మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
విద్యార్థుల్లో ఇమిడి ఉండే ప్రతిభను వెలికి తీసే పనిని తమ ప్రాథమిక బాధ్యతగా గుర్తించి ఉపాధ్యాయులు పనిచేయాలి : ఒక మంచి ఉపాధ్యాయుడు వ్యక్తిత్వాన్ని నిర్మించేవానిగా , సమాజ నిర్మాతగా , దేశాన్ని నిర్మించే వ్యక్తిగా ఉంటారు : రాష్ట్రపతి కోవింద్
ఉత్తమ ఉపాధ్యాయులకు జాతీయ అవార్డులను అందజేసిన రాష్ట్రపతి
21 వ శతాబ్దపు భారతదేశ గమ్యాన్ని ఉపాధ్యాయులు నిర్దేశిస్తారు -శ్రీ ధర్మేంద్ర ప్రధాన్
Posted On:
05 SEP 2021 1:48PM by PIB Hyderabad
విద్యార్థుల్లో ఇమిడి ఉండే ప్రతిభను వెలికి తీసే పనిని తమ ప్రాథమిక బాధ్యతగా గుర్తించి ఉపాధ్యాయులు పనిచేయాలని రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ పిలుపు ఇచ్చారు. ఒక మంచి ఉపాధ్యాయుడు వ్యక్తిత్వాన్ని నిర్మించేవానిగా , సమాజ నిర్మాతగా , దేశాన్ని నిర్మించే వ్యక్తిగా వ్యవహరిస్తారని ఆయన అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి వర్చువల్ విధానంలో దేశం వివిధ ప్రాంతాలకు చెందిన 44 మంది ఉపాధ్యాయులకు అవార్డులను ప్రదానం చేశారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, విద్యాశాఖ సహాయ మంత్రులు శ్రీ సుభాస్ సర్కార్; శ్రీ రాజ్ కుమార్ రంజన్ సింగ్ మరియు శ్రీమతి అన్నపూర్ణ దేవి కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్య మరియు అక్షరాస్యత శాఖ కార్యదర్శి శ్రీమతి అనితా కర్వాల్, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి శ్రీ అమిత్ ఖరే ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అత్యుత్తమ ప్రతిభ కనబరచి అవార్డులకు ఎంపిక అయిన ఉపాధ్యాయులను రాష్ట్రపతి అభినందించారు. దేశ భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లో సురక్షితంగా ఉంటుందని ఆయన అన్నారు. ప్రతిభ కనబరుస్తున్న ఉపాధ్యాయులు దేశ భవిష్యత్తుపై భరోసా కలిగిస్తారని అన్నారు. ప్రతి వ్యక్తి జీవితంలో ఉపాధ్యాయుల పాత్ర ప్రముఖంగా ఉంటుందని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ తమ గురువులను జీవితాంతం గుర్తుంచుకుంటారని రాష్ట్రపతి అన్నారు. తమ విద్యార్థులను ప్రేమతో అంకితభావంతో తీర్చిదిద్దే ఉపాధ్యాయులు తమ విద్యార్థుల నుంచి గౌరవం పొందుతారని అన్నారు.
విద్యార్థులు తమ భవిష్యత్తును నిర్మించుకుని ఆశయాలను సాధించే విధంగా వారిని తీర్చి దిద్దే అంశంలో ఉపాధ్యాయులు స్ఫూర్తిదాయకంగా ఉండాలని సామర్థ్యాన్ని పొందాలని రాష్ట్రపతి కోరారు. చదువుపై విద్యార్థులకు ఆసక్తిని పెంపొందించడం ఉపాధ్యాయుల విధి అని ఆయన అన్నారు. తమ ప్రవర్తన, నడవడిక బోధన ద్వారా ఉపాధ్యాయులు తమ విద్యార్థుల భవిష్యత్తుకు రూపకర్తలుగా పనిచేయాలని రాష్ట్రపతి సూచించారు. ప్రతి విద్యార్థి విభిన్న సామర్థ్యాలు, ప్రతిభ, మనస్తత్వం, సామాజిక నేపథ్యం కలిగి ఉంటారని రాష్ట్రపతి అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రతి విద్యార్థి అవసరాలను గుర్తించి వీటిని అందించడానికి ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన అన్నారు.విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రపతి అన్నారు.
