వ్యవసాయ మంత్రిత్వ శాఖ

రైతుల ఆదాయాన్ని పెంచడానికి వ్యవసాయ ఎగుమతులకు ప్రాధాన్యత ఇవ్వాలి: శ్రీమతి శోభా కరంద్లాజే

Posted On: 22 SEP 2021 3:47PM by PIB Hyderabad

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి  రసాయన రహిత వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడిని, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించాల్సిన ఉంటుందని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీమతి శోభా కరంద్లాజే అన్నారు.

బెంగళూరులో ఈ రోజు ఏపీఈడిఎ నిర్వహించిన వాణిజ్య ఉత్సవ్ లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి వంట నూనెల రంగంలో మినహా మిగిలిన అన్ని రంగాల్లో దేశం స్వయం సమృద్ధి సాధించిందని అన్నారు. ఆయిల్ పామ్ రంగంలో ఆత్మ నిర్భరత సాధించడానికి కృషి జరగాలని ఆమె పేర్కొన్నారు. దీనికోసం ఆయిల్ పామ్ ను ఎక్కువగా సాగు చేసి నూనె శుద్ధి యూనిట్లను నెలకొల్పవలసి ఉంటుందని అన్నారు.

గత ఏడాది దేశంలో 305 మిలియన్ మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు, 326 మిలియన్ మెట్రిక్ టన్నుల పళ్ళుకూరగాయలు ఉత్పత్తి అయ్యాయని శ్రీమతి శోభా వెల్లడించారు. కోవిడ్ వల్ల సమస్యలు ఎదురైనప్పటికీ దేశంలో రికార్డు స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తులు దిగుబడి అయ్యాయని అన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో కర్ణాటక వెనుకబడి ఉందని మంత్రి అన్నారు. ఇతర దేశాల్లో డిమాండ్ ఎక్కువగా ఉన్న ఆహార ధాన్యాలుపళ్ళుకూరగాయలు కర్ణాటకలో ఉత్పత్తి అవుతున్నాయని ఆమె అన్నారు. నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ వీటిని ఎగుమతి చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. రసాయనాలను ఎక్కువగా ఉపయోగించకుండా వ్యవసాయం సాగేలా చూడాలని అన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యతను ఎక్కువ చేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని మంత్రి పేర్కొన్నారు. వ్యవసాయానికి అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి కేంద్రం విడుదల చేస్తున్న నిధులను రాష్ట్రాలు సక్రమంగా వినియోగించి రైతులకు ప్రయోజనం కలిగించాలని మంత్రి సూచించారు. వ్యవసాయానికి అనువైన వాతావరణం కర్ణాటకలో ఉందని పేర్కొన్న మంత్రి భిన్న వాతావరణ పరిస్థితుల్లో పెరిగే పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఎగుమతి చేయడానికి అనువైన వ్యవసాయ ఉత్పత్తులను ఉత్పత్తి చేయడానికి పరిశోధన అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయాలని శ్రీమతి శోభా అన్నారు. 

ముఖ్య ఉపన్యాసం ఇచ్చిన వ్యవసాయ శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి డాక్టర్ రాజ్‌కుమార్ ఖత్రి దేశంలో వ్యవసాయ రంగం అన్ని విధాలుగా అభివృద్ధి సాధించిందని అన్నారు. కర్ణాటక నుంచి వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి అనువైన పరిస్థితులు ఉన్నాయని అన్నారు. 

ఫుడ్ ప్రాసెసింగ్ రంగ అభివృద్ధికి  కర్ణాటకలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని   హార్టికల్చర్, సెరికల్చర్ శాఖ   ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజేందర్ కుమార్ కటారియా తెలిపారు. 

ఆజాది కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా  ఏపీఈడిఎ  దేశవ్యాప్తంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని సంస్థ చైర్మన్ ఎం.  అంగముత్తు అన్నారు. దీనిలో భాగంగా  బెంగళూరులో వాణిజ్య ఉత్సవ్ ను ఏర్పాటు చేశామని అన్నారు. వ్యవసాయం,ఉద్యానవన రంగాలకు చెందిన అనేక మంది   కర్ణాటక మరియు బెంగళూరులలో స్థిరపడ్డారని ఆయన అన్నారు. 

నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్బెంగళూరుశ్రీ నీరజ్ కుమార్ వర్మ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ (తంజావూరు)డైరెక్టర్  డాక్టర్ ఆనందరామకృష్ణన్జాయింట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, (బెంగళూరుహెచ్‌డి.  లోకేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వాణిజ్య ఉత్సవ్ లో వివిధ సంస్థలు 25 స్టాళ్లను  ఏర్పాటు చేశాయి.   స్టాళ్లను దర్శించిన మంత్రి నిర్వాహకుల కృషిని ప్రశంసించారు.

***



(Release ID: 1757091) Visitor Counter : 171