ఆర్థిక మంత్రిత్వ శాఖ

రాష్ట్రాల పట్టణ స్థానిక సంస్థలకు రూ.2,427 కోట్ల గ్రాంటు విడుదల


2021-22లో ఇప్పటి వరకు పట్టణ స్థానిక సంస్థలకు మొత్తం రూ.4943.73 కోట్ల రూపాయలు విడుదల

Posted On: 17 SEP 2021 5:42PM by PIB Hyderabad

ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యయ శాఖ ఈరోజు అర్బన్ స్థానిక సంస్థల కోసం 11 రాష్ట్రాలకు రూ.2,427 కోట్లు విడుదల చేసింది. విడుదలైన మొత్తం 2021-22 సంవత్సరానికి టైడ్ గ్రాంట్‌ల మొదటి విడత నిధులు. కంటోన్మెంట్ బోర్డులతో సహా నాన్ మిలియన్ ప్లస్ సిటీస్ (ఎన్ఎంపిసిలు) కోసం ఈ గ్రాంట్‌లు అందించారు. 

15 వ ఆర్థిక సంఘం తన నివేదికలో 2021-22 నుండి 2025-26 వరకు పట్టణ స్థానిక సంస్థలను రెండు వర్గాలుగా విభజించింది: (ఏ) మిలియన్ ప్లస్ పట్టణ సముదాయాలు/నగరాలు (ఢిల్లీ మరియు శ్రీనగర్ మినహా) (బి) ఒక మిలియన్ కంటే తక్కువ జనాభా కలిగిన అన్ని ఇతర నగరాలు, పట్టణాలు (నాన్ మిలియన్ ప్లస్ సిటీలు), వాటి కోసం ప్రత్యేక గ్రాంట్‌లను సిఫార్సు చేసింది. నాన్ మిలియన్ ప్లస్ సిటీల కోసం కమిషన్ సిఫారసు చేసిన మొత్తం గ్రాంట్లలో, 40% బేసిక్ (అన్ టైడ్) గ్రాంట్, మిగిలిన 60% టైడ్ గ్రాంట్. జీతం చెల్లింపు మరియు ఇతర స్థాపన వ్యయం మినహా ప్రాథమిక అవసరాల కోసం ప్రాథమిక గ్రాంట్లు ( అన్ టైడ్) ఉపయోగిస్తారు.

మరోవైపు, నాన్ మిలియన్ ప్లస్ సిటీల కోసం టైడ్ గ్రాంట్లు ప్రాథమిక సేవలను బలోపేతం చేయడం కోసం విడుదల చేశారు. వీటిలో 50 శాతం 'సానిటేషన్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాలు (ఎంఓహెచ్,యుఏ) మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన స్టార్ రేటింగ్‌ల సాధన కోసం కేటాయింపు జరిగింది. మిగిలిన 50% 'తాగునీరు, వర్షపు నీటి సేకరణ, నీటి రీసైక్లింగ్'తో అనుసంధానం చేశారు.

కేంద్ర ప్రభుత్వం నుండి అందిన 10 పనిదినాల్లోపు రాష్ట్రాలు గ్రాంట్లను యుఎల్బి లకు బదిలీ చేయాల్సి ఉంటుంది. 10 పని దినాలకు మించి ఆలస్యం అయితే రాష్ట్ర ప్రభుత్వాలు గ్రాంట్లను వడ్డీతో విడుదల చేయాలి.  

16-09-2021 న విడుదల చేసిన మిలియన్ ప్లస్ కాని నగరాల కోసం టైడ్ గ్రాంట్  ఒకటవ విడత రాష్ట్రాల వారీగా ఇలా ఉన్నాయి:

 

వరుస
సంఖ్య 

రాష్ట్రం 

ఎన్ఎంపిసిలకు 16-09-2021 తేదీన 

విడుదల చేసిన టైడ్ గ్రాంట్ 

(రూ.కోట్లలో)

1

హర్యానా 

116.10

2

ఝార్ఖండ్ 

112.20

3

కర్ణాటక 

225.00

4

మధ్యప్రదేశ్ 

299.40

5

మహారాష్ట్ర 

276.60

6

మిజోరాం 

10.20

7

ఒడిశా 

246.60

8

పంజాబ్ 

111.00

9

తమిళనాడు 

267.90

10

త్రిపుర 

21.00

11

ఉత్తరప్రదేశ్ 

741.00

 

మొత్తం  2,467.00


(Release ID: 1756062) Visitor Counter : 164