విద్యుత్తు మంత్రిత్వ శాఖ

ఒక ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించిన - కేంద్ర విద్యుత్తు, నూతన మరియు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి


ఫ్లై యాష్ వినియోగాన్ని పెంచడానికి పవర్ ప్లాంట్ల ద్వారా చివరి వినియోగదారులకు ఫ్లై యాష్ సరఫరాను సమీక్షించిన - కేంద్ర మంత్రి.

తగిన సూచనలు, సలహాలను జారీ చేసిన - విద్యుత్ మంత్రిత్వ శాఖ

విద్యుత్ ఛార్జీలను తగ్గించడం ద్వారా వినియోగదారులపై భారం తగ్గించాలని - యోచన

Posted On: 22 SEP 2021 5:51PM by PIB Hyderabad

కేంద్ర విద్యుత్తు, నూతన మరియు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ ఆర్. కె. సింగ్ 22.09.2021 తేదీన ఒక సమావేశం నిర్వహించి, తుది వినియోగదారులకు ఫ్లై యాష్ రవాణా మరియు ఫ్లై యాష్ వినియోగాన్ని సమీక్షించారు.

సమావేశంలో సి.ఈ.ఎ, చైర్‌పర్సన్; ఎన్‌.టి.పి.సి., చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్;  డి.వి.సి., ఛైర్మన్ తో పాటు, విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు పారదర్శక బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా మాత్రమే ఫ్లై-యాష్‌ ను వేలం వేయాలని, ఈ సందర్భంగా  ఆదేశించడం జరిగింది.   ఇందు కోసం 22.09.2021 తేదీన మంత్రిత్వ శాఖ సూచనలు, సలహాలతో ఒక ఆదేశాన్ని జారీ చేసింది.  ఇది విద్యుత్ ఛార్జీలను తగ్గించడంతో పాటు, వినియోగదారులపై భారాన్ని కూడా తగ్గిస్తుంది.

విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు అనుసరించడం కోసం జారీ చేసిన ఈ అడ్వైజరీ లో దిగువ పేర్కొన్న ముఖ్యమైన అంశాలు ఉన్నాయి: 

*          పవర్ ప్లాంట్లు తుది వినియోగదారులకు పారదర్శక బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా మాత్రమే ఫ్లై-యాష్‌ ను అందజేయాలి. 

*          బిడ్డింగ్ / వేలం తర్వాత కూడా కొంత పరిమాణంలో ఫ్లై-యాష్ నిరుపయోగంగా ఉన్నట్లయితే, అప్పుడు మాత్రమే, ఎంపికలలో ఒకటిగా, రవాణా ఖర్చులు భరించడానికి సిద్ధంగా ఉన్న సంస్థ కు ముందుగా వచ్చిన వారికి ముందు అవకాశం ప్రాతిపదికన ఉచితంగా అందించబడుతుంది.

*          పైన పేర్కొన్న చర్యల తర్వాత కూడా ఫ్లై-యాష్ నిరుపయోగంగా మిగిలి ఉంటే, అప్పుడు, థర్మల్ పవర్ ప్లాంట్ ద్వారా (టి.పి.పి) రవాణా ఖర్చును భరించి, అర్హులైన ప్రాజెక్టులకు, ఫ్లై-యాష్ ను ఉచితంగా అందించబడుతుంది.

*        తుది వినియోగదారులు ఫ్లై-యాష్ రవాణా వ్యయాన్ని తగ్గించుకోడానికి సమీప టి.పి.పి. ల నుండి ఫ్లై-యాష్‌ ను తీసుకోవాలి.  సమీపంలోని టి.పి.పి. అలా చేయడానికి నిరాకరిస్తే, తుది వినియోగదారు గా ఉన్న ప్రాజెక్టు తగిన ఆదేశాల కోసం విద్యుత్ మంత్రిత్వ శాఖను సంప్రదించాలి.

*          విద్యుత్ ప్లాంట్ల ద్వారా ఎం.ఓ.ఈ.ఎఫ్. & సి.సి. నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం రవాణా ఖర్చు భరించాల్సిన అవసరం ఉన్న చోట, పోటీ బిడ్డింగ్ ప్రాతిపదికన మాత్రమే తుది వినియోగదారులను ఎంపిక చేయవలసి ఉంటుంది.  థర్మల్ పవర్ ప్లాంట్‌లు ప్రతి సంవత్సరం 50 కి.మీ స్లాబ్‌ లలో రవాణా కోసం పోటీ బిడ్డింగ్ ఆధారంగా రవాణా ఏజెన్సీల ప్యానెల్‌ ను సిద్ధం చేయాలి.  ఇంతకూ ముందు ఉన్న ప్యానెల్ గడువు ముగిసిన వెంటనే రవాణా ప్యానెల్ అమలయ్యే విధంగా టి.పి.పి. తగినంత ముందుగానే బిడ్‌లను పిలవాలి. ఒక ప్యానెల్ గడువు ముగిసే తేదీ కి, తాజా ప్యానెల్ ఖరారు కు మధ్య అంతరం ఉండకూడదు.

*          పోటీదారుల డిమాండ్ ప్రాతిపదికన తుది వినియోగదారులకు ఫ్లై-యాష్ అందించబడుతుంది,  అనగా,  ఫ్లై-యాష్ కోసం అత్యధిక ధర చెల్లించడంతో పాటు, రవాణా వ్యయానికి కనీస మద్దతు కోరే, తుది వినియోగదారులకు ప్రాధాన్యత ఇచ్చి, ఫ్లై-యాష్ అందించబడుతుంది.

*          కందకం స్థిరత్వం మరియు భద్రతకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవడం వంటి సాంకేతిక పరిమితులకు లోబడి, విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ఫ్లై-యాష్ అందించవచ్చు.  ఫ్లై-యాష్ వినియోగం తక్కువగా ఉన్న విద్యుత్ ప్లాంట్లు ఫ్లై-యాష్ వినియోగాన్ని పెంచడానికి అన్ని ప్రయత్నాలు చేయాలి.

విద్యుత్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన సూచనలు, సలహాలను ఖచ్చితంగా పాటించే విధంగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు తగిన చర్యలు తీసుకోవాలి.

 

*****



(Release ID: 1757213) Visitor Counter : 116


Read this release in: English , Urdu , Hindi , Punjabi