సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

క్విట్ ఇండియా ఉద్యమం' 79 వ వార్షికోత్సవ సందర్భంగా చరిత్ర కళ్ళకు కట్టే విధంగా ఎగ్జిబిషన్

Posted On: 28 AUG 2021 1:31PM by PIB Hyderabad

ముఖ్యాంశాలు:

* ఆజాది కా అమృత్ మహోత్సవ్ వేడుకలో భాగంగా న్యూఢిల్లీలోని నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియాలో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయబడింది.

* ఎగ్జిబిషన్ 2021  ఆగస్టు 9 నవంబర్ 8 వరకు   ఉదయం 10 నుంచి సాయంత్రం 5:30 వరకు  ప్రజలకు అందుబాటులో ఉంటుంది.

* క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో జరిగిన సంఘటనలు  ఫోటోలు, అధికారిక పత్రాలు, ఎల్ఈడీ  మ్యాప్‌ల ద్వారా  ప్రదర్శన .

దేశానికి స్వాతంత్ర్యం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా నిర్వహిస్తున్న   'ఆజాది కా అమృత్ మహోత్సవం' లో భాగంగా 'నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా లో' క్విట్ ఇండియా ఉద్యమం 'పై ప్రదర్శన ఏర్పాటు  అయ్యింది. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో క్విట్ ఇండియా ఉద్యమ  ప్రాముఖ్యతను పబ్లిక్ రికార్డులు, ప్రైవేట్ లెటర్స్, మ్యాప్‌లు, ఛాయాచిత్రాలు మరియు ఇతర సంబంధిత అంశాల  ద్వారా వివరించే ఎగ్జిబిషన్ ఏర్పాటయ్యింది. 2021 ఆగస్టు 9 న ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్ ను ప్రజలు  నవంబర్ 8 వరకు ప్రతి రోజు   ఉదయం 10 నుంచి సాయంత్రం 5:30 వరకు సందర్శించవచ్చు.
క్విట్ ఇండియా చరిత్రను ప్రదర్శించే విధంగా ఏర్పాటైన ఉద్యమంలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలను కళ్ళకు కట్టే విధంగా ఏర్పాటు చేశారు.  దిగువ చూపిన  వివిధ ఆసక్తికరమైన విభాగాలను దీనిలో ఏర్పాటు చేశారు.  

 

 

 

క్విట్ ఇండియాకు దారితీసిన  పరిస్థితులు:  
1939 లో భారత నాయకుల  అభిప్రాయాలను తీసుకోకుండా రెండవ ప్రపంచ యుద్ధంలో భారతదేశం పాల్గొంటున్నట్లు బ్రిటిష్ వారు ప్రకటించారు. దీనితో  బ్రిటిష్ ఇండియా రాష్ట్రాల నుంచి భారత నాయకులు రాజీనామాలు చేశారు. కుడివైపున క్విట్ ఇండియా ఉద్యమ నేపథ్యం చూపబడింది.

image.png


 
బ్రేక్‌డౌన్ :
క్రిప్స్ మిషన్ విఫలమైన తర్వాత ఏర్పడిన పరిస్థితిని ఎగ్జిబిషన్ లో వివరిస్తూ ప్రదర్శనలు ఏర్పాటు అయ్యాయి. క్రిప్స్ మిషన్ వైఫల్యంతో  క్విట్ ఇండియా ఉద్యమానికి బీజం పడింది.  మిషన్‌ ఒక  'పోస్ట్ డేటెడ్ చెక్' అని గాంధీజీ వ్యాఖ్యానించారు.

image.png
 క్రిప్స్ మిషన్‌పై శ్రీ మహదేవ్ దేశాయ్ తన అభిప్రాయం తెలియజేస్తూ  22 ఏప్రిల్ 1942 న రాసిన లేఖను   ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేశారు.

image.png

  
రహస్యాలు :

image.png


క్విట్ ఇండియా ఉద్యమ కాలానికి సంబంధించి కొన్ని వెలుగు చూడని, ఆసక్తికరమైన అంశాలను రహస్య పత్రాలను  ప్రదర్శనలో ఉంచి  వాటిని వెలుగు లోకి తీసుకుని రావడం జరిగింది. క్రిప్స్ మిషన్‌లో ముస్లిం లీగ్ స్థానాన్ని తెలియజేస్తూ బ్రిటిష్ ఇండియా ఇంటెలిజెన్స్ బ్యూరో కి చెందిన రహస్య పత్రం ప్రదర్శనలో ఉంది.
 
