భారత పోటీ ప్రోత్సాహక సంఘం

ఇండియా బుల్స్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్‌ను, ఇండియా బుల్స్ ట్ర‌స్టీ కంపెనీ లిమిటెడ్ సంస్థ‌ల‌ను నెక్స్ట్ బిలియ‌న్ టెక్నాల‌జీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కొనుగోలు చేసేందుకు కాంపిటీష‌న్ క‌మిష‌న్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ఆమోదం


Posted On: 09 SEP 2021 7:40PM by PIB Hyderabad

ఇండియా బుల్స్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్‌ను, ఇండియా బుల్స్ ట్ర‌స్టీ కంపెనీ లిమిటెడ్ సంస్థ‌ల‌ను నెక్స్ట్ బిలియ‌న్ టెక్నాల‌జీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కొనుగోలు చేసేందుకు కాంపిటీష‌న్ క‌మిష‌న్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ఆమోదం తెలిపింది.

ప్ర‌తిపాదిత క‌ల‌యిక ద్వారా ఇండియా బుల్స్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ (ఇండియా బుల్స్ ఎఎంసి), ఇండియా బుల్స్ ట్ర‌స్టీ కంపెనీ లిమిటెడ్ (ఇండియా బుల్స్ ట్ర‌స్టీ)లో 100% వాటాల‌ను కొనుగోలు చేయ‌నుంది.

నెక్ట్స్ బిలియ‌న్ టెక్నాల‌జీ ప్రైవేట్ లిమిటెడ్ స్టాక్ బ్రోక‌ర్, డిపాజిట‌రీ భాగ‌స్వామి. అలాగే, ఇది భార‌త్‌లోని అసోసియేష‌న్ ఆఫ్ మ్యూచ్యువ‌ల్ ఫండ్స్ లో మ్యూచ్యువ‌ల్ ఫండ్ పంపిణీదారుగా న‌మోదు చేసుకుంది. మ్యూచ్యువ‌ల్ ఫండ్స్‌, స్టాక్‌ల‌లో పెట్టుబ‌డిదారులు త‌మ పెట్టుబ‌డుల‌ను పెట్టేందుకు గ్రో (Groww) పేరిట ఆన్‌లైన్ వేదిక‌ను అందిస్తోంది.

ఇండియాబుల్స్ హౌజింగ్ ఫైనాన్స్‌కు అనుబంధ సంస్థ ఇండియా బుల్స్ ఎఎంఇ. ప్ర‌స్తుతం ఇండియా బుల్స్ ఎఎంసికి 3 వ్యాపార విభాగాలు ఉన్నాయి -  అవి, మ్యూచ్యువ‌ల్ ఫండ్ బిజినెస్ (ఎంఎఫ్ బిజినెస్‌), ఆల్ట‌ర్నేట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ బిజినెస్ (ఎఐఎఫ్ బిజినెస్‌), పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ బిజినెస్ (పిఎంఎస్ బిజినెస్‌). ఈ సంస్థ ఇండియా బుల్స్ మ్యూచ్యువ‌ల్ ఫండ్ (ఇండియా బుల్స్ ఎంఎఫ్‌)కు ఆస్తుల నిర్వ‌హ‌ణ‌, దాని కార్య‌క‌లాపాలు/  ప‌థ‌కాల‌ను నిర్వ‌హిస్తుంది. ఇండియా బుల్స్ ఎంఎఫ్ సంస్థ‌కు ట్ర‌స్టీషిప్ సేవ‌ల‌ను ఇండియా బుల్స్ ట్ర‌స్టీ అందించ‌డంలో నిమ‌గ్న‌మై ఉంది.

సిసిఐ వివ‌ర‌ణాత్మ‌క ఉత్త‌ర్వులు త్వ‌ర‌లో జారీ కానున్నాయి.

****



(Release ID: 1754009) Visitor Counter : 145


Read this release in: English , Urdu , Hindi