| 
                        జల శక్తి మంత్రిత్వ శాఖ
                         
                         
                        
                            15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం, 2021-22 నుండి 2025-26 వరకు 
                         
                        
                         
                        
                            నీరు, పారిశుధ్యం కోసం రూ.1.42 లక్షల కోట్ల గ్రాంటు పంచాయితీలకు అనుసంధానం  ప్రతి ఇంటికి కుళాయి నీటి సరఫరా, గ్రామాలలో పారిశుద్ధ్యం మెరుగుపరచడానికి పెద్దపీట -  గ్రామ పంచాయతీలు స్థానిక ప్రజోపయోగ కార్యక్రమాలు అమలు చేస్తాయి 
                          
                        
                         
                        
                            Posted On:
                        29 AUG 2021 5:00PM by PIB Hyderabad
                         
                        
                         
                        
                            
2021–22 నుండి 2025-26 వరకు ఐదు సంవత్సరాల పాటు నీరు, పారిశుధ్యం కోసం గ్రామీణ స్థానిక సంస్థలు (ఆర్‌ఎల్‌బిలు)/ పంచాయితీలకు పదిహేనవ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన రూ.1,42,084 కోట్ల టై గ్రాంట్, సేవలకు భరోసా ఇవ్వడంలో, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజారోగ్యం, మెరుగైన జీవన ప్రమాణాల దిశగా భారీగా ప్రభావితం చేయనున్నాయి.  . 15 వ ఆర్థిక సంఘం టై గ్రాంట్లు గ్రామ పంచాయితీలకు నీటి సరఫరా మరియు పారిశుధ్య సంబంధిత ప్రణాళికలను అమలు చేయడానికి మరిన్ని నిధులను నిర్ధారిస్తుంది. గ్రామ పంచాయితీలు 'సేవా బట్వాడా'పై దృష్టి సారించి స్థానిక 'ప్రజా ప్రయోజనాలు' వలె పనిచేయగలవు. భారత రాజ్యాంగంలోని 73 వ సవరణకు అనుగుణంగా స్థానిక స్వపరిపాలనను బలోపేతం చేయడానికి ఇది ఒక పెద్ద ముందడుగు.  
2021–22 నుండి 2025-26 మధ్య కాలంలో ఆర్‌ఎల్‌బిలు/ పిఆర్‌ఐల కోసం 15 వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన గ్రాంట్‌ల విడుదల, వినియోగానికి  కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యయ విభాగం,  మార్గదర్శకాలను విడుదల చేసింది. 'నీరు, పారిశుధ్యం సంబంధించి 15 వ ఆర్థిక సంఘం టై గ్రాంట్' కోసం గ్రామీణ స్థానిక సంస్థల అర్హతను నిర్ణయించడానికి కేంద్ర ప్రభుత్వ జల శక్తి మంత్రిత్వ శాఖ తాగునీరు, పారిశుద్ధ్య విభాగం(డిడిడబ్ల్యుఎస్) నోడల్ డిపార్ట్‌మెంట్‌గా వ్యవహరిస్తుంది.  
