గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఈ ఏడాది జూన్ నెల‌లో 23.1% పెరుగుద‌ల‌ను చూపిన ఖ‌నిజ ఉత్ప‌త్తి సూచీ (తాత్కాలిక‌)

Posted On: 22 SEP 2021 6:58PM by PIB Hyderabad

క్వారీ, మైనింగ్ రంగంలో జూన్‌, 2021 (బేస్ - 2011-12 =100) 105.5 అయిన  ఖ‌నిజ‌ ఉత్ప‌త్తి  2020 జూన్ నెల‌తో పోలిస్తే 23.1 శాతం ఎక్కువ‌గా ఉంది.  ఏప్రిల్‌- జూన్ 2020- 2021 కాలానికి సంచిత వృత్తి, గ‌త ఏడాది అదే కాలంతో పోలిస్తే 27.4 శాతం పెరిగింది. 
ముఖ్య‌మైన ఖ‌నిజాల ఉత్ప‌త్తి స్థాయి జూన్‌, 2021లో ఈ విధంగా ఉన్నాయి - బొగ్గు 510 ల‌క్ష‌ల ట‌న్నులు, లిగ్నైట్ 34 ల‌క్ష‌ల ట‌న్నులు, స‌హ‌జ వాయువు (వినియోగించిన‌) 2174 మిలియ‌న్ క్యూబిక్ మీట‌ర్లు, పెట్రోలియం (ముడి) 25 ల‌క్ష‌ల ట‌న్నులు, బాక్సైట్ 1739 వేల ట‌న్నులు, క్రోమైట్ 322 వేల ట‌న్నులు, మాంగ‌నీసు ధాతువు 208 వేల ట‌న్నులు, జింక్ 118 వేల ట‌న్నులు, ఫాస్ఫొరైట్ 110 వేల ట‌న్నులు, సున్నం 330 ల‌క్ష‌ల ట‌న్నులు, ఇనుప ధాతువు 224 ల‌క్ష‌ల ట‌న్నులు,  లెడ్ కాన్స‌న్ట్రేట్ 29వేల ట‌న్నులు, సాంద్ర రాగి 10 వేల ట‌న్నులు, బంగారం 41 కిలోలు, వ‌జ్రం 10 కేరెట్లు. 
గ‌త ఏడాది జూన్ నెల‌తో పోలిస్తే, 2021 జూన్ నెల‌లో సానుకూల వృద్ధిని చూపిన ముఖ్య ఖ‌నిజాల ఉత్ప‌త్తి ఈ విధంగా ఉందిః క్రోమైట్ (130.3%), మెగ్నీసియం (121.4%), ఇనుప ధాతువు (82.8%), సాంద్ర రాగి (27.8%),స‌హ‌జ‌వాయువు (యు) (20.6%), లిగ్నైట్ (13.2%), ప్ర‌తికూల వృద్ధిని చూపిన ఇత‌ర ముఖ్య ఖ‌నిజాలు - పెట్రోలియం (ముడి) (-1.8%), జింక్ కాన్స‌న్ట్రేట్ (-3.4%), లెడ్ కాన్స‌న్ట్రేట్ (-9.6%), ఫాస్ఫొరైట్ (-32.6%), బంగారం(-70.7%), వ‌జ్రం (-99.4%) గా ఉన్నాయి.

 

***
.


(Release ID: 1757103) Visitor Counter : 167


Read this release in: English , Urdu , Hindi