గత ఏడాది అమలులోకి వచ్చిన జాతీయ విద్యా విధానం భారతదేశాన్ని ప్రపంచ విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో రూపొందిందని రాష్ట్రపతి అన్నారు. జ్ఞానం ఆధారంగా న్యాయమైన సమాజాన్ని నిర్మించడంలో సహాయపడే విద్యను విద్యార్థులకు అందించాలని ఆయన ఉపాధ్యాయులకు ఉద్భోదించారు. విద్యార్థులు రాజ్యాంగ విలువలు మరియు ప్రాథమిక విధుల పట్ల నిబద్ధతను పెంపొందించుకునే విధంగా విద్యా వ్యవస్థ రూపొందాలని రాష్ట్రపతి అన్నారు. విద్యార్థుల్లో దేశభక్తి భావనను అలవరచి మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మార్చుకునే అవకాశాన్ని విద్యార్థులకు కల్పించే విధంగా విద్యా భోధన జరగాలని అన్నారు.
ఉపాధ్యాయుల ప్రతిభను మెరుగు పరచడానికి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కొన్ని ముఖ్యమైన చర్యలు అమలు చేస్తున్నదని రాష్ట్రపతి అన్నారు. 'నిష్ఠ' కార్యక్రమం ద్వారా మంత్రిత్వ శాఖ సమగ్ర ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని కింద ఉపాధ్యాయుల సామర్ధ్యాన్ని పెంపొందించడానికి 'ఆన్‌లైన్ కెపాసిటీ బిల్డింగ్' కార్యక్రమం అమలు జరుగుతున్నది. డిజిటల్ విద్యపై గతేడాది జారీ చేసిన 'ప్రజ్ఞాత' మార్గదర్శకాల ద్వారా కోవిడ్ మహమ్మారి సంక్షోభ సమయంలో కూడా విద్యా వేగాన్ని కొనసాగిందని రాష్ట్రపతి పేర్కొన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో నూతన మార్గాలను రూపొందించిన కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ బృందాన్ని ఆయన అభినందించారు.
దేశాభివృద్ధిలో ఉపాధ్యాయుడు పోషించే పాత్ర కీలకంగా ఉంటుందని విద్యా శాఖ మంత్రి శ్రీ ప్రధాన్ అన్నారు. మన కొత్త తరం ఆలోచనలు కార్యరూపం దాల్చే అంశంలో రూపొందించడంలో ఉపాధ్యాయులుప్రముఖ పాత్ర పోషిస్తారని ఆయన అన్నారు. 21 వ శతాబ్దపు భారతదేశ యొక్క భవిష్యత్తు ను రూపొందించడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్న ఉపాధ్యాయులందరికీ శ్రీ ప్రధాన్ కృతజ్ఞతలు తెలిపారు.
జాతీయ అవార్డులను పొందిన 28 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 44 మంది ఉపాధ్యాయులను మంత్రి అభినందించారు. విద్య ద్వారా పిల్లలకు సాధికారత అందించిన ఒడిశాకు చెందిన పద్మశ్రీ దివంగత శ్రీ ప్రకాష్ రావు ఇతరులను మంత్రి గుర్తు చేసుకున్నారు.
భారతదేశంలోని అత్యుత్తమ ఉపాధ్యాయుల కృషిని గుర్తించిన ఈ వేడుకలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని శ్రీ ప్రధాన్ అన్నారు. కోవిడ్ -19 సమయంలో విద్య కొనసాగింపును నిర్ధారించడంలో వారు కీలక పాత్ర పోషించారని ఆయన తెలిపారు.
విద్యా శాఖ సహాయ మంత్రి శ్రీమతి అన్నపూర్ణ దేవి వందన సమర్పణ చేశారు.
***
(Release ID: 1752348)
Visitor Counter : 1045