నీరు, పారిశుద్ధ్య కార్యకలాపాల కోసం 25 రాష్ట్రాలకు మొదటి విడత మంజూరు చేసిన గ్రాంట్‌ను విడుదల చేయాలని, ఆర్‌ఎల్‌బిలు/ పిఆర్‌ఐలకు బదిలీ చేయాలని తాగునీరు, పారిశుధ్య శాఖ సిఫార్సు చేసింది. కేంద్ర ప్రభుత్వం రూ.50 వేల కోట్ల బడ్జెట్ మద్దతుతో, జల జీవన్ మిషన్ కోసం రూ.30 వేల కోట్ల రాష్ట్ర వాటా, ఈ సంవత్సరం కేటాయింపు, నీరు, పారిశుధ్యం కోసం 15 వ టైడ్ గ్రాంట్ కింద 28 వేల కోట్లు వెరసి గ్రామాల్లో పైపుల ద్వారా నీటి సరఫరా చేయడానికి ఒక లక్ష కోట్లకు పైగా నిధులు అందుబాటులో ఉన్నాయి. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై భారీగా మంచి ప్రభావాన్ని చూపుతుంది. 
15 వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన విధంగా  ఆర్‌ఎల్‌బిలు/పంచాయితీలు తమ విధులు నిర్వర్తించడంలో సహాయపడటానికి, రాష్ట్ర నీటి, పారిశుధ్యం/ గ్రామీణ నీటి సరఫరా/ పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగాలు ఈ పంచాయితీలు/ ఆర్‌ఎల్‌బిలకు సాంకేతిక సహాయం అందిస్తాయి. ఆర్‌ఎల్‌బిలు/ పంచాయితీలను సరళీకృతం చేయడానికి, సహాయం చేయడానికి, తాగునీరు & పరిశుభ్రత విభాగం, జల శక్తి మంత్రిత్వ శాఖ ఈ నిధుల వినియోగం కోసం ఒక మాన్యువల్‌ను సిద్ధం చేసింది. ఇది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అందుబాటులో ఉంచింది. మాన్యువల్‌ని స్థానిక భాషలోకి అనువదించమని వారు అభ్యర్థించారు. ఇది ప్రతి గ్రామ పంచాయతీకి అందుబాటులో ఉంచాలి. గ్రామాలలో కుళాయి నీటి సరఫరా, మెరుగైన పారిశుధ్యాన్ని నిర్ధారించడానికి ఈ నిధిని ఉపయోగించుకునేందుకు పంచాయితీ కార్యవర్గాలను చైతన్యపరచడానికి, శిక్షణ ఇవ్వడానికి మరియు శక్తివంతం చేయడానికి ఒక భారీ కార్యక్రమం చేపడుతున్నారు.  
మొత్తంగా, 2021-22 నుండి 2025-26 వరకు ఆర్‌ఎల్‌బిలు/ పిఆర్‌ఐలకు 15 వ ఆర్థిక సంఘం రూ. 2,36,805 కోట్లు సిఫార్సు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల జీవన నాణ్యతను నిర్ణయించే నీటి సరఫరా, పారిశుధ్యం జాతీయ ప్రాధాన్యతా అంశాలుగా కమిషన్ గుర్తించింది. ఇది 60% కేటాయింపులను  ఆర్‌ఎల్‌బిలు/ పంచాయితీలకు సిఫార్సు చేసింది, అంటే రూ. 1,42, 084 కోట్లు టై గ్రాంట్‌ను ఎ) తాగునీటి సరఫరా, వర్షపు నీటి సేకరణ, నీటి రీసైక్లింగ్; బి) బహిరంగ మల విసర్జన రహిత (ఓడిఎఫ్) పరిశుభ్రత, నిర్వహణకు వినియోగిస్తారు. నీటి సరఫరా, పారిశుద్ధ్య సేవలకు సంవత్సరం వారీగా కేటాయించిన గ్రాంట్ల కేటాయింపు క్రింది విధంగా ఉన్నాయి: 
(నిధులు రూ. కోట్లలో) 
	
