కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

తొలి నెలలోనే 1.7కోట్ల రిజిస్ట్రేషన్లు!


ఈ-శ్రమ్ పోర్టల్.లో అసంఘటిత
కార్మికుల వివరాల నమోదు...

అసంఘటిత కార్మికుల జాతీయ స్థాయి
సమాచార వ్యవస్థగా రూపొందిన పోర్టల్..
నమోదైన కార్మికులలో మహిళలు 50 శాతం..

సి.ఎస్.సి.ల ద్వారా 78శాతంపైగా రిజిస్ట్రేషన్లు పూర్తి..
కార్మికులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా
ప్రతి కార్మికుడి వివరాలూ రిజిస్టర్ కావాలి

కేంద్ర కార్మికమంత్రి భూపేందర్ యాదవ్ ప్రకటన..

Posted On: 26 SEP 2021 11:46AM by PIB Hyderabad

  దేశంలోని అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర కార్మిక వ్యవహారాలు, ఉపాధి కల్పనా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఈ-శ్రమ్ (e-Shram) పోర్టల్ ద్వారా, రికార్డ్ స్థాయిలో కార్మికులు నమోదయ్యారు. ఈ పోర్టల్ ప్రారంభించి నెలరోజులు ముగియగానే, కోటీ 71లక్షలకు పైగా అసంఘటిత రంగ కార్మికుల వివరాల నమోదు జరిగింది. 2021వ సంవత్సరం సెప్టెంబరు 25వ తేదీ నాటికి, 1,71,59,743మంది కార్మికుల వివరాలు ఈ పోర్టల్ ద్వారా నమోదయ్యాయి.

  

https://ci6.googleusercontent.com/proxy/BwDYJQ9sgahwrZ9MixaV8dk388oAseQ8vYCwBSz4JruvKr-wSrjLe61ZwnvBIqfB3zRWkUIW3Ff31_d86M8dCH55usdIp9uprTnqUOXI1mGoEem-ImEZchBAgw=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001ZV2O.png

  ఈ-శ్రమ్l (https://eshram.gov.in/) పోర్టల్.కు.. 2021 ఆగస్టు 26వ తేదీన కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ శ్రీకారం చుట్టారు. కేంద్ర కార్మిక ఉపాధి కల్పనా శాఖ సహాయమంత్రి రామేశ్వర్ తేలీ సమక్షంలో ఈ పోర్టల్ ప్రారంభోత్సవం జరిగింది. వలస కూలీలు, నిర్మాణ రంగం కార్మికులు, గిగ్ వర్కర్లు, ప్లాట్.ఫాం వర్కర్లతో సహా అసంఘటిత రంగంలోని కార్మికులందరి వివరాలను అందించగలిగే తొలి జాతీయ స్థాయి సమాచార వ్యవస్థగా (డేటాబేస్)గా ఈ పోర్టల్ రూపుదిద్దుకుంది. అసంఘటిత రంగంలోని కార్మికులకు సామాజిక రంగ పథకాల ప్రయోజనాలను అందించేందుకు ఈ పోర్టల్ దోహదపడుతుంది.

 

ఇ-శ్రమ్ పోర్టల్.లో అసంఘటిత రంగ కార్మికుల నమోదుపై

వారం, వారం ప్రగతి వివరాలు

https://ci6.googleusercontent.com/proxy/H3HX-CjT4drHpzes0Nnb61JcfygxNsjJnYGWQUfEf8WJ4qd4uiyTcBBJs3HXbZhjC7-wOWDkSwVKrG1bLhaTDDebMcUiJa3MC3SoevYRyppVHxEOJ38dmyO08A=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002IRTU.png

   ఈ-శ్రమ్ పోర్టల్లో కార్మికుల నమోదు ప్రక్రియకు సంబంధించి వారాలవారీగా చోటుచేసుకున్న ప్రగతిని ఈ పట్టిక సూచిస్తోంది. ఈ పోర్టల్ ద్వారా వారం వారం కార్మికుల సమీకరణ పెరుగుతూ రావడంతో కార్మికుల నమోదు ప్రక్రియ మరింత బలోపేతంగా రూపుదాల్చింది.  రెండవ వారంలో రిజిస్టరైన 19.52 లక్షల రిజిస్ట్రేషన్లతో పోల్చినపుడు,..మూడవ, నాలుగవ వారంలో చాలా ఎక్కువ స్థాయిలో నమోదు జరిగింది. నాలుగవ వారంలో ఏకంగా 69.53లక్షల మంది కార్మికుల వివరాలు ఇ-శ్రమ్ పోర్టల్ లో నమోదయ్యాయి.