కవితలు:  


ప్రదర్శనలో ఉంచిన కవితలు, పద్యాలు సాహిత్య ప్రియులను ఆకర్షిస్తున్నాయి. విముక్తి సాధించాలన్న  భారతీయుల ఆకాంక్ష క్యా చహతే హై అనే కవిత  ద్వారా తెలుస్తుంది.

image.png

 
 
పిలుపు  :
సాధించండి  లేదా మరణించండి అంటూ మహాత్మా గాంధీ పిలుపునిచ్చారు. ఎగ్జిబిషన్‌లో ప్రదర్శిస్తున్న పత్రాల ద్వారా  మన  నాయకులు చేసిన త్యాగాలు సందర్శకులకు గుర్తుకు తెస్తాయి.   సాధించండి  లేదా మరణించండి అంటూ మహాత్మా గాంధీ ఇచ్చిన పిలుపుతో క్విట్ ఇండియా ప్రారంభం అయ్యింది. ఆ మరుసటి రోజున మహాత్మా గాంధీని అరెస్ట్ చేశారు. ఉద్యమ సమయంలో వార్తాపత్రికలు పోషించిన పాత్ర ఎగ్జిబిషన్ లో ప్రధాన ఆకర్షణగా ఉంది.

image.png
image.png
image.png

 
తిరుగుబాటు :
అనేక మంది ప్రముఖ నాయకుల అరెస్టు కావడంతో  ఉషా మెహతా, రామ్ మనోహర్ లోహియాల ఆధ్వర్యంలో రహస్య మరియు భూగర్భ రేడియో స్టేషన్ ఏర్పాటు అయ్యింది.  కారాగారాలు ఉద్యమాన్ని బంధించ లేవు అన్న వ్యాఖ్యతో ఈ ప్రదర్శన ఏర్పాటయింది.

image.png
త్యాగం:
 సైనిక మరియు పోలీసు చర్యల వల్ల  మరణించిన మరియు గాయపడిన వ్యక్తుల రికార్డులను ప్రదర్శనకు ఉంచారు. వీటి ద్వారా ఉద్యమ సమయంలో నాయకులు ప్రజలు చేసిన  త్యాగాలు పోరాట స్ఫూర్తి గుర్తుకు వస్తాయి.

image.png


 
సమాంతర పరిపాలన :
ఉత్తర ప్రదేశ్‌లోని బాలియాతో సహా దేశంలోని వివిధ ప్రాంతాలలోవెలువడిన స్వాతంత్ర్య  ప్రకటనలు  ఎగ్జిబిషన్‌లో ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి.
.
కొన్ని ఇతర ఆకర్షణలు :

image.png


ఒక వార్తా పత్రికలో విన్స్టన్ చర్చిల్ అనే పేరుతో గాడిదలను నగరంలో విడిచి పెట్టారంటూ వచ్చిన వార్త ఆ నాటి ఆసక్తికరమైన సంఘటనను చూపుతుంది.

image.png
image.png

 
కాంతులు వెదజల్లుతూ  త్రీడీ రూపంలో అలనాటి  సంఘటనలను చూపించే విధంగా ఎగ్జిబిషన్‌ వినూత్నంగా ఏర్పాటు అయ్యింది.

image.png

 
ఎల్ఈడీ   ఆధారిత ఈ  ప్రదర్శనలో ఒక సంఘటన వివరాలను తెలుసుకోవడానికి వేలితో ఆ ప్రాంతాన్ని సూచిస్తే సరిపోతుంది.  టెక్నాలజీని ఉపయోగించడంతో ప్రదర్శన మరింత  ఆసక్తికరంగా మారింది

 

(Release ID: 1750019) Visitor Counter : 1048


Read this release in: Urdu , English , Hindi , Tamil