		
			| 
			 సంవత్సరం  
			 | 
			
			 అనుసంధానించిన గ్రాంట్  
			 | 
		 
		
			| 
			 2021-22 
			 | 
			
			 26,940 
			 | 
		 
		
			| 
			 2022-23 
			 | 
			
			 27,908 
			 | 
		 
		
			| 
			 2023-24 
			 | 
			
			 28,212 
			 | 
		 
		
			| 
			 2024-25 
			 | 
			
			 29,880 
			 | 
		 
		
			| 
			 2025-26 
			 | 
			
			 29,144 
			 | 
		 
		
			| 
			   
			 | 
			
			 1,42,084 
			 | 
		 
	
 
  
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆశయం ప్రతి ఇంటికి తాగునీటి సరఫరా, మెరుగైన పారిశుద్ధ్యం సాకారం చేయడానికి  గ్రామీణ ప్రాంతాల్లో ఈ రెండు ప్రాథమిక సేవలను నిర్ధారించడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో భాగస్వామ్యంతో పనిచేస్తోంది. తగినంత స్థాయిలో తాగునీటి లభ్యత, గృహ స్థాయిలో నిర్దేశిత నాణ్యత క్రమబద్ధమైన మరియు దీర్ఘకాలిక ప్రాతిపదికన, మరియు మెరుగైన పారిశుధ్యం...  ప్రజారోగ్యం, ప్రజల మెరుగైన సామాజిక-ఆర్థిక పరిస్థితిపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. మౌలికంగా నీటి సరఫరా, పారిశుధ్య సేవలను నిర్ధారించడానికి, 15 వ ఆర్థిక సంఘం ద్వారా గణనీయమైన మొత్తాన్ని వాటికి కేటాయించడం మౌలిక సదుపాయాల  కల్పనలో పెద్ద అడుగు. 
ఆగస్టు 2019 నుండి, జల్ జీవన్ మిషన్ (జెజెఎం) రాష్ట్రాల భాగస్వామ్యంతో అమలవుతోంది.ఏ ఒక్కరికి కుళాయి నీరు లేదని అనకుండా, ప్రతి గ్రామీణ ఇంటికీ కుళాయి నీటి సరఫరా అందించడానికి రూ. 3.60 లక్షల కోట్లు కేటాయింపు జరిగింది. ప్రతి గ్రామీణ గృహానికి సరసమైన సర్వీస్ డెలివరీ ఛార్జీల వద్ద క్రమం తప్పకుండా, దీర్ఘకాలిక ప్రాతిపదికన తాగునీటి సరఫరాను పొందడానికి వీలు కల్పిస్తుంది, తద్వారా జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది.  
గత ఏడు సంవత్సరాలలో, గ్రామాలు బహిరంగ మల విసర్జన రహిత (ఓడిఎఫ్) గా మారడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరిగాయి. ఈ ప్రయత్నాలను సుస్థిరంగా కొనసాగించడానికి స్వచ్ఛ భారత్ మిషన్ (ఎస్బిఎం) రెండవ దశ అమలులో ఉంది. ఘాన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ రహిత గ్రామాలు, మరియు గ్రామాల  ఓడిఎఫ్   స్థితిని నిర్ధారించడంపై దృష్టి సారించారు. 
