ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రూ.121 కోట్ల నకిలీ ఐటీసీకి సంబంధిత రాకెట్‌ సూత్రధారి, కమీషన్ ఏజెంట్, సీఏతో సహా ముగ్గురిని అరెస్ట్ చేసిన డీజీజీఐ

Posted On: 15 SEP 2021 4:06PM by PIB Hyderabad

నకిలీ పత్రాలపై బహుళ కల్పిత సంస్థలను సృష్టించడం మరియు నిర్వహించడం వస్తువులు లేదా సేవల సరఫరాలు లేకుండానే ఇన్‌వాయిస్‌లు, పెద్ద మొత్తంలో నకిలీ ఇన్‌పుట్ ట్యాక్స్‌ క్రెడిట్‌ను (ఐటీసీ) జారీ చేయ‌డానికి సంబంధించిన రాకెట్ సూత్ర‌ధారిని హ‌ర్యానాలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్‌టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ)  గురుగ్రామ్ జోనల్ యూనిట్ (జీజెడ్‌యు) ఆరెస్ట్ చేసింది. ఈ రాకెట్‌కు సంబంధించి సూత్రధారి, కమీషన్ ఏజెంట్, ఛార్టెర్డ్ అకౌంటెంట్‌తో (సీఏ) సహా ముగ్గురిని అరెస్ట్ చేసింది. ఇప్పటి వరకు నిర్వహించిన మొత్తం దర్యాప్తు మేర‌కు అరెస్టయిన వ్యక్తులలో ఒకరు దాదాపు13 సంస్థలను సృష్టించి మొత్తం దాదాపు రూ.121 కోట్ల వ‌ర‌కు మోసపూరితమైన  ఐటీసీని పొందడం మరియు పాస్ చేయడంలో వంటి కార్య‌క‌లాపాల‌కు పాలుపంచుకున్నట్లు నిర్ధారించబడింది. నకిలీ/ డొల్ల‌ సంస్థలను సృష్టించిన వ్యక్తి కమీషన్ ఏజెంట్‌తో కలిసి పనిచేశారని, వీరు ఎలాంటి వ‌స్తువుల వాణిజ్యం లేకుండానే  గుడ్‌లెస్ ఇన్‌వాయిస్‌లను ప్రత్యక్షంగా, మ‌రియు  వివిధ బ్రోకర్ల ద్వారా స్థాపించిన సంస్థలకు విక్రయించేవార‌ని కూడా ఈ ద‌ర్యాప్తులో తేలింది. ఈ రాకెట్‌కు సంబంధించి కమీషన్ ఏజెంట్‌ను కూడా అరెస్టు చేశారు. దీనికి తోడు ఈ రాకెట్ వ్య‌వ‌హారంలోని గొలుసులో వ‌స్త‌వంగా స్థాపించబడిన ఇత‌న‌ సంస్థలు (తుది-వినియోగదారులు)  న‌గ‌దును నకిలీ సంస్థలకు బదిలీలు చేస్తాయని తేలింది, అక్కడ నుండి ఆ మొత్తాలు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఖాతాకు బదిలీ చేయబడతాయి. ఇక్క‌డ ఉండే సీఏ తన కంపెనీ కమీషన్‌తో పాటు తన స్వంత కమీషన్‌ను తీసుకొని ఆ తర్వాత మిగిలిన మొత్తాన్ని నగదు రూపంలో ఉపసంహరించుకుని ఆయా వాస్త‌వ సంస్థ‌ల‌కు తిరిగి ఇచ్చేయ‌డం లాంటివి చేసేవారు. దీనిని డీజీజీఐ తాజాగా గుర్తించింది.  నగదు లావాదేవీల మొత్తాలు రోజుకు దాదాపు 30-40 లక్షల మేర‌కు న‌మోదు అవుతూ వ‌చ్చాయి. అనేక ప్రదేశాలలో ఈ రాకెట్‌కు సంబంధించిన ద‌ర్యాప్తు చేప‌ట్ట‌డం జ‌రిగింది. ధ్రువీకరణలు, సాక్ష్యాలు మరియు రికార్డ్ చేసిన స్టేట్‌మెంట్‌ల ఆధారంగా, ఈ ముగ్గురు వ్యక్తులు అంటే నకిలీ సంస్థల సృష్టికర్త, కమిషన్ ఏజెంట్ మరియు సీఏ నకిలీ పత్రాలపై నకిలీ సంస్థలను తయారు చేసే ఈ రాకెట్‌ను నిర్వహిస్తున్నట్లు తేలింది. వీరు మొత్తంగా రూ .121 కోట్ల‌ (ఇప్పటివరకు) విలువైన ఐటీసీ మొత్తాన్ని పాస్ చేసిన‌ట్లుగా విచార‌ణ‌లో తేలింది. ఈ అంశానికి సంబంధించిన తదుపరి విచార‌ణ కొన‌సాగుతోంది.
                                                                               

****


(Release ID: 1755288) Visitor Counter : 151


Read this release in: English , Urdu , Hindi , Tamil