బొగ్గు మంత్రిత్వ శాఖ

"బొగ్గు మరియు గనుల" పై జరిగిన మొదటి ఇండియా-ఆస్ట్రేలియా జాయింట్ వర్కింగ్ గ్రూప్ (జేబ్ల్యూజి) వర్చ్యువల్ సమావేశం

Posted On: 23 SEP 2021 7:42PM by PIB Hyderabad

2021 అక్టోబర్ 13 న జరగబోతున్న ఇండియా-ఆస్ట్రేలియా ఎనర్జీ డైలాగ్‌కు ముందస్తుగా, భారత్ - ఆస్ట్రేలియా మధ్య "బొగ్గు మరియు గనుల" పై మొదటి జాయింట్ వర్కింగ్ గ్రూప్ (జేబ్ల్యూజి) సమావేశం ఈరోజు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఇక్కడ జరిగింది. భారతదేశం నుండి బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ వినోద్ కుమార్ తివారీ మరియు ఆస్ట్రేలియా వైపు నుండి వనరుల విభాగం అధిపతి శ్రీ పాల్ ట్రాట్మన్ సహ అధ్యక్షత వహించారు. తన ప్రారంభ ప్రసంగాలలో శ్రీ తివారీ భారతదేశంలో బొగ్గు రంగం గురుంచి అవలోకనాన్ని అందించారు.  భవిష్యత్తు కోసం అభివృద్ధి చెందుతున్న దృష్టాంతాన్ని అందించారు. రెండు దేశాలలో బొగ్గు మరియు మైనింగ్ రంగాలలో సాధ్యమయ్యే సహకారం కోసం చేర్చాల్సిన ప్రాధాన్యత ప్రాంతాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. 

 

 

ప్రస్తుత మరియు భవిష్యత్తు పరిస్థితులు, భారతీయ బొగ్గు వనరులు, క్లిష్టమైన మరియు వ్యూహాత్మక ఖనిజాలు-డిమాండ్ మరియు సరఫరా స్థితిగతులు ఈ సమావేశంలో చర్చించారు. క్లీన్ కోల్ టెక్నాలజీపై ఇండియా ఆస్ట్రేలియా సహకారం, ఉపరితల బొగ్గు గ్యాసిఫికేషన్, కోల్ బెడ్ మీథేన్, సాంకేతికత భాగస్వామ్యం కోసం చర్చలలో ప్రధానంగా అంశాలు చోటుచేసుకున్నాయి. ఫైర్ క్వెన్చింగ్, బొగ్గు ఆధారిత హైడ్రోజన్, కార్బన్ క్యాప్చర్ యుటిలైజేషన్ & స్టోరేజ్ (సిసియుఎస్) పై సమాలోచనలు జరిగాయి. బొగ్గు టెక్నాలజీపై వ్యాపారం నుండి వ్యాపార సహకారం, సాంకేతిక పరిజ్ఞానం బదిలీ, నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణపై సహకారం, ఆస్ట్రేలియా నుండి కోకింగ్ బొగ్గు దిగుమతికి సంబంధించిన అంశాలపై వీరి మధ్య చర్చ జరిగింది. 

 

 

 

భవిష్యత్తులో ఏదైనా సహకారం కోసం ఈ అంశాలపై తమ నైపుణ్యాన్ని పంచుకోవడం గురించి ఇరుపక్షాలు చర్చించాయి మరియు వనరులు, సాంకేతికత, సుస్థిరత మరియు వ్యాపార అవకాశాలపై భారత్ ప్రెజెంటేషన్ ఇచ్చింది. జాయింట్ సెక్రటరీ శ్రీమతి విస్మితాతేజ్, బొగ్గు మంత్రిత్వ శాఖ సలహాదారు శ్రీ ఆనంది ప్రసాద్, కబిల్ సిఎండి శ్రీ రంజిత్‌రాథ్, సిఐఎల్ చీఫ్ మేనేజర్ శ్రీ పీయూష్ కుమార్ మరియు సిఎమ్‌పిడిఐఎల్ డైరెక్టర్ శ్రీ ఎకె రాణా ఈ ప్రెజెంటేషన్లు ఇచ్చారు. గ్లోబల్ రిసోర్సెస్ స్ట్రాటజీ, ఎనర్జీ & ఇండస్ట్రీ, కార్బన్ క్యాప్చర్ యుటిలైజేషన్ అండ్ స్టోరేజ్ (సిసియుఎస్) మరియు ట్రేడ్ అండ్ కమోడిటీ రిలేషన్‌ని డీకార్బోనైజ్ చేయడానికి గ్లోబల్ రిసోర్సెస్ స్ట్రాటజీ, లెవరేజింగ్ టెక్నాలజీస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై ఆస్ట్రేలియన్ వైపు నుండి ప్రెజెంటేషన్‌లు ఇచ్చారు. ఈ సందర్బంగా ఓపెన్ హౌస్ చర్చ కూడా జరిగింది. 

.

 

***



(Release ID: 1757481) Visitor Counter : 181


Read this release in: English , Hindi , Urdu