గత 20 నెలల్లో, కోవిడ్ -19 మహమ్మారి సమయంలో ప్రజారోగ్యం ప్రాముఖ్యత విస్తృతంగా గుర్తించబడింది. అందువల్ల, మన గ్రామాల్లో పరిశుభ్రమైన తాగునీరు, మెరుగైన పారిశుధ్యం అందించడం చాలా ముఖ్యం. ఈ సేవలను పొందడం, అలాగే నీటి ద్వారా వచ్చే వ్యాధులను నియంత్రించడం ద్వారా ప్రజారోగ్యానికి  బాసటగా నిలిచేందుకు 15 వ ఆర్ధిక సంఘం టైడ్ గ్రాంట్ గ్రామీణ ప్రాంతాలకు ఒక వరంగా మారాయి. 
నీరు, పారిశుధ్యం కోసం టైడ్ గ్రాంట్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి, రాష్ట్రాలు నోడల్ విభాగాలను గుర్తించాలి. 15 వ ఆర్థిక సంఘం కాలంలో మార్గదర్శకాల ప్రకారం వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఇంకా, గ్రామీణ స్థానిక సంస్థలు/ పంచాయితీ రాజ్ సంస్థల ప్రజలకు టై-గ్రాంట్లు, దాని విడుదల, మరియు వినియోగం, ప్రణాళిక, అమలు, పని, ఆడిట్, అకౌంటింగ్ మొదలైన వాటిపై పెద్ద ఎత్తున శిక్షణ కార్యక్రమం నిర్వహించాలి. దీని కోసం, జాతీయ జల జీవన్ మిషన్, తాగునీరు, పారిశుద్ధ్య విభాగం 84 ప్రముఖ సంస్థలను కీలక వనరుల కేంద్రాలుగా (కేఆర్సి) ఎంపిక చేసింది.   
గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య సేవలపై పునరావృతమయ్యే ఖర్చులను తీర్చడానికి వరుసగా వచ్చే ఆర్థిక సంఘాల సిఫార్సులకు అనుగుణంగా గృహాల నుంచి  సేవా ఛార్జీలను తిరిగి పొందడానికి రాష్ట్రాలలో బలమైన 'ఆపరేషన్ మరియు మెయింటెనెన్స్' విధానాన్ని అమలు చేయడంపై దృష్టి పెట్టడం జరిగింది. రాజ్యాంగంలోని 73 వ సవరణ ప్రకారం, పంచాయతీల ప్రధాన విధుల్లో ఒకటిగా పరిగణించబడే గ్రామాలలో ఈ రెండు ప్రాథమిక సేవలను నిర్వహించడానికి గ్రామ పంచాయతీలకు అధికారం ఉంది. గాంధీజీ 'గ్రామ స్వరాజ్' కి అనుగుణంగా గ్రామ పంచాయితీలు స్థానిక స్వపరిపాలనను పునర్నిర్వచించటానికి ఈ టైడ్ గ్రాంట్ ఒక సువర్ణ అవకాశాన్ని అందించింది. ఇది అట్టడుగు స్థాయిలో 'బాధ్యతాయుతమైన మరియు ప్రతిస్పందించే నాయకత్వాన్ని' అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. ఈ సాధికారత ప్రక్రియ గత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశాన్ని ఉద్దేశించి ప్రధాని ప్రసంగంలో ప్రకటించిన ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ మరియు సబ్కా ప్రయాస్’ అనే నినాదానికి అనుగుణంగా ఉంటుంది. 
నీరు మరియు పరిశుభ్రత కోసం 15 వ ఆర్థిక సంఘం మంజూరు చేసిన ప్రధాన లక్ష్యం   ఆర్‌ఎల్‌బిలు/ గ్రామ పంచాయితీలు ప్రతి ఇంటికి, పాఠశాలలకు, అంగన్‌వాడీ కేంద్రాలకు, ఆశ్రమ శాలాలకు, పిహెచ్సిలు/ సిహెచ్సీలు, కమ్యూనిటీ కేంద్రాలు, మార్కెట్ స్థలాలకు, త్రాగునీటి సరఫరా బాధ్యతను స్వీకరించడం.  
  
