పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రాష్ట్రంలో విమాన రంగ మౌలిక స‌దుపాయాల‌ను బ‌లోపేతం చేయ‌వ‌ల‌సిందిగా జార్ఖండ్ ముఖ్య‌మంత్రికి లేఖ రాసిన జ్యోతిరాదిత్య సింధియా

प्रविष्टि तिथि: 26 AUG 2021 8:03PM by PIB Hyderabad

రాష్ట్రంలో విమాన‌యాన మౌలిక స‌దుపాయాల‌ను త్వ‌రిత‌గ‌తిన బ‌లోపేతం చేసేందుకు వ్య‌క్తిగ‌తంగా చొర‌వ తీసుకోవ‌ల‌సిందిగా జార్ఖండ్‌ ముఖ్య‌మంత్రి హేమంత్ సొరేన్‌కు కేంద్ర విమాన‌యాన మంత్రి జోత్యిరాదిత్య ఎం. సింధియా లేఖ రాశారు. దేశంలో పెరుగుతున్న ప్ర‌యాణీకుల డిమాండ్‌ను తీర్చ‌డానికి రానున్న 4-5 ఏళ్ళ‌లో రూ. 20,000 కోట్ల వ్య‌యంతో దేశంలోని విమానాశ్ర‌యాల అభివృద్ధిని, విస్త‌ర‌ణ‌ను ఎఎఐ చేప‌ట్టింది.  
విమాన‌యాన రంగానికి సంబంధించిన ప్రాజెక్టుల అమ‌లును ప్ర‌భావితం చేస్తున్న అంశాల‌ను సింధియా ముఖ్య‌మంత్రి హేమంత్ సొరేన్  దృష్టికి తెచ్చారు. సింధియా పేర్కొన్న అంశాలుః
* రాంచీ విమానాశ్ర‌యం కోసం 504.6 ఎక‌రాల‌ను కేటాయించ‌వ‌ల‌సిందిగా ఎఎఐ కోరింది. అయితే, రాష్ట్ర ప్ర‌భుత్వం ఆ భూమిని ఇంకా అప్ప‌గించ‌వ‌ల‌సి ఉంది. 
* అలాగే, ద‌ల్భంగ‌ఢ్ విమానాశ్ర‌యాన్ని ఎ-320 ర‌కం విమానాల కార్య‌క‌లాపాల‌కు త‌గిన‌ట్టుగా అభివృద్ధి చేసేందుకు 545 ఎక‌రాల భూమిని ఎఎఐ కోరింది. 
* దియోగ‌ఢ్ విమానాశ్ర‌యానికి అప్రోచ్ రోడ్‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం పూర్తి చేయాల‌ని, ఎందుకంటే, విమానాశ్ర‌యం కార్య‌క‌లాపాల‌ను కొన‌సాగించేందుకు దాదాపు సిద్ధంగా ఉంది.

***
 


(रिलीज़ आईडी: 1749402) आगंतुक पटल : 147
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी