే. మనం ప్రపంచ ఆరోగ్య వ్యవస్థానిర్మాణాన్ని మరింత బలోపేతం చేసేందుకు సమన్వయంతో పనిచేయవలసి ఉంది. ప్రస్తుత మహమ్మారి సమయంలో అంతర్జాతీయంగా ఆరోగ్య రంగంలోని లోపాలు స్పష్టంగా బయటపడిన విషయం తెలిసిందే.
ఇండియా, అమెరికాలు అంతర్జాతీయ భాగస్వాములన్న విషయం మనందరికీ తెలిసిందే. మనం ప్రపంచ ఆరోగ్య వ్యవస్థానిర్మాణాన్ని మరింత బలోపేతం చేసేందుకు సమన్వయంతో పనిచేయవలసి ఉంది. ప్రస్తుత మహమ్మారి సమయంలో అంతర్జాతీయంగా ఆరోగ్య రంగంలోని లోపాలు స్పష్టంగా బయటపడిన విషయం తెలిసిందే.
ఆరోగ్య రంగ అత్యవసరాలను నిర్వహించడానికి ఇండియా, అమెరికాలు కలసికట్టుగా కృషి చేయడం కూడా అంతే కీలకం. డిజిటల్ ఆరోగ్య, ఆవిష్కరణలకు మద్దతు, తక్కువ ధరకు అందించడం, పరిశోధన నెట్ వర్క్, పెద్ద ఎత్తున ఉత్పత్తిసామర్ధ్యం సాధించడం వంటి విషయాలలో ఉభయ దేశాలూ కృషి కొనసాగించవచ్చు. దీనివల్ల చవక ధరలో మందులు అటు ఇండియాలో, అమెరికాలో అందుబాటులో ఉండడమే కాకుండా ప్రపంచం మొత్తానికి అందుబాటులోకి రావడానికి వీలు కలుగుతుంది.
భారతీయ జనెరిక్ మందులు అంతర్జాతీయంగా వివిధ అనారోగ్యాలకు చికిత్సల ధరలను అందుబాటులోకి తేవడానికి ఉపయోగపడుతున్న విషయం చెప్పుకోదగినది.
ఇండియా అత్యంత నాణయమైన జనెరిక్ మందులను అన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలకు సరఫరా చేస్తున్నది. టిబి వ్యతిరేక మందుల తయారీలో ఇండియా అతి పెద్ద దేశంగా ఉంది. ఇండియా సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకున్నప్పుడు మనం, చవకైన, నాణ్యమైన అత్యంత నాణ్యతగల మందులను ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేయడానికి వీలు కలుగుతున్నది.
ఇరుదేశాల రెగ్యులేటర్ల మధ్య సమన్వయం బాగా వృద్ధి చెంది సంతృప్తి కర స్థాయిలో ఉంది, దీని నుంచి ముందు ముందు మరింత మంచి ఫలితాలు రానున్నాయి.ఉభయదేశాలూ సాగించే సమష్టి కృషి అంతర్జాతీయంగా కూడా ఉపయుక్తం కానుంది.
ఆరోగ్యరంగానికి సంబంధించిన చర్చ ముగిసింది. ఉభయ దేశాలు ఎంతో గొప్ప అనుభవాన్ని సాధించాయి, ఇరు దేశాలూ ద్వైపాక్షిక సహకారానికి మరింత కట్టుబడి ఉన్నాయి.
మీరందరూ ఇండియాలో సౌకర్యవంతంగా గడిపి, భారతదేశ సుసంపన్నమైన సంస్కృతీని దర్శించేందుకు కొంత సమయం గడిపి ఉంటారని భావిస్తున్నాను. మనం మన ఉమ్మడి ప్రయోజనాల కోసం కలసి పనిచేద్దాం. ఇది మొత్తంగా ప్రపంచానికి ప్రయోజనం కలగనుంది.
ఈ చర్చలకు సంబంధించి అమెరికా ప్రతినిధివర్గానికి యు.ఎస్. ఎంబసి చార్జ్ డి అపైర్స్ పాట్రికా ఎ లాసిన, అమెరికా ఆరోగయ, మానవ సేవల అంతర్జాతీయ వ్యవహారాల కార్యాలయ డైరక్టర్ లోయ్‌సీ పాసె, అమెరికా అంతర్జాతీయ వ్యవహారాల కార్యాలయ ఆసియా పసిఫిక్ డైరక్టర్ మిషెల్లీ మెక్ కోనెల్, హెచ్.హెచ్.ఎస్ కు హెల్త్ అటాచీ డాక్టర్ ప్రీతా రాజారామన్, యుఎస్ ఎయిడ్, హెచ్.ఓ డైరక్టర్ సంగీతా పటేల్, ఎన్.ఐ.ఎ.ఐ.డి ప్రతినిధి నందితా చోప్రా, గ్లోబల్ హెచ్.ఐ.వి, టిబి, హెచ్.హెచ్‌సి , సిడిసి డివిజన్ డైరక్టర్ డాక్టర్ మెలిస్సా న్యెన్‌డాక్‌లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్, డిహెచ్ఆర్ సెక్రటరీ, డిజి ఐసిఎంఆర్ డాక్టర్ బలరామ్ భార్గవ, శ్రీ ఎఎస్ డిజి (ఎన్.ఎ.సిఒ) అలోక్ సక్సేనా, జె.ఎస్ (పిహెచ్) శ్రీ లవ్ అగర్వాల్, జెఎస్ (పాలసీ, ఎన్‌సిడి) శ్రీ విశాల్ చౌహాన్, జె.ఎస్(రిజి, ఎం.ఇ) డాక్టర్ ఎం.కె. భండారి, జెఎస్ ఆర్‌సిహెచ్ శ్రీ పి. అశోక్ బాబు, డిసిజిఐకి చెందిన డాక్టర్ వి.జి.సొమాని, మంత్రిత్వశాఖ కు చెందిన ఇతర సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
***
(Release ID: 1759181)
Visitor Counter : 243