శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
80 వ సీఎస్ఐఆర్ ఫౌండేషన్ డే ఫంక్షన్ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా ప్రసంగించారు.
Posted On:
26 SEP 2021 2:54PM by PIB Hyderabad
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) కొత్త ఆవిష్కరణలతో తనను తాను పునర్ నిర్వచించుకోవాలని , అత్యున్నత శ్రేణి విజ్ఞాన శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ భవిష్యత్తును మలచుకోవాలని ఉప–రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు సూచించారు. ఆదివారం ఇక్కడ సీఎస్ఐఆర్ 80 వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలలో పాల్గొన్న ఆయన సీఎస్ఐఆర్ ప్రయోగశాలలు, సంస్థలు దీర్ఘకాలిక శాస్త్రీయ , సాంకేతిక పరిష్కారాల కోసం అవసరమయ్యే సవాళ్లను పరిష్కరించాలని కోరారు. ప్రత్యేకించి, సిఎస్ఐఆర్ వ్యవసాయ పరిశోధనపై ఎక్కువ దృష్టి పెట్టాలని , రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి కొత్త ఆవిష్కరణలు, సాంకేతికతలు , పరిష్కారాలతో రావాలని నాయుడు కోరారు. వాతావరణ మార్పులు, ఔషధ నిరోధకత, కాలుష్యం, అంటువ్యాధి , మహమ్మారి వ్యాప్తి వంటి వాటిపై శాస్త్రీయ సమాజం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
అనంతరం కేంద్ర సైన్స్ & టెక్నాలజీ (ఇండిపెండెంట్ ఛార్జ్) ఎర్త్ సైన్సెస్; పీఓంఎ, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ , స్పేస్ శాఖల, సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ రాబోయే పదేళ్లలో భారతదేశం ప్రపంచంతో పోటీ పడేలా చేయడానికి అవసరమైన సైన్స్ అండ్ టెక్నాలజీ ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలని కోరారు. "భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనూ మనమే అత్యుత్తమంగా ఉండాలనే మన ఆశయాన్ని సాధించుకోవాలి. ఎందుకంటే భారతదేశానికి యువజనాభా పెద్ద ఆస్తి. సరైన శిక్షణ , ప్రేరణతో వాళ్లు ఎంతటి సవాలును అయినా ఎదుర్కొనగలరు”అని ఆయన అన్నారు. దేశం ఆజాది కా అమృత్ మహోత్సవ్ను జరుపుకుంటున్నందున, సీఎస్ఐఆర్, డీబీటీ, డీఎస్టీ, ఎంఓఈఎస్లతో పాటు ఇతర సైన్స్ మంత్రిత్వ శాఖలు కలిసి తమ సామర్థ్యంతో రాబోయే 25 ఏళ్లలో మొత్తం దేశాన్ని శక్తిమంతగా మార్చగలవని అన్నారు. భవిష్యత్ టెక్నాలజీపై ఆధారపడి ఉంటుందని అన్నారు. భారతదేశానికి 100 ఏళ్లు నిండినప్పుడు, అది ప్రపంచానికే నాయకుడిగా మారాలని వ్యాఖ్యానించారు. శాస్త్రీయంగా , సాంకేతికంగా అసమాన ప్రతిభ చాటాలని, అన్ని రంగాల్లో ప్రగతి సాధించాలని మంత్రి పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో సైన్స్ అండ్ టెక్నాలజీ గత 7 సంవత్సరాలలో ఎంతో మెరుగైందని అన్నారు. భారీగా బడ్జెట్ ఇచ్చామని, చాలా ప్రత్యేక ప్రాధాన్యాన్ని పొందిందని వివరించారు. శాస్త్రీయ పరిశోధనలకు , ప్రయత్నాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఇస్తున్నామని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. సామాన్య మానవులకు "ఈజ్ ఆఫ్ లివింగ్" అందుబాటులోకి తీసుకురావడమే అన్ని పరిశోధనల అంతిమ లక్ష్యం అని, ఈ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి భారతదేశ అంతరిక్ష రంగంలో సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించారని వివరించారు. తద్వారా నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవడానికి మార్గం సుగమం అవుతుందని ఆయన అన్నారు. సామర్ధ్యం , సృజనాత్మకత దేశాన్ని సాంకేతికంగా అభివృద్ధిపరుస్తుందని సింగ్ పేర్కొన్నారు. దేశంలోని పరమాణు శక్తి క్షేత్రం శక్తిని ప్రధాని వెలికి తీశారన్నారు. భారతదేశం అణు కార్యక్రమాన్ని విస్తరించడానికి ప్రధాని మోదీ మాత్రమే అనుమతి ఇచ్చారని స్పష్టం చేశారు.
