మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
75 సంవత్సరాల దేశ స్వాతంత్ర్య ఉత్సవాలు "అమృత్ మహోత్సవ్ " లో భాగంగా ఈరోజు న్యూఢిల్లీలో "మేరా వతన్, మేరా చమన్" "ముషాయిరా" నిర్వహించిన కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.
"ముషాయిరా", "కవి సమ్మేళనం" అనేవి మన దేశ గొప్ప అద్భుతమైన సాంస్కృతిక వారసత్వం లో ఒక భాగంగా ఉన్నాయి: శ్రీ ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ
భారతదేశ "భిన్నత్వంలో ఏకత్వం", దేశ సంస్కృతి, నాగరికత, మర్యాదలకు తార్కాణంగా ఇవి ఉంటాయి : శ్రీ ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ
Posted On:
28 AUG 2021 7:37PM by PIB Hyderabad
కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో "మేరా వాటన్, మేరా చమన్" "ముషాయిరా" ను నిర్వహించింది.దేశానికి స్వాతంత్ర్యం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న "అమృత్ మహోత్సవ్" లో భాగంగా దేశంలోని ప్రఖ్యాత కవులు తమ కవితలు మరియు ద్విపదలతో ప్రేక్షకులను అలరించి మంత్రముగ్దులను చేశారు.
స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగాలను స్మరిస్తూ "భారతదేశ స్వాతంత్ర్య 75 సంవత్సరాల వేడుకల" పై ఈ ప్రఖ్యాత కవులు తమ కవితలు మరియు ద్విపదలను వినిపించారు. ముషాయిరాలో తమ కవితల ద్వారా వారు విభజన వల్ల కలిగిన నష్టాలపై ప్రజలకు అవగాహన కలిగించారు.
కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2023 వరకు దేశవ్యాప్తంగా "మేరా వాటన్, మేరా చమన్" "ముషాయిరా" మరియు "కవి సమ్మేళనం" లను నిర్వహిస్తుంది.వీటిలో ప్రఖ్యాత, ఔత్సాహిక కవులు దేశ స్వాతంత్ర్య ఉద్యమానికి సంబంధించిన జ్ఞాపకాలను తమ కవితల ద్వారా సందేశాలు వినిపించే విధంగా ఈ కార్యక్రమాలను రూపొందించారు.
ప్రఖ్యాత కవులు శ్రీ వసీం బరెల్వి, మొహతర్మ షబీనా అదీబ్, శ్రీ మంజార్ భోపాలి, డాక్టర్ వి పి సింగ్, మొహతర్మ సభా, బలరాం పూరి, శ్రీ హసీబ్ సోజ్, డా. ఐజాజ్ పాపులర్ మీరూతి, సర్దార్ సురేంద్ర సింగ్ షాజర్, శ్రీ సికందర్ హయత్ గద్బాద్, శ్రీ ఖుర్షీద్ హైదర్, శ్రీ అకీల్ నోమాని , డాక్టర్ అబ్బాస్ రజా నయ్యర్ జలాల్‌పురిలు ప్రేక్షకులను అలరించారు.
కార్యక్రమాన్ని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి శ్రీ ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ నఖ్వీ మాట్లాడుతూ "ముషాయిరా", "కవి సమ్మేళనం"లు దేశ సాంస్కృతిక వారసత్వం లో భాగంగా ఉన్నాయని అన్నారు.ఇవి భారతదేశ "భిన్నత్వంలో ఏకత్వం", దేశ సంస్కృతి, నాగరికత, మర్యాదలకు తార్కాణంగా ఉంటాయని పేర్కొన్నారు. "ముషాయిరా" వంటి కార్యక్రమాలు శాంతి , సామాజిక సామరస్య ప్రాధాన్యతను గుర్తు చేస్తాయని మంత్రి అన్నారు. నూతన స్వయం సమృద్ధ భారతదేశ నిర్మాణానికి జరుగుతున్న ప్రయత్నాలు, దీని సాధనకు చిత్తశుద్ధితో సాగుతున్న ప్రయత్నాలకు ఇటువంటి కార్యక్రమాలు ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు. భారతదేశ కళలు, సంస్కృతి పై ఇటువంటి కార్యక్రమాలు అవగాహన కల్పిస్తాయని శ్రీ నఖ్వీ అన్నారు.
రాజ్యసభ సభ్యులు శ్రీ సుధాంశు త్రివేది,సయ్యద్ జాఫర్ ఇస్లాం, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి శ్రీ సిద్ధార్థ మృదుల్, సిపిఐ నాయకులు శ్రీ అతుల్ కుమార్ అంజన్ తో సహా అన్ని వర్గాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి హాజరయ్యారు. రాజకీయ, న్యాయ, సామాజిక, వినోదం, వ్యాపార, విద్యా ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
***
(Release ID: 1750129)
Visitor Counter : 333