వ్యవసాయ మంత్రిత్వ శాఖ

వ్యవసాయ రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ అన్ని కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్ల సమావేశాన్ని నిర్వహించింది.


అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ చిన్న రైతుల కోసం ఫారం గేట్ వద్ద మౌలిక సదుపాయాలను కల్పిస్తుందని తోమర్ చెప్పారు

కేంద్రపాలిత ప్రాంతాల్లో మెరుగైన అమలు కోసం వ్యవసాయ మంత్రిత్వ శాఖ పథకాలను ఈ సందర్భంగా వివరించారు.

కేంద్ర వ్యవసాయ పథకాల ప్రయోజనాలు రాష్ట్రాల్లో, యూటీల్లో మెరుగైన అమలు చేయడం ద్వారా అవి రైతులను చేరుకోవాలి: నరేంద్ర సింగ్ తోమర్

Posted On: 15 SEP 2021 6:06PM by PIB Hyderabad

వ్యవసాయ రంగానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు సరైన రీతిలో రైతులకు చేరాలని కేంద్ర వ్యవసాయ మంత్రి  నరేంద్ర సింగ్ తోమర్ పేర్కొన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్లు/అన్ని కేంద్రపాలిత ప్రాంతాల పాలకుల సదస్సులో ప్రసంగిస్తూ, నిధులు అడ్డంకి కానప్పటికీ, పథకం అమలు సరిగ్గా జరగాలని అన్నారు.  కెసిసి కార్యక్రమం చాలా ముఖ్యమని చెప్పిన ఆయన, కిసాన్ క్రెడిట్ కార్డ్ కవర్ రైతులకు కోవిడ్ సమయంలోనూ అందించడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం 2020 ఫిబ్రవరి నుండి రైతులందరికీ కెసీసీలు ఇవ్వడానికి ఒక ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ‘‘పీఎం కిసాన్ లబ్ధిదారులపై దృష్టి పెట్టండి. ప్రస్తుత సంవత్సరానికి 16 లక్షల కోట్ల రుణ లక్ష్యాన్ని నిర్దేశించాం. ఇప్పటికే కెసిసి ద్వారా దాదాపు 14 లక్షల కోట్లు రైతులకు అందించాం’ అని తోమర్ చెప్పారు.

 

ఫామ్ గేట్ వద్ద మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రైతు సులభంగా రుణాలు పొందడానికి వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి సహాయపడుతుందని మంత్రి చెప్పారు. ఇది చిన్న రైతుకు తన పంట నిల్వ,  రక్షణలో సహాయపడుతుందని వివరించారు. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ కింద 5.5 కోట్ల మంది రైతుల డేటాబేస్ తయారయిందని, డిసెంబర్ నాటికి అది 8 కోట్లకు చేరుకుంటుందని మంత్రి చెప్పారు. కేంద్రపాలిత ప్రాంతాలు దీనికి సహకరించాలని ఆయన కోరారు. ప్రపంచ ప్రమాణాల ప్రకారం.. అధిక విలువ గల ఆయిల్ పామ్ వంటి పంటల సాగుకు కేంద్రపాలిత ప్రాంతాల్లో చాలా అవకాశాలు ఉన్నాయని  తోమర్ చెప్పారు. అనంతరం మనోజ్ సిన్హా, లెఫ్టినెంట్ గవర్నర్, జె & కె,  లెఫ్టినెంట్ గవర్నర్, అండమాన్  నికోబార్ ద్వీపం అడ్మిరల్ డి కె జోషి  ఈ చర్చలో పాల్గొని, కేంద్ర ప్రభుత్వం , వివిధ పథకాల అమలు గురించి తెలుసుకున్నారు. అధికారులు  ఇతర కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు కూడా చర్చల్లో పాల్గొన్నారు.

 రైతుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై వ్యవసాయ  రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు అన్ని  యూటీల పాలకులకు ప్రెజెంటేషన్‌లు ఇచ్చారు.  పీఎం కిసాన్ యోజన కింద మొత్తం లబ్ధిదారులకు చెల్లించిన మొత్తాల గురించి విశదీకరించారు. అర్హులైన లబ్ధిదారులకు అధిక కవరేజ్  ప్రయోజనాల బదిలీని నిర్ధారించడానికి, యూటీలు చర్యలు తీసుకోవాలని కోరారు.- లబ్ధిదారుల డేటాబేస్ అప్‌గ్రేడ్ చేయాలని, గ్రామాల వారీగా లబ్ధిదారుల జాబితా గ్రామ పంచాయతీలో సోషల్ ఆడిట్ కోసం ప్రదర్శించాలని సూచించారు. డిజిటల్ ల్యాండ్ రికార్డులను పీఎం కిసాన్ తో అనుసంధానం చేయాలి. డేటాబేస్, ఫిజికల్ వెరిఫికేషన్ నిర్ణీత సమయంలో పూర్తి చేయాలి. పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను ప్రాధాన్యత ఆధారంగా పరిష్కరించాలి  అనర్హుల నుంచి  ఐటీ చెల్లింపుదారుల నుండి డబ్బును రికవరీ చేయాలి.

 

ప్రధానమంత్రి కిసాన్ మంధన్ యోజన  లబ్ధిదారుల ప్రస్తుత స్థితి గురించి కేంద్ర పాలిత ప్రాంతాలతో చర్చించారు. అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఏఐఎఫ్)  లో మార్పులను వివరించారు. ఏఐఎఫ్ కింద అర్హత గల కార్యకలాపాలు కేంద్ర పాలిత ప్రాంతాల లకు అధికారులు వివరించారు.  సుమారు రూ.1,700 కోట్ల పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఏఐఎఫ్కి సంబంధించిన డ్రై స్టోరేజ్, ప్యాక్ హౌస్, కోల్డ్ స్టోరేజ్, రైపింగ్ ఛాంబర్, రీఫర్ వెహికల్స్, స్మార్ట్  ప్రెసిషన్ ఫార్మింగ్ మొదలైన కార్యకలాపాల వల్ల 7 కేంద్రపాలిత ప్రాంతాలకు 1700 కోట్ల ఇన్వెస్ట్మెంట్లు వస్తాయని,  20,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు ఉంటాయని తెలిపారు.

  కేంద్ర పాలిత ప్రాంతాల లలోని అర్హులైన రైతులందరినీ కవర్ చేయడానికి రైతులకు  బ్యాంకులకు అవసరమైన అన్ని సహాయాలను అందించాలని కోరారు. కేసీసీ కోసం దరఖాస్తు ఫారం స్వీకరించడానికి బ్యాంక్ శాఖల స్థాయిలో క్యాంపులను ఏర్పాటు చేయాలని సూచించారు.  గ్రామసభ సమావేశాల ద్వారా వివరాలు తెలియజేయాలని కేంద్ర పాలిత ప్రాంతాలను కోరారు. ప్రధాన మంత్రి ఫసల్‌బీమా యోజన పథకం అమలు గురించి  సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం గురించి రైతులు చర్చించారు. ఎన్ఎంఈఓఓపీ, ఆయిల్ పామ్ మిషన్,  ఆయిల్ పామ్ వ్యూహంలో అండమాన్ & నికోబార్‌పై దృష్టి పెట్టారు. 3 కేంద్ర పాలిత ప్రాంతాల లలో  నూనె గింజల పంటకు ఉన్న అవకాశాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.  విత్తనాలు  నాటడం పదార్థాలపై సబ్-మిషన్ గురించి కూడా వివరించడం జరిగింది. మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హార్టికల్చర్  మార్కెటింగ్ డివిజన్ ద్వారా అమలవుతున్న పథకాలపై కూడా ప్రదర్శనలను నిర్వహించారు.  ఈ సమావేశానికి హాజరైన వారిలో  కైలాష్ చౌదరి, (ఎంఓఎస్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్),  మంత్రి శోభాకరంద్లాజే ( మోసా అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్)  సంజయ్ అగర్వాల్ ( ఎంఓఏఎఫ్‌డబ్లూ), ఇతర సీనియర్ అధికారులు,  అన్ని కేంద్ర పాలిత ప్రాంతాల  ప్రగతిశీల రైతులు ఉన్నారు.

***



(Release ID: 1755307) Visitor Counter : 158


Read this release in: English , Urdu , Hindi , Punjabi