   కార్మికుల నమోదు ప్రక్రియను పటిష్టపరిచే మరిన్ని చర్యలను ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో అసంఘటిత రంగ కార్మికులకు ఇ-శ్రమ కార్డులను కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ నిన్న పంపిణీ చేశారు. కోవిడ్ వైరస్ వ్యాప్తితో ప్రాణాలు కోల్పోయిన కార్మికులపై ఆధారపడిన వారికి ఇ.ఎస్.ఐ. కోవిడ్-19 సహాయ పథకానికి సంబంధించిన అనుమతి లేఖలను కూడా భూపేందర్ యాదవ్ పంపిణీ చేశారు. వాటితోపాటుగా, అటల్ బీమిత్ వ్యక్తి కల్యాణ్ యోజన సహాయ పథకానికి సంబంధించిన అనుమతి లేఖలను కూడా కేంద్రమంత్రి పంపిణీ చేశారు.

   ఈ సందర్భంగా భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ, అసంఘటిత రంగంలోని ప్రతి కార్మికుడూ తన  వివరాలను, ఈ-శ్రమ్ పోర్టల్.లో నమోదు చేసుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. “కార్మికుల రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ప్రతి రంగంలో ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారో మేం తెలుసుకోవాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించుకోవాల్సిందే. ఇప్పటికే పోర్టల్ ద్వారా 400 రంగాలను ప్రాతినిధ్యం లభించింది. చాలా చిన్నపాటి పనులు చేసుకునే వారితో సహా,  ప్రతి ఒక్క కార్మికుడూ ఈ-పోర్టల్.లో తన పేరు, వివరాలు నమోదు చేసుకోవాలని మేం కోరుకుంటున్నాం. అప్పుడే వారంతా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడానికి వీలుంటుంది. దీనికి తోడు, పోర్టల్ లో రిజిస్టర్ చేయించుకువారికి రూ. 2లక్షల వరకూ బీమా సదుపాయానికి వారికి అర్హత ఉంటుంది.” అని మంత్రి అన్నారు.

  ఈ సందర్భంగా వివిధ ట్రేడ్ యూనియన్ల నాయకులు, అసంఘటిత రంగ కార్మికులు, యాజమాన్యాలతో కేంద్రమంత్రి యాదవ్ ముచ్చటించారు. చర్చలు జరిపారు. కేంద్ర కార్మిక వ్యవహారాల చీఫ్ కమిషనర్ (సెంట్రల్) డి.పి.ఎస్. నెగీ, డిప్యూటీ చీఫ్ కమిషనర్ (సెంట్రల్) తేజ్ బహదూర్ కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు.

  డి.పి.ఎస్. నెగీ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ-శ్రమ్ పోర్టల్.ను విజయవంతం చేయడంలో స్థానిక పరిపాలనా సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలకు కీలక పాత్ర ఉంటుందని, గిగ్ సిబ్బందిని నియమించుకునే యాప్ ఆధారిత సేవాసంస్థలు, అసంఘటిత రంగ కార్మికులు కూడా ఈ విషయంలో గణనీయమైన పాత్ర పోషించవలసి ఉంటుందని అన్నారు. ఈ-పోర్టల్ కృషిని ముందుకు తీసుకుపోవాలంటే, కార్మికుల విశ్వాసం, సంబంధిత భాగస్వామ్య వర్గాల కృషి ఎంతో అవసరమన్నారు. ప్రధానమంత్రి పిలుపునిచ్చిన సబ్ కా సాత్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ అన్న తత్వానికి అనుగుణంగా ఈ కృషి జరగాల్సి ఉందని ఆయన అన్నారు.

https://ci5.googleusercontent.com/proxy/OV-tGqL-2FGM2-AZ4apXaab73QAN70dEsAhx25QCvZKo_CC_ifZYiWi8rbe8iaKS2WMS3C4fPAKwA18Bs1X4jySehSYmtVndRrrpc2V_UdY_6EQfawTYJ3J7gA=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003UWK8.jpg https://ci5.googleusercontent.com/proxy/onUG9mey94vQsNuU-s4utfTLLMdVwS20eat9lr9OtwiPcM2vSbzbo1JMv5jLQn9m4mocmfgW8qu3COYYYz2L-BICf46aWHnDo_7ROYd22W0JsT3Jk4La4fcX4g=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00454P4.jpg

