ఆర్థిక మంత్రిత్వ శాఖ
పన్ను చట్టాలు (సవరణ) చట్టం, 2021 ద్వారా చేసిన సవరణల కోసం నియమాలను రూపొందించడం
Posted On:
28 AUG 2021 6:33PM by PIB Hyderabad
పన్ను చట్టాలు (సవరణ) చట్టం, 2021 (2021 చట్టం), 2021 ఆగష్టు, 13వ తేదీన రాష్ట్రపతి ఆమోదం పొందింది. 2012 మే, 28వ తేదీ (అనగా, ఆర్థిక బిల్లు, 2012 రాష్ట్రపతి ఆమోదం పొందిన తేదీ) లోపు లావాదేవీ చేపట్టినట్లైతే ఏదైనా విదేశాల నుండి భారతీయ ఆస్తుల పరోక్ష బదిలీకి, ఆర్థిక చట్టం, 2012 కి చెందిన ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్-9 కి చేసిన సవరణ ఆధారంగా, భవిష్యత్తులో ఎలాంటి పన్ను డిమాండ్ చెయ్యకుండా ఇంటర్-అలియా, ఆదాయపు పన్ను చట్టం, 1961 (ఆదాయపు పన్ను చట్టం) ని సవరించడం జరిగింది.
2021 చట్టం ద్వారా చేసిన సవరణ, 2012 మే, 28వ తేదీ కి ముందు చేసిన భారతీయ ఆస్తులను పరోక్షంగా విదేశాల నుండి బదిలీ చేయాలనే డిమాండ్ (ఆర్ధిక చట్టం-2012 సెక్షన్ 119 కింద అందించిన డిమాండ్ ధ్రువీకరణతో సహా) లో పేర్కొన్న పెండింగ్‌లో ఉన్న వ్యాజ్యాన్ని ఉపసంహరించుకోవడం లేదా ఖర్చు, నష్టపరిహారం, వడ్డీ మొదలైన వాటిపై ఎలాంటి క్లెయిమ్ లేని అండర్‌కేటింగ్‌ని అందించడం వంటి ఉపసంహరణ లేదా ఫర్నిషింగ్ వంటి షరతులను దాఖలు చేసి, సూచించబడిన ఇతర షరతులు నెరవేర్చి, అమలు చేయడం ద్వారా రద్దు చేయబడుతుంది. ఈ సందర్భాలలో చెల్లించిన / సేకరించిన మొత్తాన్ని పేర్కొన్న షరతులకు అనుగుణంగా, ఎలాంటి వడ్డీ లేకుండా తిరిగి ఇవ్వబడుతుంది.
2021 చట్టం ద్వారా చేసిన సవరణ లక్ష్యం పన్ను ఖచ్చితత్వాన్ని తీసుకురావడం మరియు పేర్కొన్న షరతులకు అనుగుణంగా పెండింగ్‌లో ఉన్న ఆదాయపు పన్ను ప్రక్రియలు ఉపసంహరించబడటం. అదే విధంగా డిమాండ్, ఏవైనా ఉంటే, రద్దు చేయబడుతుంది. సేకరించిన మొత్తం ఏదైనా ఉంటే, ఎలాంటి వడ్డీ లేకుండా పన్ను చెల్లింపుదారునికి తిరిగి ఇవ్వబడుతుంది. 2021 చట్టం ద్వారా చేసిన సవరణను అమలు చేయడానికి, ఆదాయపు పన్ను నియమాలు, 1962 ను సవరించడానికి ముసాయిదా నియమాలు తయారు చేయబడ్డాయి. 2021 చట్టం ద్వారా చేసిన సవరణను అమలు చేయడానికి నెరవేర్చవలసిన పరిస్థితులు , అనుసరించాల్సిన ప్రక్రియలను ఈ ముసాయిదాలో పేర్కొనడం జరిగింది.
ప్రతిపాదిత నియమాలను కలిగి ఉన్న ముసాయిదా నోటిఫికేషన్ను పబ్లిక్-డొమైన్ లో ఉండడం జరిగింది. దీనిని www.incometaxindia.gov.in వెబ్-సైట్ లో వీక్షించవచ్చు.
ముసాయిదా నోటిఫికేషన్ పై భాగస్వాములు, ప్రజలందరి వద్ద నుండి సూచనలు / వ్యాఖ్యలు ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు తమ సూచనలు, సలహాలను ఎలక్ట్రానిక్ మాధ్యమంలో ustpl1[at]nic[dot]in ఈ-మెయిల్ ద్వారా 2021 సెప్టెంబర్, 4వ తేదీ నాటికి సమర్పించవచ్చు.
*****
(Release ID: 1750127)
Visitor Counter : 246