సీఎస్ఐఆర్ 80 సంవత్సరాల విజయవంతమైన ప్రయాణాన్ని ప్రశంసిస్తూ, ఎన్నికల్లో ఉపయోగించిన భారతదేశపు మొట్టమొదటి చెరగని సిరాను అభివృద్ధి చేయడం మొదలుకొని అణు గడియారాలను ఉపయోగించి భారతీయ ప్రామాణిక సమయాన్ని అందించడం వరకు సీఎస్ఐఆర్ ఎదగడాన్ని చూడటం అద్భుతమని అన్నారు. స్వరాజ్ ట్రాక్టర్ అభివృద్ధి నుండి ఇటీవల హన్సంగ్ టెస్ట్ ఫ్లైయింగ్ వరకు గత ఎనిమిది దశాబ్దాలలో సీఎస్ఐఆర్ ఎన్నో విజయాలు సాధించిందని ఆయన అన్నారు.
సిఎస్ఐఆర్ ఆరోమా మిషన్ గురించి ప్రస్తావిస్తూ, ఇది భారతదేశవ్యాప్తంగా , ముఖ్యంగా కాశ్మీర్‌లో వేలాది మంది రైతుల జీవితాల్లో మార్పు తెచ్చిందని మంత్రి అన్నారు. సీఎస్ఐఆర్ ఆరోమా మిషన్ కాశ్మీర్‌లో లావెండర్ పువ్వుల్లో అత్యున్నత రకాన్ని ప్రవేశపెట్టిందని, నేడు కాశ్మీర్‌లో పర్పుల్ విప్లవం జరుగుతోందని ఆయన అన్నారు. సిఎస్ఐఆర్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా హీంగ్ సాగును ప్రవేశపెట్టిందని, పుదీనా సాగునూ పెంచిందన్నారు. సాంప్రదాయేతర ప్రాంతాల్లో కుంకుమపువ్వును ప్రవేశపెట్టిందని కూడా ఆయన పేర్కొన్నారు.
గత నెల 75 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా యూపీ, కాశ్మీర్, మహారాష్ట్ర , హిమాచల్ నుండి రైతులు , పారిశ్రామికవేత్తలతో సంభాషించానని చెప్పారు. వారిలో ఒకరు, షిరిడీకి చెందిన రూపాలి, దేవాలయాల నుండి వచ్చిన ఎండిన పువ్వుల నుండి అగరువత్తుల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేశారని వెల్లడించారు. సీఎస్ఐఆర్ ఆమెకు తగిన యంత్రాంగాన్ని అందించింది. శిక్షణ ఇచ్చింది. నేడు రూపాలీ 200 మంది మహిళలను చాలా తన తయారీ యూనిట్‌లో నియమించుకుంది. వ్యవస్థాపకత , మహిళా సాధికారతకు సంబంధించిన ఈ విజయగాథలు దేశం పొడవునా ప్రతిబింబించాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు.
డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, సీఎస్ఐఆర్ వారసత్వం దాని అనేక జాతీయ ప్రయోగశాలలు , సంస్థల సేవల పునాదులపై నిర్మితమైందని అన్నారు. సిఎస్ఐఆర్లోని ప్రతి ప్రయోగశాల ప్రత్యేకమైనదని ప్రశంసించారు. భూగర్భ శాస్త్రం నుండి జన్యుశాస్త్రం, భౌతిక సాంకేతికత నుండి సూక్ష్మజీవుల సాంకేతికత , ఇంధనానికి ఆహారం వంటి విభిన్న రంగాల్లో ఎన్నో ప్రత్యేక పరిశోధనలు చేశారని చెప్పారు. గత సంవత్సరం కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రయోగశాలలు ఎలా కలిసిపోయాయో , కోవిడ్‌పై భారతదేశ పోరాటానికి సహాయపడే అనేక సాంకేతికతలను ఎలా అభివృద్ధి చేశాయో కూడా ఆయన గుర్తు చేశారు.
చివరగా, డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రతిష్టాత్మక శాంతి స్వరూప్ భట్నాగర్ బహుమతులు గెలుచుకున్న శాస్త్రవేత్తలు, పరిశోధకులు , విద్యార్థులందరినీ అభినందించారు , ప్రశంసలు గ్రహీతలు తమ అద్భుతమైన కార్యాలతో ఇతరులకు స్ఫూర్తినిస్తారని అన్నారు. సీఎస్ఐఆర్ ఇన్నోవేషన్ అవార్డు విజేతలలో విద్యార్థులు ఉన్నారని, వారి ఆవిష్కరణ శక్తిని చూసి తాను నిజంగా సంతోషిస్తున్నానని మంత్రి అన్నారు. భవిష్యత్ పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల నాయకులు, శాస్త్రవేత్తలు , ప్రొఫెసర్లు వారే అవుతారని ఆయన అన్నారు. ప్రొఫెసర్ కె. విజయ్ రాఘవన్, భారత ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్, డైరెక్టర్-జనరల్ కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) డాక్టర్ శేఖర్ మండే, సీఎస్ఐఆర్- హెచ్ఆర్డీజీ హెడ్ డాక్టర్ అంజన్ రే , సీనియర్ శాస్త్రవేత్తలు , సీఎస్ఐఆర్ అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(Release ID: 1759112)
Visitor Counter : 175