ఉక్కు మంత్రిత్వ శాఖ
ఈశాన్య ప్రాంతంలో ఉక్కు వినియోగాన్ని పెంచేందుకు త్రిపురలోని భాగస్వాములతో సమావేశం అయిన ఉక్కు శాఖ మంత్రి రామచంద్ర ప్రసాద్
Posted On:
24 SEP 2021 5:28PM by PIB Hyderabad
దేశంలో ఉక్కు వినియోగాన్ని పెంచేందుకు ఉక్కు మంత్రిత్వ శాఖ చేస్తున్ననిరంతర కృషికి అనుగుణంగా దేశంలోని ఈశాన్య ప్రాంతంలో, ముఖ్యంగా త్రిపురలో ఉక్కు వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ఉక్కు మంత్రి రామచంద్ర ప్రసాద్ సింగ్ ఎంఎస్ఎంఇలు సహా వివిధ ఉక్కువ వినియోగదారులతో సమావేశాన్ని నిర్వహించారు. నిర్మాణం, మౌలిక సదుపాయాలు, రక్షణ, ఆటోమొబైల్, ఇంజినీరింగ్, ప్యాకేజింగ్ సహా వివిధ పరిశ్రమలు, రంగాలలో ఉక్కు అనేది ప్రాథమిక ఉత్సాదకమని, సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన సింగ్ నొక్కి చెప్పారు. మన రోజువారీ జీవితంలోని వివిధ అంశాలలో విస్త్రతమైన దీని అనువర్తన కారణంగా, ఉక్కును ప్రజా సామాగ్రిగా పరిగణిస్తారు. ఇతర ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ, పరిశ్రమలకు, సామాన్య మానవులూ ఎంచుకునే పదార్ధంగా ఉక్కు కొనసాగుతోంది.
ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని, అందులో ఉక్కు ముఖ్య పాత్ర పోషిస్తుందని సింగ్ పేర్కొన్నారు. చిట్టగాంగ్ పోర్ట్‌తో అనుసంధానం చేస్తున్న సందర్భంలో త్రిపురలో అత్యంత సంభావ్యత ఉందని, రాష్ట్రంలో ఉక్కు వినియోగాన్ని పెంచేందుకు భారీ అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని మంత్రి పట్టి చూపారు.
అంతకు ముందు, మంత్రి త్రిపురలో పర్యటించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖలకు చెందిన పలువురు సీనియర్ అధికారులతో సంభాషించారు. ఆయనతో సెయిల్ (ఎస్ఎఐఎల్) చైర్మన్ శ్రీమతి సోమా మండల్, ఎంఎస్‌టిసి చైర్మన్ ఎస్ కె గుప్తా, ఉక్కు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శ పునీత్ కన్సల్ ఉన్నారు. ప్రభుత్వానికి ఈశాన్య ప్రాంత ప్రాముఖ్యతను కన్సల్ నొక్కి చెప్తూ, వారికి పూర్తి సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఆ ప్రాంతంలో జాతీయ ప్రాముఖ్యత కలిగిన, పూర్తి అయిన వివిధ వ్యూహాత్మక ప్రాజెక్టుల జాబితాలను సెయిల్ చైర్మన్ వెల్లడించారు. ఇందులో, అస్సాంను అరుణాచల్ ప్రదేశ్‌ను అనుసంధానం చేసే దేశంలోనే అతి పొడవైన బ్రిడ్జి ధోలా సాదియా గురించి చెప్పారు. అస్సాంలోని లోహిత్ నదిపై నిర్మించారు. అలాగే బ్రహ్మపుత్ర నదిపై రైల్ కమ్ రోడ్ బొగిబీల్ బ్రిడ్జి, అరుణాచల్ ప్రదేశ్‌లోని కమెంగ్ హైడల్ ప్రాజెక్టు, అగర్తాలలోని బత్తాల ఫ్లైఓవర్ కొన్ని మాత్రమే.
సమావేశం సందర్భంగా, వివిధ ఇ-సేకరణ, ఇ- ఆక్షన్ అవసరాలకు, ఇతర ప్రత్యేక ఇ- సొల్యూషన్‌లకు ఏకీకృత పరిష్కారాన్ని త్రిపుర ప్రభుత్వానికి అందించేందుకు వివిధ కార్యకలాపాలలో పాలుపంచుకునేందుకు ఎదురు చూస్తున్నామని ఎంఎస్‌టిసి తెలిపింది.
***
(Release ID: 1757855)
Visitor Counter : 241