*** 
 రాష్ట్రాల వారీ  ఆర్‌ఎల్‌బిలు/పిఆర్ఐలకు  నీరు ,పారిశుద్ధ్యం కోసం టైడ్ గ్రాంట్  
(2021-22 నుండి 2025-26) 
(నిధులు రూ.కోట్లలో ) 
	
		
			| 
			 # 
			 | 
			
			 రాష్ట్రం  
			 | 
			
			 2021-22 
			 | 
			
			 2022-23 
			 | 
			
			 2023-24 
			 | 
			
			 2024-25 
			 | 
			
			 2025-26 
			 | 
			
			 మొత్తం  
			 | 
		 
		
			| 
			 1. 
			 | 
			
			 ఆంధ్రప్రదేశ్  
			 | 
			
			 1,164 
			 | 
			
			 1,206 
			 | 
			
			 1,218 
			 | 
			
			 1,292 
			 | 
			
			 1,260 
			 | 
			
			 6,138 
			 | 
		 
		
			| 
			 2. 
			 | 
			
			  అరుణాచల్ ప్రదేశ్  
			 | 
			
			 102 
			 | 
			
			 106 
			 | 
			
			 108 
			 | 
			
			 114 
			 | 
			
			 112 
			 | 
			
			 540 
			 | 
		 
		
			| 
			 3. 
			 | 
			
			 అసోం  
			 | 
			
			 712 
			 | 
			
			 736 
			 | 
			
			 744 
			 | 
			
			 790 
			 | 
			
			 770 
			 | 
			
			 3,752 
			 | 
		 
		
			| 
			 4. 
			 | 
			
			 బీహార్  
			 | 
			
			 2,226 
			 | 
			
			 2,306 
			 | 
			
			 2,330 
			 | 
			
			 2,468 
			 | 
			
			 2,408 
			 | 
			
			 11,736 
			 | 
		 
		
			| 
			 5. 
			 | 
			
			 ఛత్తీస్గఢ్  
			 | 
			
			 646 
			 | 
			
			 668 
			 | 
			
			 676 
			 | 
			
			 716 
			 | 
			
			 698 
			 | 
			
			 3,402 
			 | 
		 
		
			| 
			 6. 
			 | 
			
			 గోవా  
			 | 
			
			 34 
			 | 
			
			 34 
			 | 
			
			 34 
			 | 
			
			 38 
			 | 
			
			 36 
			 | 
			
			 176 
			 | 
		 
		
			| 
			 7. 
			 | 
			
			 గుజరాత్ 
			 | 
			
			 1,418 
			 | 
			
			 1,468 
			 | 
			
			 1,484 
			 | 
			
			 1,572 
			 | 
			
			 1,534 
			 | 
			
			 7,474 
			 | 
		 
		
			| 
			 8. 
			 | 
			
			 హర్యానా   
			 | 
			
			 562 
			 | 
			
			 580 
			 | 
			
			 588 
			 | 
			
			 622 
			 | 
			
			 606 
			 | 
			
			 2,958 
			 | 
		 
		
			| 
			 9. 
			 | 
			
			 హిమాచల్ ప్రదేశ్  
			 | 
			
			 190 
			 | 
			
			 198 
			 | 
			
			 200 
			 | 
			
			 212 
			 | 
			
			 206 
			 | 
			
			 1,004 
			 | 
		 
		
			| 
			 10. 
			 | 
			
			 ఝార్ఖండ్  
			 | 
			
			 750 
			 | 
			
			 776 
			 | 
			
			 784 
			 | 
			
			 832 
			 | 
			
			 810 
			 | 
			
			 3,952 
			 | 
		 
		
			| 
			 11. 
			 | 
			
			 కర్ణాటక  
			 | 
			
			 1,426 
			 | 
			
			 1,478 
			 | 
			
			 1,494 
			 | 
			
			 1,582 
			 | 
			
			 1,544 
			 | 
			
			 7,524 
			 | 
		 
		
			| 
			 12. 
			 | 
			కేరళ 
			   
			 | 
			
			 722 
			 | 
			
			 748 
			 | 
			
			 756 
			 | 
			
			 800 
			 | 
			
			 780 
			 | 
			
			 3,806 
			 | 
		 
		
			| 
			 13. 
			 | 
			
			 మధ్యప్రదేశ్  
			 | 
			
			 1,766 
			 | 
			
			 1,830 
			 | 
			
			 1,850 
			 | 
			
			 1,960 
			 | 
			
			 1,912 
			 | 
			
			 9,316 
			 | 
		 
		
			| 
			 14. 
			 | 
			
			 మహారాష్ట్ర  
			 | 
			
			 2,584 
			 | 
			
			 2,676 
			 | 
			
			 2,706 
			 | 
			
			 2,866 
			 | 
			
			 2,796 
			 | 
			
			 13,628 
			 | 
		 
		
			| 
			 15. 
			 | 
			
			 మణిపూర్  
			 | 
			
			 78 
			 | 
			
			 82 
			 | 
			
			 82 
			 | 
			
			 88 
			 | 
			
			 86 
			 | 
			
			 414 
			 | 
		 
		
			| 
			 16. 
			 | 
			
			 మేఘాలయ  
			 | 
			
			 82 
			 | 
			
			 84 
			 | 
			
			 84 
			 | 
			
			 90 
			 | 
			  | 
		 
	
 
 
 
                         
                        
                         
                        
                         
                        
                            (Release ID: 1750290)
                         
                        
                         
                     |