నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ను జరుపుకుంటున్న నూతన, పునరావృత ఇంధన మంత్రిత్వ శాఖ
భారీ సంఖ్యలో వినియోగదారుల సంప్రదించేందుకు డిస్కం - వాలంటీర్ల చొరవ; సెల్ఫీలతో సోలార్ రూఫ్ టాప్ ప్రచారం నిర్వహణ
Posted On:
25 AUG 2021 7:11PM by PIB Hyderabad
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కింద 23 ఆగస్టు నుంచి 27 ఆగస్టు 2021 వరకు వివిధ కార్యక్రమాలను నూతన, పునరావృత ఇంధన మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది.
జర్మన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (జిఐజెడ్) మద్దతుతో మంళవారం నాడు వివిధ రాష్ట్రాలలో ఇంటికప్పు పై సోలార్ పరికరాలను ఏర్పాటు చేసుకోవడం పట్ల చైతన్యాన్ని పెంచేందుకు దిగువన పేర్కొన్న కార్యకలాపాలను నిర్వహించింది.
వెబినార్లు
మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలకు గృహ వినియోగదారులు, సోలార్ అంబాసిడర్లు, డిస్కం (DISCOM ) అధికారుల భాగస్వామ్యంతో వినియోగదారులకు వెబినార్లను నిర్వహించింది. ఈ క్రమంలో ఇంటికప్పుపై సోలార్ పరికరాల వల్ల కలిగే లబ్ధిని వినియోగదారులకు వివరించడమే కాక, ఇంటికప్పుపై సోలార్ పరికరాల ఏర్పాటుకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
విని
ఎక్కువమంది వినియోగదారుల సంప్రదించేందుకు డిస్కం - వాలంటీర్ల చొరవ
ఇంటికప్పు పై సోలార్ గురించి చైతన్యాన్ని తీసుకువచ్చేందుకు గుజరాత్‌లోని జియువిఎన్ఎల్, ఇతర డిస్కంలు గుజరాత్ వ్యాప్తంగా హోర్డింగ్‌లను, బానర్లు, పోస్టర్లను ఏర్పాటు చేశారు. దానితో పాటుగా డిస్కం అధికారులు గుజరాత్ వ్యాప్తంగా బహిరంగ ప్రచారాలు చేపట్టారు. సోలార్ అంబాసిడర్లు అని పిలిచే వాలంటీర్లు పలు ప్రదేశాలలో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయడమే కాక, ప్రజలు పథకం గురించి, పద్ధతి, సబ్సిడీ గురించి డిజిటల్ మాధ్యమం ద్వారా తెలుసుకునేందుకువాట్సాప్ చాట్‌బోట్ హెల్ప్ డెస్క్ నెంబర్‌ను ప్రజలకు పంచారు. గుజరాత్ డిస్కంల వాట్సాప్ చొరవ అన్నది దేశంలోనే తొలిసారి చేపట్టింది. దీనికి పెద్ద ఎత్తున ప్రతిస్పందన వచ్చింది, ఎందుకంటే వినియోగదారులు 9724300270 అన్న వాట్సాప్ నెంబరుకు హాయ్ అని మెసేజ్ చేస్తే, స్పందన వస్తుంది.
ఇంటికప్పుపై సోలార్ ప్రచారంలో సెల్ఫీలు
ఇప్పటికే తమ ఇళ్ళ కప్పులపై సోలార్‌ను ఏర్పాటు చేసుకున్న వినియోగదారులు, తాము ఏర్పాటు చేసుకున్న రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థలతో సెల్ఫీలు తీసుకుని, వాటిని సోషల్ మీడియాలో పంచుకున్నారు.
***
(Release ID: 1749091)
Visitor Counter : 247