ఆర్థిక మంత్రిత్వ శాఖ

సీబీడీటీ పన్ను చెల్లింపుదారులకు సెటిల్మెంట్ కోసం దరఖాస్తు దాఖలు చేయడానికి తాత్కాలిక బోర్డు ఏర్పాటు

Posted On: 07 SEP 2021 6:59PM by PIB Hyderabad

ఆర్థిక చట్టం (ఫైనాన్స్ యాక్ట్) 2021 ఆదాయపు పన్ను చట్టం, 1961    నిబంధనల్లో కొన్నింటిని ప్రభుత్వం సవరించింది. ఎందుకంటే ఆదాయ పన్ను సెటిల్‌మెంట్ కమిషన్ ("ఐటీఎస్సీ") 01.02.2021 నుండి నిలిచిపోతుంది.  సెటిల్‌మెంట్ కోసం 01.02.2021 లేదా తరువాత ఎలాంటి దరఖాస్తును అనుమతించడం సాధ్యపడదు. ఇదే తేదీన ఆర్థిక బిల్లు 2021 లోక్‌సభ ముందుకు వచ్చింది. సభ దీనిని ఆమోదించింది. తేదీ 31.01.2021 నాటికి పెండింగ్‌లో ఉన్న  దరఖాస్తులను పరిష్కరించడానికి, కేంద్ర ప్రభుత్వం సెటిల్‌మెంట్ కోసం మధ్యంతర బోర్డును  (ఇకపై "తాత్కాలిక బోర్డు" గా సూచిస్తారు), నోటిఫికేషన్ నెం.91 ప్రకారం 10.08.2021 నాడు ఏర్పాటు చేసింది.  పన్ను చెల్లింపుదారులు, పెండింగ్ కేసులలో, తమ దరఖాస్తులను నిర్దేశిత సమయంలో ఉపసంహరించుకునే అవకాశం. ఉంది.  అటువంటి ఉపసంహరణ గురించి అసెస్సింగ్ అధికారికి తెలియజేయవచ్చు.

 

01.02.2021 నాటికి అనేక పన్ను చెల్లింపుదారులు ఐటీఎస్సీ ముందు సెటిల్మెంట్ కోసం అందజేస్తున్న దరఖాస్తులు తుదిదశలో ఉన్నాయి.  కొంతమంది పన్ను చెల్లింపుదారులు సెటిల్మెంట్ కోసం తమ దరఖాస్తులను ఆమోదించాలని కోరుతూ హైకోర్టులను ఆశ్రయించారు. కొన్ని కేసుల్లో హైకోర్టులు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చాయి  01.02.2021 తర్వాత కూడా సెటిల్‌మెంట్ దరఖాస్తులను ఆమోదించాలని ఆదేశించాయి. ఇది అనిశ్చితికి,  దీర్ఘకాలిక వ్యాజ్యానికి దారితీసింది.

 

31.01.2021 నాటికి దరఖాస్తు దాఖలు చేయడానికి అర్హత ఉన్న పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం ఒక ఏర్పాటు చేసింది. కానీ ఐటీఎస్సీని ఫైనాన్స్ చట్టం, 2021  నిలిపివేయడం వల్ల వీరంతా దరఖాస్తులు దాఖలు చేయలేకపోయారు. ఇప్పుడు వీరంతా తాత్కాలిక బోర్డుకు తమ దరఖాస్తులు దాఖలు చేయవచ్చు. అయితే కొన్ని షరతులకు లోబడి తాత్కాలిక బోర్డు ముందు 2021 సెప్టెంబర్ 30 నాటికి పన్ను చెల్లింపుదారులు ఇచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తుంది.

అసెసీలు 31.01.2021 న సెటిల్‌మెంట్ కోసం దరఖాస్తు దాఖలు చేయడానికి అర్హత పొందిన అసెస్‌మెంట్ సంవత్సరాల కోసం దరఖాస్తు సమర్పించాలని కోరింది (సంబంధిత అసెస్‌మెంట్ సంవత్సరాలు).

సెటిల్మెంట్ కోసం దరఖాస్తు దాఖలు చేసే తేదీ నాటికి అసెస్సీ  అన్ని సంబంధిత అసెస్‌మెంట్ ప్రొసీడింగ్‌లు పెండింగ్‌లో ఉన్నాయి.

అటువంటి దరఖాస్తులను, వాటి చెల్లుబాటుకు లోబడి, సెక్షన్ 245ఏ సెక్షన్ (ఈబీ) ప్రకారం "పెండింగ్ దరఖాస్తులు" గా పరిగణిస్తారు. చట్టంలోని నిబంధనల ప్రకారం తాత్కాలిక బోర్డు వాటిని పరిష్కరిస్తుంది.

చట్టంలోని సెక్షన్ 245 ఎమ్ నిబంధన ప్రకారం ఇటువంటి దరఖాస్తులను దాఖలు చేసిన పన్ను చెల్లింపుదారులకు తమ దరఖాస్తులను ఉపసంహరించుకునే అవకాశం ఉండదు.  వివిధ హైకోర్టుల ఆదేశాల ప్రకారం 01.02.2021 లేదా తరువాత సెటిల్మెంట్ కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు పైన పేర్కొన్న పేరా 3 ప్రకారం పన్ను చెల్లింపుదారులు దరఖాస్తులు అందజేయడానికి అర్హులు. అటువంటి దరఖాస్తును మళ్లీ ఇవ్వాల్సిన అవసరం. దీనికి సంబంధించి శాసన సవరణలను తగిన సమయంలో ప్రతిపాదిస్తారు. 

 

***

 



(Release ID: 1753241) Visitor Counter : 169


Read this release in: English , Marathi , Hindi