మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నీట్‌- 2021 పరీక్షలో అభ్యర్థి కరా ధరించడానికి అనుమతించకపోవడంపై వచ్చిన ఫిర్యాదును ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న జాతీయ మైనారిటీల కమిషన్

Posted On: 15 SEP 2021 7:18PM by PIB Hyderabad

ఇటీవ‌ల నిర్వ‌హించిన నీట్‌- 2021 పరీక్షలో వెండి కరా ధరించిన ఇతర విద్యార్థులు టేప్ ఫిక్సింగ్‌తో ప‌రీక్ష‌కు అనుమతించి  ఛండీగ‌ఢ్ సెక్టార్-19 ప్రాంతంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్ లో ప‌రీక్ష రాసిన తన కుమారుడిని కరా ధరించడానికి అనుమతించక పోవ‌డానికి సంబంధించి శ్రీ భూపిందర్ సింగ్ అనే వ్య‌క్తి నుంచి వచ్చిన ఫిర్యాదును జాతీయ మైనారిటీల కమిషన్ (ఎన్‌సీఎం) ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంది. దీనికి సంబంధించి ఎన్‌సీఎం ఈ రోజు న్యూఢిల్లీలో ఒర ప్రెస్ నోట్‌ను విడుద‌ల చేసింది, ఈ సంఘటనలో మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తులు ఉన్నందున కమిట్ ఈ విషయమై చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ మరియు నీట్ 2021 పరీక్ష నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుండి వాస్తవ నివేదికను కోరింది. ఎన్‌సీఎం చట్టం, 1992 కింద ఏర్పడిన ఎన్‌సీఎం, మైనారిటీల హక్కులు మరియు భద్రతల పరిరక్షణకు సంబంధించిన నిర్దిష్ట ఫిర్యాదులను పరిశీలించి, సంబంధిత అధికారులతో అలాంటి విషయాలను చేపట్టే బాధ్యతను ఇంటర్-అలియాకు అప్పగించినట్లు ప్రెస్ నోట్ పేర్కొంది.
                                                                                     

*****


(Release ID: 1755285)
Read this release in: English , Urdu , Hindi , Punjabi