నీతి ఆయోగ్
భారత్‌లోనే మొట్టమొదటిసారి దేశీయంగా రూపకల్పన చేసిన హైయాష్ కోల్ గ్యాసిఫికేషన్ బేస్డ్ మిథనాల్ ప్రొడక్షన్ ప్లాంట్‌ను అందుబాటులోకి తెచ్చిన బీహెచ్ఈఎల్ హైదరాబాద్ ఆర్అండ్‌డీ కేంద్రం
Posted On:
09 SEP 2021 4:41PM by PIB Hyderabad
మిథనాల్ మోటార్ ఇంధనంగాను, ఓడ ఇంజిన్లకు శక్తినివ్వడానికి మరియు ప్రపంచ వ్యాప్తంగా స్వచ్ఛమైన శక్తిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగించబడుతుంది. మిథనాల్ 'డి-మిథైల్ ఈథర్' ను (డీఎంఈ) ఉత్పత్తి చేయడానికి కూడా మిథనాల్ ఉపయోగించబడుతుంది, ఇది డీజిల్‌తో సమానమైన ద్రవ ఇంధనం. ప్రస్తుతం ఉన్న డీజిల్ ఇంజిన్లలో డీజిల్‌కు బదులుగా కొద్దిగా మార్చబడిన డీఎంఈ ఉపయోగించబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా మెథనాల్ ఉత్పత్తిలో ఎక్కువ భాగం సహజ వాయువు నుండి తీసుకోబడింది, ఇది సాపేక్షంగా సులభమైన ప్రక్రియ. భారతదేశంలో సహజవాయువు నిల్వలు ఎక్కువగా లేనందున, దిగుమతి చేసుకున్న సహజవాయువు నుండి మిథనాల్ ఉత్పత్తి చేయడం జరగుతోంది. ఈ ప్రక్రియ విదేశీ మారక ద్రవ్యం ఎక్కువగా మన దేశం నుంచి విదేశాలకు తరలిపోయేందుకు దారితీస్తుంది.కొన్నిసార్లు సహజవాయువు యొక్క అధిక ధరల కారణంగా ఆర్థికంగా ఇది భారంగా కూడా మారుతోంది. ఈ నేపథ్యంలో భారతదేశంలో సమృద్ధిగా ఉన్న బొగ్గును ఉపయోగించడం తదుపరి ఉత్తమ ఎంపిక విధనం. భారత దేశంలో లభించే బొగ్గులో అధిక శాతం బూడిద నిల్వలు ఉన్నందున, అంతర్జాతీయంగా ప్రాప్యత చేయగల సాంకేతికత మన డిమాండ్‌కు సరిపోదు. ఈ సమస్యను పరిష్కరించడానికి హైదరాబాద్‌లోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్
(బీహెచ్ఈఎల్) పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రం 2016లో నితీ ఆయోగ్ వారి తోడ్పాటుతో రోజుకు బొగ్గు గ్యాసిఫికేషన్‌పై 0.25 టన్నుల మిథనాల్ ఉత్పత్తి చేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. ఈ ప్రాజెక్టుకు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ రూ .10 కోట్ల గ్రాంట్‌తో ఆర్థిక మద్దతునిచ్చింది. నాలుగు సంవత్సరాల శ్రమ అనంతరం బీహెచ్ఈఎల్ సంస్థ 1.2 టీపీడీల ఫ్లూయిడైజ్డ్ బెడ్ గ్యాసిఫైయర్‌ని ఉపయోగించి అధిక బూడిద శాతం కలిగిన భారతీయ బొగ్గు నుండి 0.25 టీపీడీ మిథనాల్‌ను సృష్టించే సదుపాయాన్ని విజయవంతంగా అందుబాటులోకి తెచ్చింది. ఉత్పత్తి చేయబడిన ముడి మిథనాల్ మిశ్రమంలో మిథనాల్ స్వచ్ఛత 98 మరియు 99.5 శాతం మధ్య ఉంటుంది. భారతదేశంలో మొట్టమొదటి ప్రదర్శన కర్మాగారాన్ని చూసేందుకు ప్లాంట్ ఉత్పత్తి కార్యక్రమంలో బీహెచ్ఈఎల్ యొక్క బొగ్గు గ్యాసిఫికేషన్ బృందం ఆనందంగా పాలుపంచుకుంది. ప్లాంట్ ఉత్పత్తి ప్రారంభ కార్యక్రమంలో నితీ ఆయోగ్ గౌరవ సభ్యుడు డాక్టర్ వి.కె. సరస్వత్, భెల్ సంస్థ ఛైర్మన్ శ్రీ నళినీ సింఘాల్‌లు కూడా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా డాక్టర్ వి కె సరస్వత్ మాట్లాడుతూ .."బీహెచ్ఈఎల్ సంస్థ చేపట్టిన ఈ ప్రయత్నం అంతర్గత సామర్థ్యం కలిగిన నైపుణ్యాన్ని వెలికితీసి నిరూపించేందుకు దోహదం చేసింది, అధిక సామర్థ్యం గల బొగ్గు గ్యాసిఫికేషన్ సదుపాయాలను రూపొందించడానికి, ఇది మన గౌరవనీయులైన ప్రధాన మంత్రి 'ఆతమ్ నిర్భర్ భారత్' దృష్టికి అవసరమైన ప్రేరణను అందిస్తుంది అని అన్నారు. ఈ అంతర్గత సామర్ధ్యం భారతదేశంలోని బొగ్గు గ్యాసిఫికేషన్ మిషన్ మరియు హైడ్రోజన్ మిషన్ కోసం బొగ్గు నుండి హైడ్రోజన్ ఉత్పత్తి ప్రక్రియకు సహాయపడుతుంది. ఈ ఘనత సాధించిన తర్వాత బీహెచ్ఈఎల్ భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి వినూత్న చర్యలు చేపట్టేందుకు ఉత్ప్రేరక మార్పిడి ద్వారా సిన్‌గ్యాస్‌ను మిథనాల్‌గా మార్చే ప్రక్రియలను చేపట్టేందుకు కూడా వీలు కల్పిస్తుంది.
***
(Release ID: 1753644)
Visitor Counter : 274