రైల్వే మంత్రిత్వ శాఖ
భారతీయ రైల్వేలు 156 కి పైగా హాస్పిటల్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (హెచ్‌ఎంఐఎస్) ని భారతీయ రైల్వేలో అందుబాటులోకి తెచ్చాయి.
బ్యాలెన్స్ హెల్త్ సదుపాయాలపై త్వరలో హెచ్‌ఎంఐఎస్‌యొక్క వేగవంతమైన విస్తరణ
వేగవంతమైన మరియు అవాంతరాలు, ఇబ్బందులు లేని ఆరోగ్య సంరక్షణను అందించడానికి మొత్తం రైల్వే ఆరోగ్య వ్యవస్థను ఒకే నిర్మాణంలో తీసుకువచ్చే ప్రయత్నమే హెచ్‌ఎంఐఎస్ అమలు
రైల్వేలోని మొత్తం 11,76,300 మంది ఉద్యోగులలో, 11,24,058 మంది హెచ్‌ఎంఐఎస్‌లో నమోదు చేయబడ్డారు
భారతీయ రైల్వే నిర్వహించే ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలలో హెచ్‌ఎంఐఎస్ నమూనా మార్పును తీసుకురానుంది.
Posted On:
03 SEP 2021 5:18PM by PIB Hyderabad
ప్రస్తుత ఐటి యుగంలో డిజిటలైజ్డ్ హెల్త్‌కేర్ అవాంతరాలు లేని సేవలను అందించడం ప్రస్తుత అవసరం. దీనిని దృష్టిలో ఉంచుకుని రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన మినీరత్న పిఎస్‌యు రైల్ టెల్ మరియు ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే సి-డాక్-ఏ యూనిట్ (ఇ శుస్రూత్), పాన్ ఇండియా హాస్పిటల్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (హెచ్‌ఎంఐఎస్) అమలు చేసే బాధ్యతను అప్పగించారు. 129 రైల్వే ఆసుపత్రులు మరియు 586 ఆరోగ్య విభాగాలలో వేగవంతమైన, అవాంతరాలు మరియు ఇబ్బంది లేని ఆరోగ్య సంరక్షణను అందించడానికి మొత్తం రైల్వే ఆరోగ్య వ్యవస్థను ఒకే నిర్మాణంలో తీసుకురావడానికి ఈ కార్యక్రమం చేపట్టారు.
రైల్వేలోని మొత్తం 11,76,300 మంది ఉద్యోగులలో నమోదిత ఉద్యోగ లబ్ధిదారుల సంఖ్య 11,24,058. జారీ చేయబడిన మొత్తం హెచ్‌ఎంఐఎస్ ఉద్యోగి కార్డులు 10,33,143. రైల్వేలోని మొత్తం 16,52,082 పెన్షనర్లలో రిజిస్టర్డ్ పెన్షనర్ల లబ్ధిదారులు 4,83,592. మొత్తం హెచ్‌ఎంఐఎస్ పెన్షనర్ లబ్ధిదారుల కార్డులు 3,75,440 జనరేట్ చేయబడ్డాయి. ఉద్యోగులపై సగటున 3-4 ఆధారపడి ఉంటారు. మరియు పెన్షనర్లు 2-3 డిపెండెంట్లను కలిగి ఉంటారు.
హెచ్‌ఎంఐఎస్ ఇప్పటికే భారతీయ రైల్వేలలో 156 ఆరోగ్య సౌకర్యాలను ఏర్పాటు చేసింది. బ్యాలెన్స్ హెల్త్ సదుపాయాలపై మరింత వేగవంతమైన విస్తరణ 2021 లో చేయబడుతుంది.
హెచ్‌ఎంఐఎస్ సొల్యూషన్ క్లినికల్ కేర్ మరియు హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ యొక్క మొత్తం వ్యవస్థ రైల్వే హాస్పిటల్స్‌కు సంబంధించిన 20 మాడ్యూల్స్‌తో కవర్ చేస్తుంది. మాడ్యూల్స్ ఓపిడి, ఐపిడి, ల్యాబ్‌లు, ఓటి, బ్లడ్ బ్యాంక్, ఫార్మసీ, రిఫరల్స్, మెడికల్ ఎగ్జామినేషన్స్ మరియు మెడికల్ క్లెయిమ్‌ల రీయింబర్స్‌మెంట్ మొదలైన హాస్పిటల్ మేనేజ్‌మెంట్ యొక్క కోర్ మరియు అనుబంధ అవసరాలు రెండింటినీ కవర్ చేస్తాయి.
వైద్య లబ్ధిదారులకు సాధికారత కల్పించడానికి మొబైల్ యాప్ కూడా అభివృద్ధి చేయబడింది. రోగులు ఎక్కడి నుండైనా తమ ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్ (ఈఎంఆర్) ని యాక్సెస్ చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది. టెలి-కన్సల్టేషన్, ల్యాబ్ రిపోర్ట్ యాక్సెస్, రోగికి పంపిణీ చేయబడిన మందులు మొదలైన సదుపాయాలు కూడా ఈ యాప్ ద్వారా అందించబడతాయి. స్వీయ నమోదు ఫీచర్ కూడా ఈ యాప్‌లో అందుబాటులో ఉంది.
ఈ వ్యవస్థ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ డిజిటల్ హెల్త్ మిషన్ ప్రోగ్రామ్‌తో పూర్తిగా అనుసంధానించబడి ఉంది. హెచ్‌ఎంఐఎస్ ఇండియన్ రైల్వే యొక్క ప్రత్యేకమైన మెడికల్ ఐడీ (యుఎంఐడి), ఐ-పాస్ మరియు ఎఆర్‌పిఎఎన్ మొదలైన అనేక ఇతర డిజిటల్ కార్యక్రమాలతో సమకాలీకరించబడింది. అలాగే అవసరానికి అనుగుణంగా మరింత అనుసంధానం చేయగల సామర్థ్యం కూడా ఉంది.
రైల్వే హెల్త్‌కేర్ లబ్ధిదారుల ప్రత్యేక మెడికల్ ఐడి (యుఎంఐడి) ద్వారా అందుబాటులో ఉండే హెల్త్ డేటా డిజిటలైజేషన్ హెల్త్‌కేర్ సేవలకు ఇబ్బంది లేకుండా మరియు పారదర్శకంగా చేస్తుంది. హెచ్‌ఎంఐఎస్ యాప్‌లోని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా రోగి ఓపిడి అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. ఇది సుమారు 10 మిలియన్ల మంది రైల్వే ఆరోగ్య లబ్ధిదారులకు సంరక్షణ మరియు ఆరోగ్య సేవలలో మెరుగుదలను అందిస్తుంది.
***
(Release ID: 1751874)