పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

హిమాచల్ ప్రదేశ్‌లో విమానయాన మౌలిక సదుపాయాల‌ బలోపేతానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాసిన శ్రీ జ్యోతిరాదిత్య సింధియా

Posted On: 26 AUG 2021 8:02PM by PIB Hyderabad

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో విమానయాన మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి గాను వ్యక్తిగత జోక్యాన్ని క‌న‌బ‌ర‌చాల‌ని కోరుతూ.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జై రామ్ ఠాకూర్‌కు కేంద్ర‌
కేంద్ర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం సింధియా ఒక లేఖ రాశారు. దేశంలో విమాన‌యాన రంగానికి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చ‌డానికి వీలుగా ఏఏఐ రానున్న 4-5 సంవత్సరాలలో రూ.20,000 కోట్ల నిధుల‌తో విమానాశ్రయాల అభివృద్ధి మరియు విస్తరణను చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించింది. హిమాచల్ ప్రదేశ్‌లో విమానయాన రంగానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టుల అమలును ప్రభావితం చేస్తున్న ఈ కింది సమస్యలపై కేంద్ర మంతి శ్రీ సింధియా, ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి శ్రీ జై రామ్ ఠాకూర్ దృష్టికి తీసుకువెళ్లారు:
రన్‌వే బలోపేతం మరియు ఏఏఐ రెసిడెన్షియల్ కాలనీ నిర్మాణానికి సిమ్లా విమానాశ్రయంలో 13 ఎకరాల భూమి అవసరమని ఏఏఐ అంచనా వేసింది ఈ విష‌యంలో చొర‌వ చూపాల‌ని కేంద్ర మంత్రి కోరారు.
- దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం అడ్డంకులను తొలగించడానికి మరియు సిమ్లా విమానాశ్రయాన్ని ఏటీఆర్‌-72 రకం విమానాల నిర్వహణకు అనుకూలంగా తీర్చిదిద్దేందుకు గాను అవసరమైన భూమిని కేటాయించేలా మద్దతు అందించ‌లాని అభ్యర్థించబడింది.
- రాష్ట్ర ప్రభుత్వం సిమ్లా, మండి, మనాలి మరియు బద్దిలో మౌలిక సదుపాయాల పనులను త్వరగా పూర్తి చేయాలని అభ్యర్థించారు.
- ప్రాంతీయ ఎయిర్ కనెక్టివిటీ ఫండ్ ట్రస్ట్ (ఆర్ఏసీఎఫ్‌టీ) కోసం వీజీఎఫ్ వాటాగా రాష్ట్ర ప్రభుత్వం 1.44 కోట్లు బకాయి ఉంది. దీనిని వెంట‌నే ప‌రిష్క‌రించేలా చూడాల‌ని కోర‌డ‌మైంది. 

***

 


(Release ID: 1749405) Visitor Counter : 148


Read this release in: English , Urdu , Hindi