   ఈ-శ్రమ్ పోర్టల్ ద్వారా ఇప్పటిదాకా నమోదైన కార్మికుల్లో దాదాపు 50శాతం మంది మహిళలే ఉన్నారు. పైగా, ప్రతివారం నమోదయ్యే మహిళా కార్మికుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. వారంతట వారే స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకుంటున్నారు. మొదటి వారంలో 37శాతం ఉన్న మహిళా కార్మికుల నమోదు, చివర్లో, అంటే.. నాలుగో వారం ముగిసే నాటికి దాదాపు 50శాతానికి పెరిగింది.

  గత వారంలో నమోదు ప్రక్రియను పరిశీలించగా, ఇళ్లలో పని మనుషులుగా ఉపాధి పొందే మహిళా కార్మికులు గణనీయమైన సంఖ్యలో తమ వివరాలను పోర్టల్.లో రిజిస్టర్ చేయించుకున్నట్టు తెలిసింది. ఈ కేటగిరీలో పురుషుల సంఖ్య కంటే, మహిళా కార్మికుల సంఖ్యే ఎక్కువగా ఉంది. దీనికి తోడుగా, వ్యవసాయ రంగంలో కార్మికులుగా, ఆహార పరిశ్రమల్లో సహాయకులుగా, మెషిన్ ఆపరేటర్లుగా, దుస్తుల పరిశ్రమల్లో సహాయక సిబ్బందిగా, టైలర్లుగా, పొగాకు, బీడీ రోలింగ్ వంటి చిన్నతరహా పరిశ్రమల్లో సిబ్బందిగా, ఆరోగ్య రక్షణ రంగంలో ఆశా వర్కర్లు/ఎ.ఎన్.ఎం.లుగా మహిళల గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. అంటే, ఈ-శ్రమ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ద్వారా, ఎక్కువ శారీరక శ్రమకు గురయ్యేందుకు ఆస్కారం ఉన్న మహిళలు వివిధ రక్షణ పథకాల ద్వారా బీమా సదుపాయం పొందుతున్నట్టు భావించవచ్చు.

https://ci6.googleusercontent.com/proxy/FjTdQ4U4oLVjleNQToBDoZPpTbH6EobS9odwpryvjATTjoR93muZhjsPcuF8vBkbgW3ct3vxC04qPcov7qVvRkm0XtIrDP_GwN9tyceQS7g4M56G3C25gvuZAw=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0059I79.png

 

ఇ-శ్రమ్ పోర్టల్.లో అసంఘటితరంగ కార్మికుల రిజిస్ట్రేషన్ తీరు ఆధారంగా

ఆయా రాష్ట్రాలకు సంబంధించిన వారాలవారీ ర్యాంకింగ్ పట్టిక

 

రాష్ట్రాల ర్యాంకింగ్

ఒకటో వారం

రెండోవారం

3వ వారం

4వ వారం

1

ఒడిశా

ఒడిశా

బీహార్

ఒడిశా

2

బీహార్

బీహార్

ఒడిశా

పశ్చిమ బెంగాల్

3

ఉత్తర ప్రదేశ్

పంజాబ్

ఉత్తర ప్రదేశ్

బీహార్

4

మధ్యప్రదేశ్

పశ్చిమ బెంగాల్

పశ్చిమ బెంగాల్

ఉత్తర ప్రదేశ్

5

ఆంధ్రప్రదేశ్

మధ్యప్రదేశ్

మధ్యప్రదేశ్

మధ్యప్రదేశ్

 

 

 

 

 

లెజెండ్

 

గడచిన వారంతో పోల్చుకుంటే ర్యాంకులో మెరుగుదలను సూచిస్తుంది.

 

 

గడచిన వారంతో పోల్చినపుడు స్థానం/ర్యాంకింగ్ తగ్గుదలను ఇది సూచిస్తుంది.  

