ఆర్థిక మంత్రిత్వ శాఖ

తమిళనాడులో ఆదాయపు పన్ను శాఖ సోదాలు

Posted On: 25 SEP 2021 10:37AM by PIB Hyderabad

చెన్నైలో ఉన్న రెండు ప్రైవేట్ సిండికేట్ ఫైనాన్సింగ్ గ్రూపులపై ఆదాయపు పన్ను శాఖ 23.09.2021న సోదాలు మరియు జ‌ప్తు కార్యక్ర‌మాల‌ను నిర్వహించింది. చెన్నైలో ఈ రెండు గ్రూపులకు ఉన్న 35 ప్రాంగణాల్లో సెర్చ్ ఆపరేషన్ జరిగాయి. ఫైనాన్షియర్లు వారి సహచరుల ప్రాంగణంలో లభించిన ఆధారాల ప్ర‌కారం ఈ గ్రూపు సంస్థ‌లు తమిళనాడులోని వివిధ పెద్ద కార్పొరేట్ సంస్థల‌కు మరియు వ్యాపారాలకు రుణాలిచ్చిన‌ట్టుగా వెలుగులోకి వ‌చ్చింది, ఇందులో అత్య‌ధిక‌ భాగం నగదు రూపంలో ఉండ‌నుంది. ఈ సోదాల  సమయంలో, వారు అధిక వడ్డీ రేటును వసూలు చేస్తున్నట్లుగా కూడా కనుగొనబడింది, ఇందులో కొంత భాగం పన్ను ప‌రిధిలో చూప‌బ‌డ‌లేదని గుర్తించారు.  గ్రూపులచే స్వీకరించబడిన కార్యనిర్వహణ విధానం రుణగ్రహీతలు వడ్డీ చెల్లింపులలో ఎక్కువ భాగం డమ్మీ బ్యాంకు ఖాతాలలో స్వీకరించబడింది. పన్ను ప్రయోజనాల కోసం ఈ మొత్తాన్ని వారు వెల్లడించలేదని తేలింది.  ఇంకా లెక్కించబడని డబ్బులు ఇత‌ర రూపంలో ఉంటాయి. అసురక్షిత రుణాలు, ఇతర రుణదాతలు మొదలైన సమూహాల ఖాతా పుస్తకాలలోకి తీసుకురాబడతాయి. సోదాల‌ సమయంలో దొరికిన ఇతర ఆధారాలు  వ్యక్తుల ద్వారా అనేక అప్రకటిత ఆస్తి పెట్టుబడులు మరియు ఇతర ఆదాయాల‌ను వెలుగులోకి తేకుండా త‌క్కువ చేసి చూప‌డ‌మైంది. ఇప్పటివరకు జరిపిన సోదాల‌ ఫలితంగా సుమారు రూ.300 కోట్ల మేర‌ లెక్కకు చూప‌ని న‌గ‌దు క‌నుగోన‌డ‌మైంది. ఇందులో ఇప్పటివరకు 9 కోట్ల మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచార‌ణ కొన‌సాగుతోంది. 

***



(Release ID: 1758170) Visitor Counter : 140


Read this release in: English , Urdu , Hindi , Tamil