జల శక్తి మంత్రిత్వ శాఖ
ఆజాదీ కా అమృత మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛతా హై సేవా (ఎస్ హెచ్ ఎస్) 2021 ప్రారంభం.
దేశవ్యాప్తంగా సెప్టంబర్ 15నుంచి అక్టోబర్ 2వరకూ స్వచ్ఛతా హాయ్ సేవా కార్యక్రమం
ఎస్ హెచ్ ఎస్ కింద సత్యాగ్రహ్ సే స్వచ్ఛాగ్రహ్ రథ్ యాత్ర, శ్రమదాన్, స్వచ్ఛతా జాగృతి యాత్ర, స్వచ్ఛతా విజేతలకు అవార్డులు, గ్రామ పంచాయితీల్లో చర్చలు మొదలైన కార్యక్రమాల నిర్వహణ
అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ దివస్ నిర్వహణతో ఎస్ హెచ్ ఎస్ కార్యక్రమాల ముగింపు
Posted On:
15 SEP 2021 7:51PM by PIB Hyderabad
గౌహతిలోని ఎన్ ఇ డిఎఫ్ ఐ సమావేశ కేంద్రంలో సెప్టెంబర్ 15న స్వచ్ఛతా హై సేవా ( ఎస్ హెచ్ ఎస్ ) కార్యక్రమం ప్రారంభమైంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలైన సందర్భంగా నిర్వహిస్తున్న ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అస్సాం మంత్రి రంజీత్ కుమార్ దాస్ తోపాటు పలువురు కేంద్ర రాష్ట్ర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ కాక్రమాన్ని సెప్టంబర్ 15నుంచి అక్టోబర్ రెండు వరకూ దేశవ్యాప్తంగా నిర్వహించాలని కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలోని కేంద్ర తాగునీటి మరియు పారిశుద్ధ్య శాఖ నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో భాగంగా అస్సాంలో కూడా ఎస్ హెచ్ ఎస్ 2021 ప్రారంభమైంది. ఈ రాష్ట్రంలో కూడా సత్యాగ్రహ్ సే స్వచ్ఛాగ్రహ్ రథ్ యాత్ర, శ్రమదాన్, స్వచ్ఛతా జాగృతి యాత్ర, స్వచ్ఛతా విజేతలకు అవార్డులు, గ్రామ పంచాయితీల్లో చర్చలు మొదలైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ దివస్ తో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి.
అస్సాంకు చెందిన ఎస్ బి ఎం-జి ఎండీ శ్రీ ఆకాష్ దీప్ ప్రారంభ ఉపన్యాసం ఇచ్చారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, ఎస్ హెచ్ ఎస్, స్వచ్ఛ సర్వేక్షణ్, స్వచ్ఛ భారత్ దివస్ మొదలైన కార్యక్రమాల ఉద్దేశ్యాలను ఆయన వివరించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి శ్రీ హిరణ్య బోరా కార్యక్రమ విజయంగురించి వివరించారు. నిరంతరం కొనసాగిస్తేనే ఆ కార్యక్రమం విజయవంతమై ఆశించిన ఫలితాలు వస్తాయని స్వచ్ఛభారత్ కార్యక్రమం ఈ కోవకు చెందినదే అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం ప్రజల కార్యక్రమంగా రూపుదాల్చిందని, పరిసరాల శుభ్రత, పారిశుద్ధ్య ప్రాధాన్యతను ప్రజలు గుర్తించారని ఆయన అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ ( గ్రామీణ) సర్వే కోసం ఎదురు చూస్తున్నట్టు ఆయన తెలిపారు. చేసిన మంచిపనిపై నమ్మకముందని రాష్ట్రాల ర్యాంకుల్లో అస్సాం స్థాయి పెరుగుతుందని, ఈ సర్వేలో అస్సాం ప్రజలు భాగంకావాలని, వారు నిజాయితీగా తమ స్పందన తెలియజేయాలని, రాష్ట్రానికి మద్దతుగా నిలవాలని ఆయన కోరారు.
పరిసరాల శుభ్రత, పారిశుద్ధ్యమనేది ప్రజలందరి కర్తవ్యమనే భావనను ప్రజల్లోకల్పిస్తూ ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం కోసం స్వచ్ఛ భారత్ ఉద్యమం వారు ప్రారంభించిన కార్యక్రమమే స్వచ్ఛతా హై సేవ. పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యతను ప్రజలు అవగాహన చేసుకునేలా చేయడం, ఒక పద్ధతి ప్రకారం ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణ చేపట్టడంపైన ప్రజల్లో అవగాహన పెంచడం ఈ ఏడాది ఎస్ హెచ్ ఎస్ లక్ష్యాలు. రాష్ట్రాలు, జిల్లాలు, గ్రామ పంచాయితీలు, గ్రామాలు, కమ్యూనిటీలు, వ్యక్తిగతంగా ప్రజలు ఇలా అన్ని దశల్లోనివారు భాగస్వాములై అందరూ కలిసికట్టుగా ఈ ఉద్యమానికి సంబంధించినవారందరూ పని చేయాలి. తమ గ్రామాలను ఓడిఎఫ్ ప్లస్ గా మార్చుకోవాలి. ( బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలు ప్లస్)
ఈ సందర్భంగా మాట్లాడిన అస్సాం మంత్రి శ్రీ రంజీత్ కుమార్ దాస్ స్వచ్ఛ భారత్ ఉద్యమం విశిష్టతను వివరించారు. పారిశుద్ధ్యం, పరిసరాల శుభ్రత, రక్షిత మంచినీరు తదితర సౌకర్యాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను పెంచి సమాజ అభ్యున్నతికోసం స్వచ్ఛ భారత్ ఉద్యమం పని చేస్తోందని అన్నారు. తద్వారా ప్రజల ఆర్ధికశక్తిని పెంచుతోందని, వారు ఆరోగ్యకరంగా వుండేలా దోహదం చేస్తోందని స్పష్టం చేశారు. పట్టణీకరణ కారణంగా పక్కదోవ పట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాలు స్వచ్ఛభారత్ ఉద్యమం కారణంగా తిరిగి గాడిలో పడుతున్నాయని, పరసరాల పరిశుభ్రత, ఆరోగ్యంపట్ల ప్రజల్లో తిరిగి శ్రద్ధ పెరుగుతోందని ఆయన అన్నారు. ఓడిఎఫ్ ప్లస్ మీద భారీ స్థాయిలో అవగాహన పెంచడంకోసం స్వచ్ఛతా హై సేవ కార్యక్రమం కింద అనేక కార్యక్రమాలు చేపట్టినట్టు ఆయన వివరించారు. ఇందులో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
దీని తర్వాత సత్యాగ్రహ్ సే స్వచ్ఛాగ్రహ్ రథయాత్రకు పచ్చజెండా ఊపి ప్రారంభం చేశారు. ఈ రథం అస్సాంలోని అన్ని జిల్లాల్లో ప్రయాణం చేస్తుంది. ఓడిఎఫ్ మీదా, ఘన ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణ మీదా ఆయా ప్రాంతాల ప్రజల్లో ఈ రథం ద్వారా అవగాహన కల్పిస్తారు. ఈ సందర్భంగా శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీని ద్వారా వ్యర్థాల సేకరణ, తరలింపు, ఇంకుడు గుంతకు పునాది వేయడం తదితర కార్యక్రమాలునిర్వహించారు.
***
(Release ID: 1755385)
Visitor Counter : 297