 

ఇ-శ్రమ్ పోర్టల్ లో నమోదు ప్రక్రియకు సంబంధించి తొలి వారంనుంచి ఒడిశా, బీహార్ రాష్ట్రాలు మొదటి ర్యాంక్.కోసం పోటీ పడుతూ వచ్చాయి. అయితే, 3వ, 4వ వారం మధ్య,  బీహార్ రాష్ట్రం ఒకటవ ర్యాంకునుంచి 3వ ర్యాంకుకు దిగజారింది. ఒడిశా మాత్రం మొత్తం 4 వారాలకుగాను, ఏకంగా మూడేసి వారాలు మొదటి ర్యాంకులోనే కొనసాగింది. ఈ-శ్రమ్ పోర్టల్.ను ప్రారంభించినప్పటినుంచి అసంఘటితరంగ కార్మికుల వివరాల రిజిస్ట్రేషన్ల  విషయంలో ఒడిశా తన మొదటి ర్యాంకును కొనసాగిస్తూనే వచ్చింది.

 

https://ci3.googleusercontent.com/proxy/6obFwkeQVt8mwawzypEbHieB81si_hW8zqW0LwgQa4ZmWNiNIxKswdq2CebgHlINOpHmT50gakf7d579tkfuJrx-TZUTyI075GyqV_4dl1PPWII2Q_mM5e34TA=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006MASR.png

   ఇ-శ్రమ్ పోర్టల్.లో అసంఘటిత రంగ కార్మికుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను విజయవంతం చేయడంలో ఉమ్మడి సేవా కేంద్రాల (సి.ఎస్.సి.ల) పాత్ర కీలకంగా ఉంటుంది. పై పట్టికలో సూచించిన అంకెలను పరిశీలించినపుడు, రిజిస్ట్రేషన్లకు అనువైన మార్గాలుగా సి.ఎస్.సి.ల పాత్ర, వాటి ప్రజాదరణ గణనీయంగా పెరిగింది. ఇ-శ్రమ్ పోర్టల్ ప్రారంభమైన తొలి వారంలో 56.36శాతం రిజిస్ట్రేషన్లు సి.ఎస్.సి.ల ద్వారానే జరిగాయి. నాలుగో వారంలో 78శాతంమేర కార్మికుల వివరాల రిజిస్టేషన్ సి.ఎస్.సి.ల ద్వారానే జరిగింది. ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని అసంఘటిత రంగ కార్మికుల వివరాలను సి.ఎస్.సి.ల ద్వారా ఈ-శ్రమ్ పోర్టల్.లో నమోదు చేయించడంలో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతపు పరిపాలనా యంత్రాగాలకు కీలకపాత్ర ఉంటుంది.

  ఈ-శ్రమ్ పోర్టల్.ను ఆధార్ వ్యవస్థతో అనుసంధానం చేస్తారు. రిజిస్టర్ చేయించుకున్న కార్మికుల పేర్లు, వృత్తులు, చిరునామాలు, విద్యార్హతలు, నైపుణ్యం రకాలు, కుటుంబ వివరాలు వంటివి ఇందులో నమోదై ఉంటాయి. ఈ వివరాలు అందుబాటులో ఉండటం వల్ల, వారికి ఉపాధి కల్పించే అవకాశం కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటుంది. తద్వారా, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అందుకోవడానికి కూడా వారికి వీలుంటుంది.

  అసంఘటిత రంగంలో పనిచేస్తూ, 16నుంచి 59ఏళ్ల వయస్సున్న  కార్మికులెవరికైనా ఈ-శ్రమ్ పోర్టల్.లో తమ వివరాలు నమోదు చేసుకునేందుకు అర్హత ఉంటుంది. అసంఘటిత రంగంలోని వలస కూలీలు, గిగ్ సిబ్బంది, ప్లాట్ ఫాం వర్కర్లు, వ్యవసాయ కార్మికులు, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్మికులు, మత్స్యకారులు, పాలుపోసేవారు, ఆశా వర్కర్లు, అంగన్ వాడీ కార్మికులు, వీధి వ్యాపారులు, ఇళ్లలో పనిచేసే పనిమనుషులు, రిక్షావాలాలు తదితర అసంఘటిత రంగ కార్మికులకు  తమ వివరాలను ఈ పోర్టల్.లో నమోదు చేసుకునే అర్హత ఉంటుంది.

 

***



(Release ID: 1758296) Visitor Counter : 210