పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
రాష్ట్రంలో విమాన రంగ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయవలసిందిగా కర్నాటక ముఖ్యమంత్రికి లేఖ రాసిన జ్యోతిరాదిత్య సింధియా
प्रविष्टि तिथि:
26 AUG 2021 8:04PM by PIB Hyderabad
రాష్ట్రంలో విమానయాన మౌలిక సదుపాయాలను త్వరితగతిన బలోపేతం చేసేందుకు వ్యక్తిగతంగా చొరవ తీసుకోవలసిందిగా కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ సోమప్ప బొమ్మాయికి కేంద్ర విమానయాన మంత్రి జోత్యిరాదిత్య ఎం. సింధియా లేఖ రాశారు. దేశంలో పెరుగుతున్న ప్రయాణీకుల డిమాండ్‌ను తీర్చడానికి రానున్న 4-5 ఏళ్ళలో రూ. 20,000 కోట్ల వ్యయంతో దేశంలోని విమానాశ్రయాల అభివృద్ధిని, విస్తరణను ఎఎఐ చేపట్టింది.
విమానయాన రంగానికి సంబంధించిన ప్రాజెక్టుల అమలును ప్రభావితం చేస్తున్న అంశాలను సింధియా ముఖ్యమంత్రి బసవరాజ్ సోమప్ప బొమ్మాయ్ దృష్టికి తెచ్చారు. సింధియా పేర్కొన్న అంశాలుః
* బెలగావి విమానాశ్రయ విస్తరణకు ఎఎఐ 370 ఎకరాలను కోరగా, ఇప్పటి వరకూ 348.6 ఎకరాలను మాత్రమే అప్పగించారు.
* అలాగే, మైసూర్ విమానాశ్రయం కోసం 240 ఎకరాలను కేటాయించవలసిందిగా ఎఎఐ కోరింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఆ భూమిని ఇంకా అప్పగించవలసి ఉంది.
* వీటితో పాటుగా శివమొగ్గ, విజయపుర విమానాశ్రయాలలో కార్యకలాపాలను ప్రారంభించేందుకు కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని, తద్వారా ఆర్‌సిఎస్- ఉడాన్ (UDAN) 4.1 కింద వచ్చిన బిడ్లను అప్పగించేందుకు పరిగణించవచ్చు. అంతేకాకుండా, ఈ రెండు విమానాశ్రయాలకు సంబంధించి మార్గాలను అప్పగించేందుకు 100% విజిఎఫ్ మద్దతును ఇచ్చేందుకు తమ అంగీకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తెలియచేయాలి. ఎందుకంటే అవి రాష్ట్ర ప్రాంతీయ అనుసంధాన పథకం (స్టేట్ రీజినల్ కనెక్టివిటీ స్కీం - ఎస్‌సిఆర్ఎస్) కింద వస్తాయి.
ప్రాంతీయ వాయు అనుసంధాన నిధి ట్రస్టు ( రీజినల్ ఎయిర్ కనెక్టివిటీ ఫండ్ ట్రస్ట్ -ఆర్ఎసిఎఫ్‌టి)కు విజిఎఫ్ వాటా కింద రూ. 7.55 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం బాకాయి ఉంది.
***
(रिलीज़ आईडी: 1749399)
आगंतुक पटल : 144