ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
"ఆజాదీ-కా-అమృత్-మహోత్సవ్" లో భాగంగా, 2021 సెప్టెంబర్, 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు నిర్వహించిన ఆహార ప్రాసెసింగ్ వారోత్సవాల్లో, 416.59 కోట్ల రూపాయల వ్యయంతో 21 ఆహార ప్రాసెసింగ్ ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి
సుమారు 7,500 మందికి ఉపాధితో పాటు, 32,000 మంది రైతులు ప్రయోజనం పొందనున్నారు
పి.ఎం.ఎఫ్.ఎం.ఈ. పథకం కింద ఒడిశా, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, పంజాబ్, అస్సాం, మేఘాలయ, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్రలోని 4,709 ఎస్.హెచ్.జి. సభ్యులకు ప్రారంభ పెట్టుబడిగా 13.41 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది
'ఒక జిల్లా-ఒక ఉత్పత్తి' కింద ప్రాసెసింగ్ తో పాటు, విలువను జోడించడంపై ప్రతి రాష్ట్రం, మంత్రిత్వశాఖ, విభాగం వివిధ మార్గాల్లో వెబీనార్లు నిర్వహించాయి
Posted On:
13 SEP 2021 6:39PM by PIB Hyderabad
75 సంవత్సరాల ప్రగతిశీల భారతదేశం మరియు దాని అద్భుతమైన చరిత్ర ను స్మరించుకుంటూ, ఉత్సవాలు జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో, ప్రతి రాష్ట్రం, మంత్రిత్వ శాఖ, విభాగం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్" ను వివిధ రకాలుగా జరుపుకుంటున్నాయి. "ఆజాదీ-కా-అమృత్ మహోత్సవ్" భారతదేశ సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక గుర్తింపు గురించి ప్రగతిశీలమైన అన్నింటినీ కలిగి ఉంది. దేశాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించి, మన దేశ ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలనే ఏకైక ఉద్దేశ్యంతో ఈ ఉత్సవాలను 75 వారాల పాటు జరుపుకోవాలని, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలను కోరారు. "ఆజాదీ-కా-అమృత్-మహోత్సవ్" లో భాగంగా, ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ, 2021 సెప్టెంబర్ 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు "ఆహార ప్రాసెసింగ్ వారోత్సవాలను" నిర్వహించింది.
వ్యవసాయ క్షేత్రం నుండి మార్కెట్ వరకు విలువ వ్యవస్థను పెంపొందించడంతో పాటు, ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల కు ఆధునిక మౌలిక సదుపాయాలను అందించాలనే లక్ష్యంతో, కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి, శ్రీ పశుపతి కుమార్ పరాస్ మరియు కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్, ఈ సందర్భంగా, 21 ఆహార ప్రాసెసింగ్ ప్రాజెక్టులను ప్రారంభించారు.
ఈ ప్రాజెక్టుల మొత్తం ఖర్చు 416.59 కోట్ల రూపాయలు కాగా, మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టుల కోసం 104.21 కోట్ల రూపాయల మేర గ్రాంట్-ఇన్-ఎయిడ్ నిధులు మంజూరు చేసింది. వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడించి, ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికీ, రైతుల ఉత్పత్తులకు మెరుగైన ధరలను కల్పించడానికీ, అద్భుతమైన నిల్వ సౌకర్యంతో పాటు ఈ ప్రాంతంలో రైతులకు ప్రత్యామ్నాయ మార్కెట్ వ్యవస్థని అందుబాటులోకి తీసుకురాడానికి, ఈ ప్రాజెక్టులు దోహదం చేస్తాయి. ఈ ప్రాజెక్టులు సుమారు 7,500 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించడం తో పాటు, సి.పి.సి. మరియు పి.పి.సి. పరివాహక ప్రాంతాల్లో ని 32,000 మంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తాయి.
మహమ్మారి సమయంలో, ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమాల్లో భాగంగా, ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ఆహార ప్రాసెసింగ్ రంగంలో సూక్ష్మ మరియు అసంఘటిత పారిశ్రామికవేత్తల కోసం పి.ఎం.ఎఫ్.ఎం.ఈ. పథకాన్ని ప్రారంభించింది. పి.ఎం.ఎఫ్.ఎం.ఈ. పథకం కింద, వివిధ రాష్ట్రాలలోని స్వయం సహాయక సంఘాల సభ్యులకు ప్రారంభ పెట్టుబడి విడుదల చేయడం జరిగింది. ఆహార ప్రాసెసింగ్ వారోత్సవాల సందర్భంగా, దేశవ్యాప్తంగా 4,709 మంది ఎస్.హెచ్.జి. ల సభ్యులకు ప్రారంభ పెట్టుబడిగా 13.41 కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక సహాయం అందించడం జరిగింది.
దీనితో పాటు, 'ఒక జిల్లా-ఒక ఉత్పత్తి' కింద తేనె, పాలు, బేకరీ పదార్ధాలు మొదలైన ఆహార ఉత్పత్తుల పై, ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ, మొత్తం 7 ఆన్-లైన్-ఆఫ్-లైన్ వెబీనార్ లతో పాటు ప్రాసెసింగ్ మరియు విలువ జోడింపు పై వర్క్-షాప్ లు నిర్వహించింది. పి.ఎం.ఎఫ్.ఎం.ఈ. పథకం లబ్ధిదారుల విజయ గాథలను, మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ లో 'ఆత్మనిర్భర్ ఎంటర్‌ప్రైజెస్' సిరీస్ విభాగంలో కూడా ప్రచురించడం జరిగింది. ఏడుగురు పారిశ్రామికవేత్తల కథలు మరియు వారి వెంచర్లు పాఠకులతో పంచుకోబడ్డాయి. అవి చాలా ప్రశంసించబడ్డాయి.
ప్రాసెస్ చేసిన ఆహారానికి సంబంధించి, సాధారణ ప్రజలలో నెలకొన్న అపోహలను నిర్మూలించాలనే ఏకైక ఉద్దేశ్యంతో, ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తులపై, గత వారమంతా సామాజిక మాధ్యమాల ద్వారా, అవగాహన ప్రచారం నిర్వహించింది. సామాజిక మాధ్యమాలలో ఇన్ఫోగ్రాఫిక్స్, వీడియోల రూపంలో పోస్టు చేయడం ద్వారా విస్తృతంగా ప్రచారం కల్పించడం జరిగింది.
ఈ వారం రోజుల వ్యవధిలో ప్రారంభించిన ప్రాజెక్టు ల వివరాలు:
తేదీ
|
ప్రాజెక్టుల
సంఖ్య
|
ప్రాజెక్టు వ్యయం
(కోట్ల రూపాయలలో)
|
మంత్రిత్వ శాఖ నుండి గ్రాంటు
(కోట్ల రూపాయలలో)
|
ఉపాధి కల్పన
|
లబ్ధి పొందిన రైతుల సంఖ్య
|
06.09.2021
|
01
|
12.90
|
4.65
|
260
|
---
|
07.09.2021
|
05
|
124.44
|
28.02
|
820
|
7700
|
08.09.2021
|
01
|
16.94
|
9.36
|
200
|
300
|
09.09.2021
|
06
|
76.76
|
24.19
|
2500
|
6800
|
10.09.2021
|
07
|
164.46
|
27.99
|
3100
|
16500
|
11.09.2021
|
--
|
---
|
----
|
----
|
---
|
12.09.2021
|
01
|
21.09
|
10
|
700
|
1000
|
మొత్తం
|
21
|
416.59
|
104.21
|
7580
|
32300
|
*****
(Release ID: 1754670)
Visitor Counter : 229