ఆర్థిక మంత్రిత్వ శాఖ

నాగ‌పూర్‌లో ఆదాయ‌పు ప‌న్ను శాఖ సోదాలు

Posted On: 20 SEP 2021 8:12PM by PIB Hyderabad

నాగ్‌పూర్‌లోని ప్రముఖ  వ్య‌క్తికి  సంబంధించిన కేసులో స‌ద‌రు వ్య‌క్తి మరియు అతని కుటుంబ సభ్యుల ప్రాంగ‌ణాల‌లో ఆదాయ‌పు పన్ను శాఖ 17.09.2021న సోదాలు, జ‌ప్తు కార్య‌క్ర‌మాల‌ను నిర్వహించింది. ఈ వ్య‌క్త‌కి సంబంధించి గ్రూపు నాగపూర్ న‌గ‌రంతో స‌హా మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలలో విద్య, గిడ్డంగులు మరియు వ్య‌వ‌సాయ‌- వ్యాపార‌ రంగాలలో విస్తృతంగా వ్యాపారాల‌ను కలిగి ఉంది. ఏక‌కాలంలో నాగ్‌పూర్, ముంబ‌యి, న్యూఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాల‌తో స‌హా  30కి పైగా ప్రాంగ‌ణాల‌లో ఆదాయ‌ప‌న్ను శాఖ సోదాలు మరియు సర్వే కార్యకలాపాలను నిర్వ‌హించింది. ఈ సోదాల‌లో ఖర్చుల్ని పెంచి చూప‌డం,  మనీ లాండరింగ్, బోగస్ విరాళాల‌ రశీదులు, లెక్కించబడని నగదు ఖర్చులు మొదలైన ఖాతాల యొక్క సాధారణ పుస్తకాల వెలుపల చేసిన లెక్క‌కు చూప‌ని ఆర్థిక లావాదేవీలకు సంబంధించి స్ప‌ష్ట‌మైన సాక్ష్యాలు ల‌భించాయి.  ఢిల్లీ కేంద్రంగా ప‌ని చేస్తున్న  కంపెనీలను ఉపయోగించి రూ .4.00 కోట్ల మేరకు మనీలాండరింగ్ ద్వారా అసెస్సి  గ్రూప్ నిర్వహిస్తున్న ట్రస్ట్ చేతిలో బోగస్ విరాళం అందుకున్న ఆధారాలు కనుగొనబడ్డాయి. అసెస్సీ యొక్క లెక్క‌కు చూప‌ని  ఆదాయాన్ని లాండరింగ్ చేయడం ఇది స్పష్టంగా ఈ ఆధానాలే రుజువు చేస్తున్నాయి.  ట్రస్ట్ యొక్క మూడు విద్యాసంస్థలు ఖర్చులను అధికం చేసి చూపించ‌డానికి పాల్పడ్డ‌ట్టుగా వెల్లడించిన నిర్దిష్ట ఆధారాల‌లో బ‌య‌ట‌కు తీయబడ్డాయి, ఇందులో ఉద్యోగులకు చెల్లించిన జీతాలు పాక్షికంగా తిరిగి నగదు రూపంలో సేకరించబడ్డాయి. గ‌డచిన ప‌లు  ఆర్ధిక సంవ‌త్స‌రాల‌లో సుమారు రూ.12 కోట్ల‌కు పైగా లావాదేవీల‌కు సంబంధించిన ఇటువంటి ఆధారాలు కనుగొనబడ్డాయి. ఈ సోదాల నిర్వ‌హ‌ణ  సమయంలో అడ్మిషన్లను ఏర్పాటు చేయడానికి ట్రస్ట్, రసీదులను త‌క్కువ చేసి చూప‌డమే కాకుండా, కాకుండా, బ్రోకర్లకు గణనీయమైన మొత్తాలను చెల్లించినట్లు కూడా కనుగొనబడింది. అలాంటి చెల్లింపులు దాదాపు రూ .87 లక్షల వరకు ఉన్నాయి.  ఇవి నగదు రూపంలో చెల్లించబడ్డాయి, కానీ పూర్తిగా లెక్కించబడలేదు.
శోధన సమయంలో లభించిన ఆధారాలు దాదాపు రూ .17 కోట్ల మేరకు అసెస్సీ గ్రూపు ఆదాయాన్ని దాచి ఉంచడాన్ని స్పష్టంగా సూచిస్తున్నాయి. సెర్చ్ ఆపరేషన్ సమయంలో దొరికిన అనేక బ్యాంక్ లాకర్లు నిషేధిత ఆదేశాల కింద ఉంచబడ్డాయి. శోధన సమయంలో సేకరించిన ఆధారాలు పరిశీలించబడుతున్నాయి మరియు తదుపరి శోధనలు జరుగుతున్నాయి.
                                                                                   

****



(Release ID: 1756670) Visitor Counter : 127


Read this release in: English , Urdu , Hindi , Marathi