ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

డాక్టర్ ఆర్‌ఎంఎల్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్

Posted On: 03 SEP 2021 6:35PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్ ఈ రోజు ఢిల్లీలోని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిని సంద‌ర్శించారు. ఆసుప‌త్రి ప‌ని తీరును స‌మీక్షించేందుకు గాను ఆరోగ్య మ‌రియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఈ ఆసుప‌త్రిని సంద‌ర్శించారు. కేంద్ర మంత్రి ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా అక్కడే ఉన్న మెడికల్ సూపరింటెండెంట్ మరియు ఇతర వైద్య అధికారులు గౌరవనీయ మంత్రిని స్వాగతం ప‌లికారు. మంత్రి త‌న సమీక్ష సందర్శనలో భాగంగా మొదట కోవిడ్ టీకా కేంద్రాన్ని సందర్శించి లబ్ధిదారులతో సంభాషించారు. కేంద్ర మంత్రి పీజీఐఎంఈఆర్ ఆసుప‌త్రి క్యాంపస్‌ లైబ్రరీని, హాస్పిటల్ వంటగదిని కూడా తనిఖీ చేశారు. ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. ఆరోగ్య మ‌రియు కుటుంబ సంక్షేమ శాఖ స‌హాయ మంత్రి ఆసుపత్రిలో నెఫ్రాలజీ విభాగం ఐసీయుని సందర్శించారు. ఎముక విభాగం వార్డును తనిఖీ చేస్తున్నప్పుడు అక్కడ చేరుకున్నవ వారి రోగుల బాగోగుల గురించి ఆమె అడిగి తెలుసుకున్నారు. సందర్శన ముగింపులో భాగంగా రోగులకు ఉత్తమ సౌకర్యాలు మరియు ఆసుపత్రిలో ఉత్తమ సంరక్షణ, పరిశుభ్రత సేవ‌ల కోసం త‌గిన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆమె మెడికల్ సూపరింటెండెంట్‌ని ఆదేశించారు.


- నెఫ్రాలజీ విభాగం, ఐసీయు మరియు ఎముక విభాగం యొక్క వార్డ్‌లో మంత్రి తనిఖీ

- పీజీఐఎంఈఆర్ క్యాంపస్‌లోని లైబ్రరీని తనిఖీ చేస్తున్న మంత్రి
 
- ఆసుపత్రిలో ఉన్న వంటగదిని తనిఖీ చేసి ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేస్తున్న మంత్రి

                               

*****


(Release ID: 1751899) Visitor Counter : 148


Read this release in: English , Urdu , Marathi , Hindi