ఆర్థిక మంత్రిత్వ శాఖ
రాజ్‌కోట్‌లో సోదాలు నిర్వహించిన ఆదాయపు పన్ను శాఖ
Posted On:
27 AUG 2021 6:42PM by PIB Hyderabad
రాజ్‌కోట్ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ఒక గ్రూప్ పై ఆదాయపు పన్ను శాఖ 24.08.2021న సెర్చ్ అండ్ సీజర్ (సోదాలు, స్వాధీనం) ఆపరేషన్‌ను నిర్వహించింది. ఈ గ్రూపు గుజరాత్‌లోని ప్రముఖ రియల్ ఎస్టేట్ నిర్మాణం& అభివృద్ధి సంస్థలలో ఒకటి. రాజ్‌కోట్, ఆ పరిసర ప్రాంతాలలో రియల్ ఎస్టేట్, నిర్మాణం, భూ వాణిజ్య కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఈ ఆపరేషన్ సందర్భంగా సంస్థకు చెందిన 40కి పైగా ఆవరణలలో సోదాలు నిర్వహించారు.
ఈ సెర్చ్ అండ్ సీజర్ ఆపరేషన్ సందర్భంగా గ్రూపుకు లెక్కల్లోకి రాని లావాదేవీలలో జోక్యం ఉందని రుజువు చేసే అనేక పత్రాలు, విడి షీట్లు, డిజిటల్ సాక్ష్యాలు తదితరాలను శాఖ స్వాధీనం చేసుకుంది. నిత్యం ఉపయోగించే అకౌంట్ పుస్తకాల ఆవల జరిగిన లావాదేవీలు, లెక్కల్లోకి రాని నగదు ఖర్చులు, అందుకున్న నగదు అడ్వాన్సులు, నగదు రూపంలో చెల్లించిన వడ్డీలకు సంబంధించి తగిన ఆధారాలు లభ్యం అయ్యాయి. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులలో భాగంగా, ఫ్లాట్లకు, షాపులు, భూమికి సంబంధించిన ఒప్పందాలలో నగదు రూపంలో చెల్లింపులకు ఆధారాలు లభించాయి. వివిధ ప్రాజెక్టులకు సంబంధించి మొత్తం రూ. 350 కోట్ల మేరకు నగదు రసీదులు, ధృవీకృత ఆధారాలతో వెలుగులోకి వచ్చాయి. అంతేకాకుండా, సుమారు రూ. 154 కోట్ల విలువైన భూమి కొనుగోలుకు సంబంధించి రుజువులు కనుగొన్నారు. ఇందులో రూ. 144 కోట్లను నగదు రూపంలో చెల్లించారు.
మొత్తం మీద ఈ సెర్చ్ అండ్ సీజర్ ఆపరేషన్‌లో రూ. 300 కోట్లకు పైగా ఆదాయాన్ని దాచి ఉంచిన విషయం వెల్లడైంది. ఈ వ్యవహారం గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతోంది, ఇంకా కొనసాగి ఉండేది. వివిధ ఆవరణల నుంచి రూ. 6.40 కోట్ల నగదు, రూ.1.70 కోట్ల ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అదనంగా, రూ. 4 కోట్ల మేరకు ప్రామిసరీ నోట్లను కనుగొని, స్వాధీనం చేసుకున్నారు. సోదాలలో 25 లాకర్లను కనుగొని, వాటిని స్తంభింపచేశారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.
అదనపు దర్యాప్తులు కొనసాగుతున్నాయి.
(Release ID: 1749758)
Visitor Counter : 153