ఆర్థిక మంత్రిత్వ శాఖ
పశ్చిమ బెంగాల్‌లలో సోదాలు నిర్వహించిన ఆదాయపన్ను శాఖ
Posted On:
21 SEP 2021 1:21PM by PIB Hyderabad
భారతదేశంలో స్టీలు ఉత్పత్తుల ఉత్పత్తిలో నిమగ్నమై ఉన్న ప్రముఖ వ్యాపార సంస్థపై 17.09.2021న ఆదాయపు పన్ను శాఖ సెర్చ్ అండ్ సీజర్ (సోదాలు, స్వాధీనం) ఆపరేషన్‌ను నిర్వహించింది. ఈ దాడులలో పశ్చిమ బెంగాల్‌లో కొలకతా, దుర్గాపూర్, అసన్‌సోల్, పురూలియా, ఇతర ప్రాంతాలలోని 8 నివాసాలు, 9 కార్యాలయాలు, 8 ఫ్యాక్టరీలు సహా 25 ఆవరణలలో ఈ దాడులు జరిగాయి.
వివిధ ఆవరణల నుంచి భారీ ఎత్తున నేరారోపణను రుజువు చేసే పత్రాలు, డిజిటల్ ఆధారాలు ఈ సోదాల క్రమంలో కనుగొన్నారు. లెక్కల్లోకి రాని నగదు అమ్మకాలు, లెక్కల్లోకి రాని నగదు వ్యయం, బోగస్ పార్టీల కొనుగోలు, వాస్తవ ఉత్పాదనను తగ్గించి నమోదు చేయడం, తుక్కును నగదు రూపంలో కొనుగోలు చేయడం, భూమి కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన పలు పత్రాలు, తదితరాలకు సంబంధించిన సాక్ష్యాలను కనుగొన్నారు. అలాగే, లెక్కల్లోకి రాని ఆదాయాన్ని హామీలేని రుణాల ద్వారా వినియోగం,లెక్కల్లోకి రాని ఆదాయాన్ని స్తరరూపంలో షెల్ కంపెనీల వాటాల అమ్మకాలకు సంబంధించి కూడా ఆధారాలు లభ్యమయ్యాయి. గ్రూపులోని సభ్యులలో ఒకరికి సంబంధించిభూమి, వివిధ పేర్లతో ఆస్తులు సహా పెద్ద సంఖ్యలో ఆస్తులకు సంబంధించిన పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. దీనితోపాటుగా ఉత్పత్తి గ్రూపు మొత్తం రూ. 700 కోట్ల విలువకు పైగా మతలబు చేస్తోందని రుజువు చేసే ఆధారాలు కనుగొన్నారు. ఈ సోదాలలో లెక్కల్లోకి రాని రూ.20 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకోగా, ఇంకా రెండు లాకర్లను తెరవవలసి ఉంది.
సోదాల సందర్భంగా ఎంట్రీలను అందించే అకామడేషన్ ఎంట్రీ ప్రొవైడర్‌ను కనుగొన్నారు. అతడి తన రహస్య బ్యాక్ ఆఫీస్ నుంచి షెల్ కంపెనీల ద్వారా వాటాల అమ్మకం వంటి అనేక పద్ధతుల్లో అకామడేషన్ ఎంట్రీలు అందించిన పత్రాలు, బోగస్ సంస్థల నుంచి హామీ లేని రుణాలు, బోగస్ బిల్లింగ్, ఇతరత్రాలను కనుగొన్నారు. వీటన్నింటి విలువ అనేక వందల కోట్లుగా ఉంది. ఎంట్రీ ఆపరేటర్ ఆవరణ నుంచి దాదాపు 200 బ్యాంక్ అకౌంట్లు కలిగిన 200 కంపెనీలు/ సంస్థలను నిర్వహిస్తున్నట్టు కనుగొన్నారు. ఈ పత్రాల ప్రాథమిక పరిశీలన అనంతరం, అనేకమంది లబ్దిదారుల లెక్కల్లోకి రాని ఆదాయాన్ని తిరిగి మళ్ళించేందుకు ఈ బ్యాంకు అకౌంట్లను, సంస్థలను ఉపయోగించినట్టు తేలింది.
తదుపరి దర్యాప్తులు కొనసాగుతున్నాయి.
***
(Release ID: 1756707)
Visitor Counter : 208