బొగ్గు మంత్రిత్వ శాఖ

ఎన్‌సిఎల్ 3.5 కోట్ల రూపాయలతో నైపుణ్య అభివృద్ధి ప్రాజెక్టును ప్రారంభించనున్న ఎన్‌సిఎల్


ప్లాస్టిక్ ఇంజనీరింగ్‌లో ఐదు వందల మంది స్థానిక యువతకు శిక్షణ

Posted On: 28 AUG 2021 12:37PM by PIB Hyderabad

·         ఉద్యోగ-ఆధారిత నైపుణ్యాన్ని అందించడానికి ఎన్‌సిఎల్ ప్రతి ట్రైనీపై 70,000 రూపాయలను ఖర్చు చేస్తుంది

·         నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్ కింద శిక్షణకు రూపకల్పన  

·        సమర్థవంతమైన శిక్షణను అందించడానికి ఎన్‌సిఎల్ కి  సీపెట్  చెన్నై సహకారం 

బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్వహణలో మినీరత్నకంపనీగా గుర్తింపు పొందిన నార్తరన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎన్‌సిఎల్) ప్లాస్టిక్ ఇంజినీరింగ్ ట్రేడ్‌లో సంస్థ  ఉన్న ప్రాంతం, దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్న 500 మంది యువతకు శిక్షణ ఇస్తోంది.   మార్కెట్‌లో పోటీ పడి ఉద్యోగాలు పొందటానికి వీలుగా ఈ శక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.   చెన్నైలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (సీపెట్ సహకారంతో ఈ శిక్షణ నిర్వహించనున్నారు.

  కోర్సు ఫీజు, కోర్స్ మెటీరియల్, యూనిఫాం, ట్రైనింగ్ కిట్, వసతి మరియు ఇతర ఓవర్ హెడ్ ఛార్జీలతో కూడిన ఈ రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోసం ఎన్‌సిఎల్ కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ప్రతి ట్రైనీపై  70000 రూపాయలను ఖర్చు చేస్తుంది. ఎంపికైన అభ్యర్థులకు భోపాల్, గ్వాలియర్ మరియు లక్నో లో ఉన్న   సీపెట్  కేంద్రాల్లో   ప్లాస్టిక్ ప్రాసెసింగ్, ఇంజక్షన్ మోల్డింగ్, బ్లో మౌల్డింగ్, ప్లాస్టిక్ రీసైక్లింగ్ మొదలైన వాటిలో శిక్షణ ఇస్తారు. నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్ నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఈ శిక్షణా కార్యక్రమాన్ని రూపొందించారు. దీనికి నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ కమిటీ  ఆమోదం లభించింది. 

శిక్షణా కార్యక్రమాల నిర్వహణపై ఎన్‌సిఎల్ హోల్డింగ్ కంపెనీ అయిన  కోల్ ఇండియా లిమిటెడ్  సిపెట్ ల  మధ్య ఎంఒయు కుదిరింది.

అభ్యర్థులను ఎంపిక చేయడానికి    సిపెట్ తో కలిసి  ఎన్‌సిఎల్    నిగాహి మరియు ఖాడియా ప్రాజెక్ట్‌లలో రెండు రోజుల స్క్రీనింగ్ కార్యక్రమాన్ని  నిర్వహించింది.   నైపుణ్య అభివృద్ధి కార్యక్రమం కోసం  345 మంది అర్హులైన అభ్యర్థులు ఎంపికయ్యారు. మిగిలిన అభ్యర్థులు తరువాత  ఎంపిక చేస్తారు. 

కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఎన్‌సిఎల్ దాదాపు 130 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది, 2021-22 సంవత్సరంలో సిఎస్‌ఆర్ కార్యకలాపాల కోసం 132.75 కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

 మినీరత్న కంపెనీ అయిన ఎన్‌సిఎల్ సింగ్రౌలి యూనిట్ 10 అత్యంత యాంత్రిక ఓపెన్‌కాస్ట్ బొగ్గు గనులను కలిగి ఉంది.  జాతీయ బొగ్గు ఉత్పత్తిలో 15 శాతం బొగ్గును ఎన్‌సిఎల్ ఉత్పత్తి చేస్తున్నది.  గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 115 మిలియన్ టన్నులకు పైగా బొగ్గును ఎన్‌సిఎల్ ఉత్పత్తి చేసింది.

***



(Release ID: 1749901) Visitor Counter : 165


Read this release in: English , Urdu , Hindi